KTR : అమెరికాలో KTR తెలంగాణ నీటి విజయాల పాఠాలు చెప్తారట.. KTR అమెరికా పర్యటన..
అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో KTR పాల్గొని ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాల గురించి చెప్తారట.
- Author : News Desk
Date : 16-05-2023 - 4:00 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ మంత్రి KTR నేడు అమెరికాకు(America) బయలుదేరనున్నారు. వారం వరకు KTR అమెరికాలోనే ఉంటారు. అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో KTR పాల్గొనబోతున్నట్టు సమాచారం. ఈ కార్యక్రమంలో పాగోనేందుకే KTR అమెరికా వెళ్తున్నారు.
అమెరికన్ సొసైటీ ఆఫ్ సివిల్ ఇంజనీర్స్ నిర్వహిస్తున్న వరల్డ్ ఎన్విరాన్మెంటల్ అండ్ వాటర్ రిసోర్సెస్ కాంగ్రెస్ సదస్సులో KTR పాల్గొని ప్రపంచానికి తెలంగాణ నీటి విజయాల పాఠాల గురించి చెప్తారట. ఈ కార్యక్రమంలో ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరం, మిషన్ భగీరథ ప్రాజెక్టుల నిర్మాణం, వాటి ఫలితాల పైన ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. తెలంగాణ సాగునీటి రంగ విజయాలను, మిషన్ భగీరథ ప్రాజెక్టు గురించి తెలియజేసేందుకు తమ సదస్సుకు హాజరు కావాలని వారు ఆహ్వానించడంతో KTR అమెరికా పర్యటన చేస్తున్నారు.
అలాగే ఈ అమెరికా పర్యటనలోనే తెలంగాణాలో పెట్టుబడుల కోసం పలు దిగ్గజ కంపెనీలతో కూడా సమావేశం కానున్నట్టు సమాచారం. ఈ పర్యటనతో కొన్ని కంపెనీలను ఎలాగైనా తెలంగాణలో పెట్టుబడులు పెట్టడానికి తీసుకురావాలని చూస్తున్నారు KTR.
Also Read : BRS Plan: ఏపీలో BRS ఎత్తుగడ! కాంగ్రెస్ తో కలిసి మహా కూటమి దిశగా..!