Telangana: కాంగ్రెస్ లోకి మల్లారెడ్డి ఫ్యామిలీ.. రేపే ముహూర్తం
మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది
- By Praveen Aluthuru Published Date - 02:55 PM, Thu - 14 March 24
Telangana: తెలంగాణ రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్నాయి. లోకసభ ఎన్నికల నేపథ్యంలో అధికార పార్టీ కాంగ్రెస్ లోకి భారీగా చేరికలు వచ్చి పడుతున్నాయి. బీఆర్ఎస్ నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు సైతం పార్టీ మారేందుకు సిద్ధమయ్యారు. తాజాగా బీఆర్ఎస్ మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్ధమయ్యారు
మల్లారెడ్డి, అతని తనయుడు భద్రా రెడ్డి, మల్కాజ్ గిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి బెంగళూరులో డీకే శివకుమార్‌తో భేటీ కావడం సంచలనంగా మారింది. కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ను బెంగళూరులోని ఓ హోటల్లో కలిసి వీరంతా మంతనాలు జరిపారు. కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు మల్లారెడ్డి రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రేపు ప్రియాంక గాంధీ అపాయింట్‌మెంట్‌ను మల్లారెడ్డి కుటుంబ సభ్యులు కోరినట్లు తెలిసింది. మల్కాజిగిరి నుంచి కాంగ్రెస్ పార్టీ తరుపున భద్రారెడ్డి పోటీ చేస్తారని సమాచారం.
Also Read: New Election Commissioners: నూతన ఎన్నికల కమిషనర్లుగా సుఖ్‌బీర్ సంధు, జ్ఞానేశ్ కుమార్!