Lab Technicians Jobs : తెలంగాణలో 1,284 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులకు నోటిఫికేషన్
ఉద్యోగార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 21న(Lab Technicians Jobs) మొదలైంది.
- By Pasha Published Date - 05:26 PM, Mon - 23 September 24

Lab Technicians Jobs : 1284 ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్-II పోస్టుల భర్తీకి తెలంగాణ మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. దీని ద్వారా తెలంగాణ ప్రభుత్వంలోని వివిధ డిపార్టుమెంట్లలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేయనున్నారు. మొత్తం 1284 పోస్టులలో 1088 పోస్టులు డైరెక్టర్ ఆఫ్ పబ్లిక్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్/ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ విభాగంలో ఉన్నాయి. 183 పోస్టులు తెలంగాణ వైద్య విధాన పరిషత్‌లో ఉన్నాయి. 13 పోస్టులు ఎంఎన్‌జే ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆంకాలజీ అండ్ రీజినల్ క్యాన్సర్ సెంటర్లో ఉన్నాయి. ఉద్యోగార్థుల దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ సెప్టెంబరు 21న(Lab Technicians Jobs) మొదలైంది. దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5. అప్లికేషన్లలో సవరణ చేసుకునేందుకు అక్టోబర్ 7 నుంచి 8 వరకు ఛాన్స్ ఇస్తారు. ఈ పోస్టులకు అప్లై చేసే వారికి నవంబరు 10న పరీక్ష నిర్వహిస్తారు.
Also Read :PM Modi : ప్రధాని మోడీ ‘‘కామ్ కీ బాత్’’ చేయడం లేదు : రాహుల్‌గాంధీ
ఈ పోస్టులకు అప్లై చేసేవారు లేబొరేటరీ టెక్నీషియన్ కోర్సు/ ఎంఎల్టీ ఓకేషనల్/ ఇంటర్మీడియట్(ఎంఎల్టీ ఓకేషనల్)/ బీఎస్సీ(ఎంఎల్టీ)/ ఎంఎస్సీ(ఎంఎల్టీ)/ డీఎంఎల్టీ/ బీఎంఎల్టీ/ పీజీడీ ఎంఎల్టీ/ బీఎస్సీ(మైక్రో బయాలజీ)/ ఎంఎస్సీ(మైక్రో బయాలజీ/ మెడికల్ బయో కెమిస్ట్రీ/ క్లీనికల్ మైక్రోబయాలజీ/ బయోకెమిస్ట్రీ) అర్హతలను కలిగి ఉండాలి. ఈ ఏడాది జులై నాటికి 46 ఏళ్లలోపు వయసు కలిగినవారు అప్లై చేయొచ్చు.
Also Read :UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు
ఆన్‌లైన్ పరీక్ష ఫీజు రూ.500 ఉంటుంది. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్, డాక్యుమెంట్ వెరిఫికేషన్ ద్వారా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. ఆన్‌లైన్‌లో అప్లికేషన్లను సమర్పించాలి. హైదరాబాద్, నల్గొండ, కోదాడ, ఖమ్మం, కొత్తగూడెం, సత్తెనపల్లి, కరీంనగర్, మహబూబ్‌నగర్, సంగారెడ్డి, ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, నర్సంపేట్లలో పరీక్షా కేంద్రాలు ఉంటాయి. దరఖాస్తు చేయడానికి లాస్ట్ డేట్ అక్టోబరు 5.