Telangana Paddy Record: వరి సాగులో తెలంగాణ దేశంలోనే నెం 1 – ఉత్తమ్ కుమార్ ఫుల్ హ్యాపీ
Telangana Paddy Record : తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు రైతు సంక్షేమ కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టుల అమలు తీరు వల్ల ఈరోజు వరి సాగు , ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటి తెలంగాణ దేశంలోనే నెం 1 స్థానానికి చేరుకుంది
- By Sudheer Published Date - 02:01 PM, Sun - 17 November 24

వరి సాగు విషయంలో తెలంగాణ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో (Telangana Paddy Record) నిలిచింది.ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు రైతు సంక్షేమ కార్యక్రమాలు, నీటి ప్రాజెక్టుల అమలు తీరు వల్ల ఈరోజు వరి సాగు , ధాన్యం ఉత్పత్తిలో పంజాబ్ ను దాటి తెలంగాణ దేశంలోనే నెం 1 స్థానానికి చేరుకుంది. వర్షాకాలం సీజన్లో గతంలో ఎన్నడూ లేని విధంగా 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో వరిసాగు జరిగింది. అలాగే దిగుబడిలో ఏకంగా 153 లక్షల టన్నులతో రికార్డు నెలకొల్పింది. దీనిపట్ల మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar Reddy) సంతోషం వ్యక్తం చేసారు.
తెలంగాణ పంటల దిగుబడిలో చరిత్ర సృష్టించింది. ప్రస్తుత ఖరీఫ్ సీజన్‌లో 66.77 లక్షల ఎకరాల విస్తీర్ణంలో 153 లక్షల మెట్రిక్ టన్నుల వరి ఉత్పత్తి సాధించడం గొప్ప విశేషం. ఇది తెలంగాణ రాష్ట్ర చరిత్రలోనే కాకుండా, ఏకైక ఆంధ్రప్రదేశ్ చరిత్రలో కూడా ఇప్పటివరకు ఎవరూ సాధించని అత్యున్నత పంట దిగుబడిగా నిలిచింది. దేశంలో ఏ రాష్ట్రంలోనైనా ఈ విధంగా ఒకే ఏడాది ఇంత వరి ఉత్పత్తి కాలేదు. కాలేశ్వరం ప్రాజెక్ట్ బ్యారేజీలు ఈ ఖరీఫ్ సీజన్‌లో పనిచేయకపోయినా ఇంతమేర ఉత్పత్తి అయ్యిందంటే ఎంతో గర్వకారణం. తెలంగాణ రైతుల పట్టుదల, రైతు సంక్షేమ పథకాలు, వ్యవసాయ మరియు పునరుద్ధరణ ప్రయత్నాలు ఈ రికార్డు సాధించేలా చేశాయని ఉత్తమ్ కొనియాడారు. ఈ అరుదైన విజయం సాధించిన తెలంగాణ రైతులు, వ్యవసాయ శాఖ, నీటిపారుదల అధికారులందరికీ హృదయపూర్వక అభినందనలు. తెలంగాణ వ్యవసాయ రంగం దేశానికి ఆదర్శంగా నిలుస్తూ, ప్రతిసారీ కొత్త చరిత్ర సృష్టిస్తోంది..అని ఉత్తమ్ పేర్కొన్నారు.
ఇటు సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) సైతం ట్విట్టర్ వేదికగా రాష్ట్రంలో వరి దిగుబడిపై రైతులకు అభినందనలు తెలియజేశారు. X (ట్విట్టర్) లో చేసిన పోస్టులో, ఆయన రైతులను “దేశ గర్వకారణం”గా అభివర్ణిస్తూ, వారి కష్టపడి సాధించిన విజయానికి తన మన్ననలు తెలిపారు.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత తొలిసారి రికార్డు స్థాయిలో వరిధాన్యం పండింది.
ఇది తెలంగాణ రైతుల ఘనత…
వారి శ్రమ, చెమట, కష్టం ఫలితం…
తెలంగాణ రైతు దేశానికే గర్వకారణం…
ఈ ఘనత సాధించిన ప్రతి రైతు సోదరుడికి హృదయపూర్వక అభినందనలు.
కాళేశ్వరం వల్లే తెలంగాణలో వరి సాగు పెరిగిందన్న బీఆర్ఎస్ తప్పుడు ప్రచారం పటాపంచలైంది.
కాళేశ్వరంలో భాగమైన మేడిగడ్డ కుంగి… నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా…
ఎన్డీఎస్ఎ సూచన మేరకు అన్నారం, సుందిళ్లలోనీటిని నిల్వ చేయకపోయినా…
కాళేశ్వరంతో సంబంధం లేకుండా తెలంగాణ ఆవిర్భావం తర్వాత… pic.twitter.com/7FXH4v2ZMq— Revanth Reddy (@revanth_anumula) November 17, 2024
I am happy to announce that Telangana has produced record production of 153 lakh metric tonnes of paddy in a record acreage of 66.77 lakh acres in the present kharif crop. This is the highest paddy production in the history of Telangana or in combined Andhra Pradesh. pic.twitter.com/ZRvqas3exm
— Uttam Kumar Reddy (@UttamINC) November 17, 2024