Kedarnath Bicycle Trip: సైకిల్ పై సాహాసం, జనగాం నుంచి కేథార్ నాథ్ వరకు ఆధ్యాత్మిక యాత్ర
జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు.
- Author : Balu J
Date : 03-08-2023 - 3:53 IST
Published By : Hashtagu Telugu Desk
సంకల్పంతో పాటు దైవశక్తి తోడైతే ఏదైనా సాధించవచ్చు. అందుకు ఉదాహరణే ఈ కుర్రాడు. జనగాం చెందిన 19 ఏళ్ల యువకుడు తన స్వస్థలం నుండి ఉత్తరాఖండ్‌లోని కేదార్‌నాథ్ ఆలయానికి 4000 కి.మీల సైకిల్ యాత్రను పూర్తి చేశాడు. పగిడిపల్లి రాజు జూలై 13న తన యాత్రను ప్రారంభించి వారణాసి మీదుగా జూలై 29న కేదార్‌నాథ్ చేరుకున్నారు.
శివుని భక్తుడైన రాజు, చిన్నప్పటి నుండి సైకిల్ తొక్కడం ఇష్టం. అయితే రోజురోజుకూ వాహనాల సంఖ్య పెరిగిపోతుండటం, అదే స్థాయిలో కాలుష్యం వెదజల్లి పర్యావరణం దెబ్బతినడం గమనించాడు. అందుకే పర్యావరణమైన యాత్ర చేయాలనుకున్నాడు. రెండేళ్ల క్రితం రూ. 17,500కి నాన్-గేర్ సైకిల్ ను కొనుగోలు చేశాడు. వేములవాడ దేవాలయం, మేడారం గిరిజన పుణ్యక్షేత్రం, మహారాష్ట్రలోని రాయగఢ్‌తో సహా పలు ప్రాంతాలకు వెళ్లాడు. జీవితంలో ఒక్కసారైనా కేదార్‌నాథ్ ఆలయాన్ని దర్శించుకోవాలని గట్టిగా ఫిక్స్ అయ్యాడు. శివుని పట్ల తనకున్న భక్తి తోసైకిల్ యాత్ర కు శ్రీకారం చుట్టాడు.
తన యాత్రలో, రాజు జూలై 19న వారణాసిలో ఆగాడు. అక్కడ కేదార్‌నాథ్ కు స్థానిక ఆలయంలో ప్రార్థనలు చేశాడు. దారిలో కర్ణప్రయాగ, గుప్తకాశీ సందర్శించారు. రుద్రప్రయాగ్ బేస్ క్యాంప్‌లో, రాజు ఇండో-టిబెటన్ బోర్డర్ పోలీస్ (ITBP) సభ్యులను కలిసే అవకాశం దక్కించుకున్నాడు. అక్కడి నుంచి 50 కిలోమీటర్లు నడిచి కేదార్‌నాథ్ చేరుకున్నారు. తన ప్రయాణంలో, రాజు ప్రతిరోజూ 130 నుండి 140 కి.మీల దూరం సైకిల్ ప్రయాణం చేసి పెట్రోల్ పంపులు, దేవాలయాల దగ్గర ఆశ్రయం పొందాడు. ఆగస్టు 3న ఇంటికి తిరిగి వచ్చిన తరువాత, రాజు తన చదువును కొనసాగిస్తున్నాడు. అతని తల్లిదండ్రులు పట్టణంలో హోటల్ నడుపుతున్నారు.
Also Read: Spinach Benefits: పాలకూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేమిటో తెలుసుకోండి