HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telanganas Number One Villain Congress Ktr Fire On Rahul

KTR: తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, రాహుల్ పై కేటీఆర్ ఫైర్

సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు.

  • Author : Balu J Date : 19-10-2023 - 11:49 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
ktr-about-brs-candidates-list
ktr-about-brs-candidates-list

KTR: రాజకీయ పార్టీల నేతలు ఒకరిపై ఒకరు, పార్టీలపై తీవ్ర విమర్శలు చేసుకుంటున్నారు. ఇక, రాష్ట్రంలో ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్‌ బస్సు యాత్ర చేపట్టింది. అయితే, బస్సు యాత్రపై మంత్రి కేటీఆర్‌ స్పందించి కాంగ్రెస్‌కు పొలిటికల్‌ కౌంటరిచ్చారు. మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ వేదికగా స్పందించారు. ‘కాంగ్రెస్ బస్సుయాత్ర.. తుస్సుమనడం ఖాయమని, సంక్షేమంలో స్వర్ణయుగానికి కేరాఫ్ తెలంగాణ. చీకటి పాలనకు చిరునామా కర్ణాటక అని ఆయన అన్నారు. గత పదేళ్ల కాలంలో గిరిజన యూనివర్సిటీపై రాహుల్ ఎందుకు నోరుమెదపలేదని, బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీపై ఒక్కసారైనా ఎందుకు బీజేపీని నిలదీయలేదని కేటీఆర్ ప్రశ్నించారు.

‘‘ విభజన హామీలపై ఏనాడూ ఎన్డీఏను ప్రశ్నించని రాహుల్‌కు తెలంగాణలో పర్యటించే అర్హత లేదు. కర్ణాటకలో ప్రజలకిచ్చిన హామీలన్నీ వందరోజుల్లోనే బొందపెట్టిన పార్టీ మీది. మ్యానిఫెస్టోలో ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ప్రభుత్వం మాది. కర్ణాటకలో రైతులకు ఐదుగంటల కరెంట్ కూడా ఇవ్వలేమని చేతులెత్తేసిన చేతకాని దద్దమ్మలు మీరు. రైతులకు 24 గంటలు నిరంతర ఉచిత విద్యుత్ అందిస్తూ.. తెలంగాణలో సాగును సంబురంగా మార్చిన పాలన మాది. నమ్మి ఓటేసిన కర్ణాటక ప్రజలను నట్టేట ముంచి తెలంగాణలో నాటకాలకు తెరతీస్తే నమ్మేదెవరు.. కరప్షన్‌కు కేరాఫ్… కాంగ్రెస్. కమీషన్ల కోసం కాంట్రాక్టర్లకు నిత్యం వేధింపులు.. ఇక్కడికొచ్చి నీతి వాఖ్యలా ?? అని కేటీఆర్ మండిపడ్డారు.

‘‘దశాబ్దాలుగా పోడుభూముల సమస్యను కోల్డ్ స్టోరేజీలో పెట్టింది మీరు.. 4.50 లక్షల ఎకరాల భూములు పంచి అడవిబిడ్డలకు పట్టాభిషేకం చేసిన ప్రభుత్వం మాది. శ్రీకాంతాచారిని బలితీసుకున్న కాంగ్రెస్‌కు ఆ అమరుడి పేరెత్తే హక్కు లేదు. తెలంగాణ ఏర్పాటులో పదేళ్ల జాప్యమే.. వందల మంది బలిదానాలకు కారణం. నిన్నఅయినా.. నేడు అయినా.. రేపు అయినా.. తెలంగాణకు నంబర్ వన్ విలన్ కాంగ్రెస్, గాంధీభవన్‌ను గాడ్సేకు అప్పగించిన నాడే..తెలంగాణ కాంగ్రెస్‌కు కౌంట్ డౌన్ మొదలైంది. ల్యాండ్ మాఫియాకు కేరాఫ్ మీ పీసీసీ చీఫ్‌. టిక్కెట్ల కోసం కోట్ల సొమ్ముతోపాటు భూములు రాయించుకుంటున్న రాబంధు రేవంత్‌. రిమోట్ పాలన గురించి మీరా మాట్లాడేది..?? రిమోట్ కంట్రోల్ పాలనకు కేరాఫ్ మీ టెన్ జనపథ్..’’ అంటూ కేటీఆర్ ట్విట్టర్ వేదికగా రియాక్ట్ అయ్యారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • brs party
  • hard comments
  • ktr
  • rahul gandhi

Related News

Trump's harsh comments on India.. Is that why Modi is silent?: Rahul Gandhi asks

Tamil Nadu Election 2026 : రాహుల్ గాంధీ సంచలన వ్యాఖ్యలు

ఎన్నికల బరిలో గెలుపే లక్ష్యంగా యూడీఎఫ్ కూటమి భారీ హామీలను ప్రకటించింది. అధికారంలోకి వస్తే మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం, కాలేజీ విద్యార్థినులకు నెలకు రూ.1000 ఆర్థిక సాయం, మరియు సంక్షేమ పింఛన్లను ఏకంగా

    Latest News

    • Price Hike : ఏసీ, స్మార్ట్ టీవీ కొనుగోలు చేసేవారికి బ్యాడ్ న్యూస్

    • బ్లడ్ క్యాన్సర్ అంటే ఏమిటి? ఎందుకు ప్రమాదకరం?

    • నారాయణపేట జిల్లాలో దారుణం : పదో తరగతి విద్యార్థినిపై టీచర్ అఘాయిత్యం..బయటపెట్టిన సీక్రెట్ కెమెరా

    • రూ. 25.20 కోట్లకు కొనుగోలు.. బౌలింగ్‌కు దూరంగా ఆల్‌రౌండ‌ర్‌?!

    • Green S** : పర్యావరణ హిత శృంగారాన్ని కోరుకుంటున్న యువత ..ఏంటి పర్యావరణ హిత శృంగారం ?

    Trending News

      • నేడు సీఎస్కే- ఆర్ఆర్ మ‌ధ్య పోరు.. హెడ్-టు-హెడ్ రికార్డులివే!!

      • AP Assembly: అమరావతికి చట్టబద్ధత

      • Allahabad High Court: పెళ్లయిన వ్యక్తి మరో మహిళతో సహజీవనం చేయడం తప్పు కాదు: అలహాబాద్ హైకోర్టు సంచలన తీర్పు

      • Commercial LPG: గుడ్ న్యూస్.. వాణిజ్య సిలిండర్ల సరఫరా పెంచిన కేంద్రం

      • Gold Price: యూటర్న్ తీసుకుంటున్న పసిడి ధరలు

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd