Covid Cases: తెలంగాణలో కొత్త కరోనా కేసులివే!
తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి.
- By Balu J Published Date - 11:02 AM, Sat - 18 June 22

తెలంగాణలో రోజువారీ కరోనా కేసులు పెరుగుతూనే ఉన్నాయి. గడిచిన 24 గంటల్లో 279 కేసులు నమోదయ్యాయి. వాటిలో 172 GHMC పరిధిలోని ప్రాంతాలకు చెందినవి. 62 రంగారెడ్డి, 20 మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలకు చెందినవి. శుక్రవారం యాక్టివ్ కోవిడ్ కేసుల సంఖ్య 1781కి చేరుకుంది. 119 మంది వ్యక్తులు కోలుకున్నారని కోవిడ్ హెల్త్ బులెటిన్ తెలిపింది. ఆరోగ్య శాఖ 27,841 కోవిడ్ ర్యాపిడ్ పరీక్షలను నిర్వహించగా, వాటిలో 494 నమూనాల ఫలితాలు రావాల్సి ఉంది. మొత్తంమీద, ఆరోగ్య శాఖ ఇప్పటివరకు 3,52,76,109 కోవిడ్ పరీక్షలను నిర్వహించింది.