HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telengana Minister Talasani Comments On Cinema Tickets

Tollywood : సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటాం!

సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు

  • Author : Balu J Date : 04-12-2021 - 12:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Talasani
Talasani

సినిమా టికెట్ల ధరల పెంపు పై త్వరలోనే ఒక నిర్ణయం తీసుకుంటామని రాష్ట్ర సినిమాటోగ్రఫీ శాఖా మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తెలిపారు. శుక్రవారం మాసాబ్ ట్యాంక్ లోని తన కార్యాలయంలో సినీ పరిశ్రమకు చెందిన నిర్మాతలు దిల్ రాజు, సూర్యదేవర రాధాకృష్ణ(చిన్న బాబు), సునీల్ నారంగ్, DVV దానయ్య, రాధాకృష్ణ, RRR డైరెక్టర్ రాజమౌళి, భీమ్లా నాయక్ కు స్క్రీన్ ప్లే అందిస్తున్న డైరెక్టర్ త్రివిక్రమ్ శ్రీనివాస్, పుష్ప ప్రొడ్యూసర్ నవీన్, వంశీ, బాల గోవింద రాజు, తెలంగాణ రాష్ట్ర ఫిల్మ్ చాంబర్ ఆఫ్ కామర్స్ కార్యదర్శి అనుపమ్ రెడ్డి, తదితరులు మంత్రి శ్రీనివాస్ యాదవ్ తో సమావేశమై పలు అంశాలపై చర్చించారు. అనంతరం మంత్రి శ్రీనివాస్ యాదవ్ మీడియాతో మాట్లాడుతూ లక్షలాది మంది ఉపాధి పొందే చిత్ర పరిశ్రమ గడిచిన 2 సంవత్సరాల నుండి కరోనాతో తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని, ఇప్పుడిప్పుడే తిరిగి తేరుకుంటుందని అన్నారు. కరోనా వ్యాప్తి చెందకుండా ప్రభుత్వ పరంగా ముఖ్యమంత్రి ఆదేశాలతో అన్ని రకాల చర్యలు చేపట్టడం జరుగుతుందని చెప్పారు. ప్రజలు కూడా ధైర్యంగా ఉండాలని, ఎలాంటి భయాందోళన చెందాల్సిన అవసరం లేదని అన్నారు. వ్యక్తిగత జాగ్రత్తలు పాటించడం ద్వారా ఆరోగ్యంగా ఉండగలమని చెప్పారు. థియేటర్ ల యాజమాన్యాలు కూడా ప్రభుత్వం నిర్దేశించిన మార్గదర్శకాలు పాటించాలని విజ్ఞప్తి చేశారు.

ఎలాంటి పరిస్థితులు వచ్చినా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. ప్రస్తుతం సాధారణ పరిస్థితులు నెలకొంటున్న తరుణంలో పుష్ప, RRR, ఆచార్య, భీమ్లా నాయక్ వంటి భారీ బడ్జెట్ తో నిర్మించిన చిత్రాలు విడుదలకు సిద్దం అవుతున్నాయని వివరించారు. ఈ సమావేశంలో పాల్గొన్న సినీ ప్రముఖులు సినిమా నిర్మాణ వ్యయాలు అత్యధికంగా ఉన్నాయని, థియేటర్ ల నిర్వహణ ఖర్చు గతంలో కన్నా అనేక రెట్లు పెరిగిందని వివరించారు. కరోనా వల్ల సుమారు 2 సంవత్సరాలకు పైగా పూర్తిగా నష్టాల ఊబిలో కూరుకుపోయిందని, ఈ క్రమంలో ఇప్పుడిప్పుడే సాధారణ స్థితికి వస్తున్నాయని, తెలియజేస్తూ టికెట్ ధరల పెంపుపై ఒక తుది నిర్ణయం తీసుకొని ధరలు పెంచి సినిమా రంగాన్ని ఆదుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై మంత్రి శ్రీనివాస్ యాదవ్ స్పందిస్తూ దేశంలోని ఇతర రాష్ట్రాల్లో అమలు అవుతున్న టికెట్ల ధరల పై అధ్యయనం చేసి ఎగ్జిబిటర్ లకు కానీ, నిర్మాతలకు కానీ ఎలాంటి ఇబ్బంది కలగని రీతిలో ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దృష్టికి తీసుకెళ్లి తగు నిర్ణయం తీసుకుంటామని మంత్రి శ్రీనివాస్ యాదవ్ హామీ ఇచ్చారు. ఈ సమావేశంలో FDC ED కిషోర్ బాబు తదితరులు కూడా పాల్గొన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • latest tollywood news
  • tickets
  • tollywood

Related News

Tollywood actor nara rohith is going to become a father

Nara Rohit Siri : తల్లిదండ్రులు కాబోతున్న నారా రోహిత్

టాలీవుడ్ హీరో నారా రోహిత్, ఆయన భార్య, హీరోయిన్ సిరి త్వరలోనే తల్లిదండ్రులు కాబోతున్నారనే వార్త నారా అభిమానుల్లో, సినీ వర్గాల్లో ఎంతో సంతోషాన్ని నింపుతోంది. సినిమాల ఎంపికలో ఎంతో వైవిధ్యం చూపే రోహిత్, ఇప్పుడు తన వ్యక్తిగత జీవితంలో అత్యంత మధురమైన ఘట్టంలోకి అడుగుపెడుతుండటం విశేషం. నారా రోహిత్, సిరి ‘ప్రతినిధి-2’ చిత్రంలో కలిసి నటించారు. ఆ సినిమా సమయంలో ఏర్పడిన పరిచయం కాస్

  • Spirit Release Date

    Spirit : ప్రభాస్ ఫ్యాన్స్ కు గుడ్ న్యూస్ తెలిపిన ‘స్పిరిట్’ టీం

Latest News

  • West Bengal Result 2026 : బెంగాల్లో కాంగ్రెస్ ‘జీరో’

  • Rahul : సెంచరీకి చేరువలో రాహుల్ అంటూ పరువు తీసిన బిజెపి

  • Kerala: ఎర్ర జెండా ను పట్టించుకోని ఓటర్లు

  • West Bengal Result 2026 : మమతా బెనర్జీ కీలక ప్రకటన

  • Trisha at Vijay House : విజయ్ ఇంటికి వెళ్లి అభినందనలు తెలిపిన త్రిష

Trending News

    • మీ మొబైల్‌ ఫోన్లలో పెద్ద సైరన్ మెసేజ్ వచ్చిందా.. భయపడవద్దని కేంద్రం సూచన

    • ప్రపంచ రికార్డుకు కేవలం ఒక సిక్స్ దూరంలో వైభ‌వ్ సూర్య‌వంశీ!

    • ట్రంప్‌ను త‌ప్పుదోవ ప‌ట్టిస్తున్నారా? జెడి వాన్స్ ఆందోళ‌న‌!

    • ఐపీఎల్ 2026.. ఆ జ‌ట్టు కెప్టెన్‌పై క‌ఠిన చ‌ర్య‌లు!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd