Spinach Benefits: పాలకూరతో బోలెడు ఆరోగ్య ప్రయోజనాలు.. అవేమిటో తెలుసుకోండి
చాలామంది ఆకుకూరలను తేలిగ్గా తీసిపారేస్తుంటారు. కానీ వాటి వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి.
- Author : Balu J
Date : 03-08-2023 - 3:09 IST
Published By : Hashtagu Telugu Desk
ఆకుకూరల్లోనే పాలకూర ఎంతో మేలైనదీ. పాల కూర తినటం వల్ల అనేక రోగాలు మనదరి చేరకుండా చూసుకోవచ్చు. పాల కూరలో యాంటీ ఆక్సీ డెంట్స్, విటమిన్స్ పుష్కలంగా ఉన్నాయి.పాలకూరలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీని కారణంగా జీర్ణసమస్యలు దూరంఅవుతాయి. శరీరానికి అవసరమైన విటమిన్ కె లభిస్తుంది. మలబద్ధకం నుండి విముక్తి పొందవచ్చు.
పాలకూరను ఆహారంలో భాగం చేసుకుంటే గుండె జబ్బులను దూరం చేసుకోవచ్చు. పాలకూరలో ఉండే విటమిన్స్, యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తాయి. పాలకూరలోని విటమిన్ బి శరీర మెటబాలిజాన్ని మెరుగుపరుస్తుంది. పాలకూరను రసంలా తీసి అందులో కాస్త అల్లం, నిమ్మరసం చేర్చి తీసుకుంటే అధిక బరువు కంట్రోల్ అవుతుంది. పాలకూరను ఉడికించుకుని ఆ రసంలో కొద్దిగా ఉప్పు, కూరగాయలు వేసి సూప్‌లా చేసుకుని తాగవచ్చు. కిడ్నీ స్టోన్స్ సమస్య వున్నవారు పాలకూరను తీసుకోరాదు.
పాలకూరలో వుండే పొటాషియం, కండరాలను బలంగా ఉండేలా చేస్తుంది. విటమిన్ ఎ వలన చర్మం ఆరోగ్యంగా మెరిసేలా చేస్తుంది. పొటాషియం, రక్త ప్రసరణ బాగా జరిగేలా చేస్తుంది. పాలకూరలో వుండే విటమిన్ కె, జుట్టు ఊడిపోకుండా బలంగా ఉండేలా చేస్తుంది. ఇందులో వుండే ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్, త్వరగా ముసలితనం త్వరగా దరిచేరదు. శరీరంలో ఉండే చెడు వ్యర్థాల్ని బయటకు పంపుతుంది.
Also Read: SSMB29 Big Update: మహేశ్ ప్యాన్స్ కు రాజమౌళి గుడ్ న్యూస్, బర్త్ డేకు అదిరిపొయే అనౌన్స్ మెంట్