HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > India
  • >Onion Price Control Govt Steps Up Buffer Stock Sales

Onion Prices : ఉల్లి ధరలను కంట్రోల్ చేసేందుకు కేంద్రం కీలక నిర్ణయం

దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని(Onion Prices) రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు ఆమె తెలిపారు.

  • Author : Pasha Date : 23-09-2024 - 4:13 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Onion Prices Buffer Stock Central Govt

Onion Prices : దేశంలో ఉల్లి ధరలు మండిపోతున్నాయి. రాజధాని ఢిల్లీలో కిలో ఉల్లి ధర రూ.55 దాకా పలుకుతోంది. ఉల్లిని ముంబైలో కిలోకు రూ.58, చెన్నైలో కిలోకు రూ.60 చొప్పున రిటైల్‌లో అమ్ముతున్నారు. ఈనేపథ్యంలో ఉల్లి ధరలను  నియంత్రించడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ముందస్తుగా నిల్వ చేసిన 4.7 లక్షల టన్నుల ఉల్లి స్టాక్‌ను హోల్‌సేల్‌ మార్కెట్లోకి విడుదల చేయాలని సర్కారు నిర్ణయించింది.  ఈవిషయాన్ని కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కార్యదర్శి నిధి ఖరే సోమవారం వెల్లడించారు. దేశవ్యాప్తంగా రాయితీ ఉల్లిని(Onion Prices) రిటైల్‌గా విక్రయించే ఆలోచన చేస్తున్నట్లు ఆమె తెలిపారు. ఖరీఫ్‌లో ఉల్లి సాగు విస్తీర్ణం పెరిగినందున, ఇక ఉల్లి ధరలకు కళ్లెం పడుతుందని ఆశిస్తున్నామని చెప్పారు.

Also Read :UPI Transaction Fees : ఛార్జీలు విధిస్తే యూపీఐ లావాదేవీలు చేయబోం.. సర్వేలో సంచలన విషయాలు

ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేస్తూ పది రోజుల క్రితమే కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. టన్నుకు 550 డాలర్లుగా ఉన్న కనీస ఎగుమతి ధరను తొలగించింది.  దేశంలోని ఉల్లి రైతులకు మెరుగైన ధర దక్కాలన్న ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. అందువల్లే  ఉల్లి ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. ఉల్లి ఎగుమతులపై ఉన్న ఆంక్షలను ఎత్తివేసినప్పటి నుంచి ఎన్‌సీసీఎఫ్‌, నాఫెడ్‌ ద్వారా ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల రాజధానుల్లో రూ.35కే కిలో చొప్పున మొబైల్‌ వ్యాన్ల ద్వారా ఉల్లిని కేంద్రం విక్రయిస్తోంది. జాతీయ సగటు కంటే ఉల్లి ధర ఎక్కువగా ఉన్న నగరాల్లో రాయితీ ఉల్లి విక్రయాలు చేస్తున్నారు.

Also Read :Nitin Gadkari : నాలుగోసారి కేంద్రంలో అధికారంలోకి వస్తామో, రామో చెప్పలేను: గడ్కరీ

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కర్నూలు జిల్లాలో ఈసారి ఖరీఫ్ సీజన్ ఆరంభంలో వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో ఉల్లి సాగు విస్తీర్ణం పడిపోయింది. ఇప్పటి వరకు 20వేల 400 ఎకరాల్లోనే ఉల్లిని సాగు చేశారు. గత ఐదేళ్లలో ఈ జిల్లాలో సాగు విస్తీర్ణం ఇంతలా పడిపోవడం ఇదే తొలిసారి. మహారాష్ట్రలో జులై నెలాఖరులో భారీ వర్షాలు కురిశాయి. దీంతో ఆ రాష్ట్రంలో కూడా ఉల్లి దిగుబడులు బాగా తగ్గాయి. కర్నూలు జిల్లాలోనూ దిగుబడులు తగ్గాయి. ఈ పరిణామంతో మార్కెట్‌లో తమకు లభించే ఉల్లి ధర పెరుగుతుందని రైతులు అనుకున్నారు. అయితే అలా జరగలేదు. దీంతో రైతన్నలకు నిరాశే ఎదురైంది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • central govt
  • Onion Buffer Stock
  • Onion Prices
  • Onion Sales

Related News

Central Govt Good News2

Central Govt Good News : తెలంగాణకు కేంద్రం గొప్ప శుభవార్త

ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (అర్బన్) 2.0 పథకం కింద రాష్ట్రంలోని 118 పట్టణ ప్రాంతాల్లో మొత్తం 18,213 ఇళ్ల నిర్మాణానికి కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది

  • Central Govt Good News

    Central Govt : దేశ ప్రజలకు కేంద్రం గుడ్ న్యూస్..ఇది చాలు !!

Latest News

  • వైసీపీ అధినేత జ‌గ‌న్‌కు చెంప దెబ్బ‌!

  • Rahul : రాహుల్ కు ఏమి తెలియదంటూ మోదీ దారుణమైన సెటైర్

  • TALRadio : ఈ రేడియో ఆన్ చేస్తే అన్ని మంచి వార్తలే! !

  • Big Shock : యూజర్లకు బిగ్ షాక్.. మొబైల్ డేటాపై ట్యాక్స్ వేయబోతున్న కేంద్రం ?

  • Gas Shortage : రైల్ ప్రయాణికులకు LPG షాక్

Trending News

    • భార‌త్ ఘ‌న‌విజ‌యం.. బీసీసీఐ ఏం చేసిందంటే?

    • సిలిండ‌ర్ల స‌ర‌ఫ‌రాపై నిషేధం..?

    • ఐపీఎల్ 2026.. తొలి మ్యాచ్ ఈ జ‌ట్ల మ‌ధ్యే?!

    • మందుబాబులకు గుడ్‌న్యూస్.. ఏపీలో భారీగా మద్యం ధరల తగ్గింపు

    • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd