HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Top In Economic Growth Rate In The Country

Telangana: దేశంలోనే ఆర్థికవృద్ధి రేటులో ‘తెలంగాణ’ టాప్

#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ  ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది.

  • Author : Balu J Date : 02-03-2022 - 4:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Hyd
Hyd

#TriumphantTelangana.. #ThankYouKCR హ్యాష్ ట్యాగ్ లతో బుధవారం ట్విట్టర్ హోరెత్తిపోయింది. దేశంలోనే ఆర్ధిక వృద్ధిరేటులో తెలంగాణ మొదటిస్థానంలో నిలవడం తెలంగాణ  ప్రజలకు ఎంతో సంతోషాన్నిచ్చింది. రాష్ట్రం సాధించుకున్న సందర్భంలో తెలంగాణ నాయకులకు అసలు పరిపాలన చేతనవుతుందా అని మొదలైన అపోహల నుంచి నేడు ఎనిమిదేళ్ల కాలంలో అత్యధిక వృద్ధిరేటు సాధించి  తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.

కేవలం ఒక రంగం అన్ని కాకుండా అన్ని రంగాల్లో గణనీయ పురోగతిని సాధించి నేడు దేశానికే దిక్సూచిగా నిలబడింది. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని మంత్రి కేటీఆర్ తెలంగాణ ఆర్థిక పురోభివృద్ధి విషయంలో అన్ని గణాంకాలను కోట్ చేస్తూ ట్వీట్ చేయడం జరిగింది. తెలంగాణ ఆర్థిక వృద్ధిని ప్రశంసిస్తూ పలువురు విదేశీ ప్రముఖులు సైతం కేటీఆర్ చేసిన ట్వీట్ రీ-ట్వీట్ చేస్తూ ప్రశంసించడం జరిగింది. మరోవైపు కేటీఆర్ ట్వీట్ ను సమర్థిస్తూ..  సోషల్ మీడియాలో పెద్దఎత్తున నెటిజన్లు స్పందించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు, ఎన్నారైలు, తెలంగాణ యావత్ సమాజం కళ్లెదుట కనిపిస్తున్న అభివృద్ధిని ప్రశంసిస్తూ.. వివిధ రంగాల్లో సాధించిన పురోగతిని గణాంకాలతో తమ ట్వీట్ల ద్వారా వివరించారు. ఉద్యమ నాయకుడే పాలకుడైతే అభివృద్ధి ఎలా పరుగులు పెడుతుందో చెప్పడానికి తెలంగాణ రాష్ట్రమే ఒక పెద్ద ఉదాహరణ అంటూ.. కోట్లాడి సాధించుకున్న తెలంగాణ ఎనిమిదేళ్లలో తానేమిటో యావత్ దేశానికి చూపించిందని, కేసీఆర్ దార్శనిక పాలనకు తెలంగాణ ఆర్ధిక వృద్ధి రేటు ఒక నిదర్శనమని పేర్కొన్నారు.

కొత్తగా ఏర్పడిన రాష్ట్రం.. కేంద్రంలోని మోడీ సర్కార్ నుండి సహాయ నిరాకరణ ఎదురైనా.. సొంతంగా తన కాళ్ళ మీద తానూ నిలబడిందని.. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా నేడు జరుగుతన్న అభివృద్ధి భావి తెలంగాణకు గొప్ప భరోసా అని నెటిజన్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ విషయంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును, వివక్షను పెద్దఎత్తున ఎండగట్టారు. 2014 లో 5 లక్షలుగా ఉన్న జీఎస్డీపీ 2022 నాటికి 130 శాతం  అభివృద్ధిని నమోదు చేస్తూ 11.54 కోట్లకు ఒక్క కేసీఆర్ గారి పాలనా సామర్థ్యం తోనే సాధ్యమయింది అని నెటిజన్లు అభిప్రాయపడ్డారు. మొత్తం మీద 50 వేలకు పైగా ట్వీట్లతో ట్విట్టర్లో #TriumphantTelangana హ్యాష్ ట్యాగ్ హోరెత్తి దేశ ప్రజలను, జాతీయ మీడియాను ఆకర్షించింది.

IT and Industries Minister @KTRTRS addressed the industry leaders at the @FollowCII Telangana State Leadership Summit 2021-22 in Hyderabad. #TriumphantTelangana pic.twitter.com/O1YH9aeNMa

— KTR, Former Minister (@MinisterKTR) March 2, 2022


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • economic
  • india
  • telangana
  • top place

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Four gangsters killed in encounter in Gurugram

    Police Encounter: 11 ఏళ్ల బాలికపై అత్యాచారం.. హత్య కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎన్‌కౌంటర్‌

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

  • Elite Eco Energies: భీమవరంలో అత్యాధునిక షోరూమ్ ‘ఎలైట్ ఎకో ఎనర్జీస్’ ప్రారంభం

  • Herbalife India : ఫార్ములా 1 షేక్స్‌లో ‘డేట్స్ కారామెల్’ ఫ్లేవర్ విడుదల!

  • Indian Railways: రైల్వే ప్రయాణికులకు బిగ్ షాక్.. రైల్ టికెట్లను స్క్రీన్ షాట్ తీసి చూపించలేరు!

  • PM Modi: న్యూజిలాండ్‌లో తొలిసారి అడుగుపెట్టిన భారత ప్రధాని

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

    • Kalyan Ram : సంక్రాంతి 2027కు సిద్ధమవుతున్న అనిల్ రావిపూడి.. కళ్యాణ్ రామ్ ఫస్ట్ లుక్‌ పోస్టర్ విడుదల !

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd