Telangana Global Summit: ఏ ఏ హాల్ లో ఏ ఏ అంశంపై చర్చించనున్నారంటే..!!
Telangana Global Summit: ప్రచారాన్ని పీక్స్‌లో ఉంచిన ప్రభుత్వం, అదే స్థాయిలో ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించగలదా అనే ఉత్కంఠ అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలలో కూడా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో, ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే
- Author : Sudheer
Date : 08-12-2025 - 1:15 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2047 ఈ రోజు ప్రారంభం కానుంది. ప్రచారాన్ని పీక్స్‌లో ఉంచిన ప్రభుత్వం, అదే స్థాయిలో ఈ సమ్మిట్ ద్వారా పెట్టుబడులను ఆకర్షించగలదా అనే ఉత్కంఠ అధికార కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలలో కూడా ఉంది. ఫ్యూచర్ సిటీలో ఏర్పాటు చేసిన ఈ సదస్సులో, ప్రారంభోత్సవ సమావేశం ముగియగానే, రాష్ట్ర భవిష్యత్తుకు అవసరమైన అభివృద్ధి ప్రణాళికలు మరియు ప్రపంచ మార్పులకు అనుగుణంగా వివిధ రంగాలపై చర్చలు ప్రారంభమవుతాయి. మొదటి రోజున మొత్తం 12 అంశాలపై ప్రధాన వేదికకు సమాంతరంగా ఏర్పాటు చేసిన నాలుగు మీటింగ్ హాల్స్‌లో ప్యానెల్ చర్చలు జరగనున్నాయి. ఈ చర్చలలో ఆయా శాఖల మంత్రులు, నిపుణులు మరియు మేధావులు పాల్గొని రాష్ట్ర అభివృద్ధి మార్గాలను విశ్లేషిస్తారు.
Telangana Rising Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేకతలు ఇవే !!
మొదటి రోజు చర్చలు మధ్యాహ్నం 3 గంటల నుండి ప్రారంభమవుతాయి, ఇందులో కీలకమైన నాలుగు సెషన్‌లు జరగనున్నాయి. మొదటి సెషన్ (3:00-4:00 PM) లో హాల్ 1లో ‘The Just Transition into 2047 – Powering Telangana’s Future’ అంశంపై గ్రీన్ ఎనర్జీ దిశగా ముందడుగు గురించి చర్చిస్తారు. హాల్ 2లో ‘Green Mobility 2047 – Zero Emission Vehicles’ పై, అంటే ఎలక్ట్రిక్ వాహనాలు మరియు నాన్-ఎమిషన్ టెక్నాలజీపై దృష్టి సారిస్తారు. హాల్ 3లో ‘Tech Telangana 2047’ పేరుతో సెమీకండక్టర్లు మరియు ఫ్రంటియర్ టెక్నాలజీ అవకాశాలపై చర్చలు జరుగుతాయి. హాల్ 4లో ‘Telangana as a Global Education Hub’ అంశంపై తెలంగాణను ప్రపంచ విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే వ్యూహాలపై చర్చిస్తారు. ఈ సెషన్స్ తెలంగాణ భవిష్యత్తును సాంకేతికం, శక్తి మరియు విద్య అనే కీలక మూల స్తంభాలపై నిర్మించడానికి ప్రయత్నిస్తాయి.
Telangana Future City : ఫ్యూచర్ సిటీ రోడ్డుకు ‘రతన్ టాటా’ పేరు
రెండవ సెషన్ (4:15-5:15 PM)లో ఏరోస్పేస్ & డిఫెన్స్, ఆరోగ్య రంగం (A Healthy Telangana for Prosperous Telangana) మరియు అంతర్జాతీయ అవకాశాలు (Talent Mobility) వంటి అంశాలు ఉంటాయి. హాల్ 4లో కొరియా, ఆస్ట్రేలియా వంటి దేశాలతో సాంకేతిక, నైపుణ్యాల సహకారం మరియు పెట్టుబడి భాగస్వామ్యంపై ప్రత్యేక చర్చలు జరుగుతాయి. ఇక చివరిదైన మూడవ సెషన్ (5:30-6:30 PM)లో మరింత వైవిధ్యభరితమైన అంశాలు ఉన్నాయి. ఇందులో ఆసియా దేశాలతో (ASEAN Tigers) ఆర్థిక భాగస్వామ్యం (హాల్ 1), గిగ్ ఎకానమీ (హాల్ 2), మరియు రైతుల ఆదాయం పెంచే RARE వ్యూహం (హాల్ 3) పై దృష్టి సారిస్తారు. హాల్ 4లో కెనడాతో సహకార భాగస్వామ్యాలు మరియు పారిశ్రామికవేత్తలుగా మహిళల సాధికారతపై రెండు సెషన్లు ఉంటాయి. ఈ 12 అంశాల చర్చా వేదికలు తెలంగాణను ఆర్థికంగా, సాంకేతికంగా, మరియు సామాజికంగా బలోపేతం చేయడానికి మార్గం సుగమం చేస్తాయి.