HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Minister Harish Rao React On Rajinikanth Speech Here Is Why

Harish on Rajinikanth: రజినీకి అర్ధమైంది కానీ.. గజినీలకు అర్థంకావడం లేదు: హరీశ్ రావు

సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీసీ నాయకుల్లో తీవ్ర అసహనం రేపితే.. బీఆర్ఎస్ పార్టీల నేతల్లో ఆనందం నింపింది.

  • Author : Balu J Date : 29-04-2023 - 4:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harish
Harish

ఎన్టీఆర్ (NTR) శత జయంతి ఉత్సవాలు విజయవాడలోని పోరంకిలో అనుమోలు గార్డెన్స్ లో ఘనంగా జరిగిన విషయం తెలిసిందే. ఈ వేడుకలకు సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ప్రధాన ఆకర్షణగా నిలిచారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న రజినీకాంత్ స్వర్గీయ నందమూరి తారకరామారావు కొనియాడారు. అలాగే చంద్రబాబు నాయుడు పై ప్రశంసల వర్షం కురిపించారు. చంద్రబాబు కారణంగానే హైదరాబాద్లో ఐటీ అభివృద్ధి చెందిందన్నారు. హైదరాబాద్ వెళితే భారతదేశంలో ఉన్నామా? న్యూయార్క్ లో ఉన్నామా? అనిపిస్తుందని పేర్కొన్నారు. హైదరాబాద్ డెవలప్ మెంట్ కు చంద్రబాబు ఫౌండేషన్ వేస్తే, కేసీఆర్ మరింత ముందుకు తీసుకెళ్తున్నారని రజినీకాంత్ అన్నారు.

సూపర్ స్టార్ రజనీకాంత్ వ్యాఖ్యలు వైసీసీ నాయకుల్లో తీవ్ర అసహనం రేపితే.. బీఆర్ఎస్ పార్టీల నేతల్లో ఆనందం నింపింది. తాజాగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హారీశ్ రావు (Harish Rao) రియాక్ట్ అయ్యారు. ’’సీఎం కేసీఆర్ గారు అభివృద్ధి బాగా చేశారు చేశారని, 9 ఏళ్ల పాలనలో హైదరాబాద్ అభివృద్ది, తెలంగాణ అభివృద్ధి అందరికీ కనిపిస్తున్నది. పక్కరాష్ట్రంలో ఉన్న రజినీ గారికి అర్థమైంది, కానీ ఇక్కడే ఉన్న గజినీలకు మాత్రం అర్థం కావడం లేదు’’  అని హరీశ్ రావు బీజేపీ (BjP), కాంగ్రెస్ (Congress) నాయకులనుద్దేశించి అన్నారు.

‘‘కేసీఆర్ (KCR) దించుతం, బిఆర్ఎస్ దించుతం అంటున్నరు కాంగ్రెస్ నాయకులు.. ఎందుకు దించుతరు..?? ఆసరా పింఛన్లు ఇస్తున్నందుకు దించుతరా.. కళ్యాణ లక్ష్మీ కింద లక్ష రూపాయలు ఇస్తున్నందుకు దించుతరా.. ? కేసీఆర్ కిట్ కింద పదమూడు వేలు ఇస్తున్నందుకు దించుతరా..? రైతుబంధు కింద పదివేలు ఇస్తున్నందుకు దించుతరా? రైతుబీమా కింద ఐదు లక్షలు ఇస్తున్నందుకు దించుతరా? కాళేశ్వరంతో కోటి ఎకరాలకు సాగునీళ్లు అందిస్తున్నందుకు దించుతరా? అని హరీశ్ రావు రియాక్ట్ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తే, నిరుద్యోగులను రెచ్చ గొట్టే ప్రయత్నం ప్రతిపక్ష నాయకులు చేస్తున్నారని హరీశ్ రావు మండిపడ్డారు.

Also Read: Akkineni Amala: అఖిల్ ‘ఏజెంట్’ పై దారుణంగా ట్రోలింగ్.. తల్లి అమల రియాక్షన్ ఇదే!


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • harish rao
  • rajinikanth
  • telangana

Related News

SBI Life opens three new branches in Telangana

తెలంగాణలో మూడు కొత్త శాఖలను ప్రారంభిన ఎస్‌బీఐ లైఫ్

ఎస్‌బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ తెలంగాణలో తన కార్యకలాపాలను మరింత విస్తరించింది. భూపాలపల్లి, ఖమ్మం, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో మూడు కొత్త శాఖలను ప్రారంభించడం ద్వారా సంస్థ రాష్ట్రంలో తన సేవల విస్తృతిని పెంచింది.

  • KTR clarifies on organizations formed in his name

    తన పేరుతో ఏర్పడిన సంస్థలపై కేటీఆర్ స్పష్టీకరణ

  • Discussions In Telangana Congress On Rajya Sabha Vacancies

    రాజ్యసభ ఖాళీలపై కాంగ్రెస్‌లో చర్చలు .. తెలంగాణ నుంచి సభకు వెళ్లేదెవరు ?

  • T-SAT

    ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు.. గుడ్ న్యూస్ చెప్పిన టీ-సాట్‌!

  • Maoists Khali

    మావోయిస్టు అగ్ర నాయకత్వం లొంగుబాటు

Latest News

  • రఘురామ కస్టోడియల్ టార్చర్ కేసు .. నన్ను ఉద్దేశపూర్వకంగా ఇరికించారు : సునీల్ కీలక ఆరోపణలు

  • ఇంకా ఎంతకాలం జీవించి ఉంటానో తెలియదు .. మరణం పై ట్రంప్‌ కీలక వ్యాఖ్యలు

  • అమెరికా ఈశాన్యాన్ని వణికిస్తున్న ‘బాంబ్ సైక్లోన్’.. స్తంభించిన జనజీవనం .. వేల విమానాల రద్దు ..!

  • వారికి ప్రత్యేక వెయిటేజ్ : కొత్త విధానానికి సీఎం చంద్రబాబు శ్రీకారం

  • తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ముహూర్తం ఖరారు

Trending News

    • ఐటీఆర్ రిఫండ్ పేరుతో కొత్త రకం మోసం.. జాగ్రత్తగా ఉండకపోతే ఖాతా ఖాళీ!

    • తియ్యని, రసభరితమైన దానిమ్మను ఎంచుకోవడం ఎలా? ఇవే సులభమైన చిట్కాలు!

    • టీమ్ ఇండియాకు షాక్.. సెమీస్ దారులు మూసుకుపోయినట్లేనా?

    • పీఎం కిసాన్ 22వ విడత.. ఈ వారమే రూ. 2000 వచ్చే అవకాశం?

    • బంగారం, వెండి ధరల పై నిర్మలా సీతారామన్ ఆసక్తికర వ్యాఖ్యలు

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd