inter results 2025: తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై కీలక అప్డేట్.. ఆ రోజే రిజల్ట్స్..?
తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాల విడుదలపై కీలక అప్డేట్ ఇచ్చింది.
- By News Desk Published Date - 09:53 PM, Sat - 12 April 25

inter results 2025: ఏపీలో ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. శనివారం ఉదయం మంత్రి నారా లోకేశ్ ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షల ఫలితాలను విడుదల చేశారు. ప్రస్తుతం తెలంగాణలో ఇంటర్ ఫలితాలపై అందరిలోనూ ఆసక్తి నెలకొంది. తెలంగాణ ఇంటర్ బోర్డు ఫలితాలను ఎప్పుడు విడుదల చేస్తుందన్న చర్చ జరుగుతుంది. అయితే, ఫలితాల విడుదలపై ఇంటర్ బోర్డు కీలక అప్డేట్ ఇచ్చింది.
Also Read: AP Formula : తమిళనాడు ఎన్నికల్లో ఏపీ ఫార్ములా.. ట్విస్ట్ ఇవ్వనున్న విజయ్ ?!
తెలంగాణ రాష్ట్రంలో మార్చి 5వ తేదీ నుంచి 25వ తేదీ వరకు ఇంటర్ ప్రథమ, ద్వితీయ పరీక్షలు జరిగాయి. మొత్తం 9 లక్షల 96 వేల మంది ఈసారి ఇంటర్ పరీక్షలు రాశారు. ప్రస్తుతం పరీక్ష పత్రాల మూల్యాంకనం జరుగుతోంది. రాష్ట్రంలో 19 సెంటర్లల్లో మార్చి 19వ తేదీన మూల్యాంకనం ప్రారంభమైంది. ప్రతి సెంటర్‌లో దాదాపు 600 నుంచి 1200 మంది వరకు సిబ్బంది మూల్యాంకన విధుల్లో పాల్గొంటున్నారు. ఈసారి మూల్యాంకనం పూర్తయిన తరువాత జవాబు పత్రాలను మరోసారి చెక్ చేస్తున్నారు. తద్వారా ఎలాంటి తప్పులు చోటు చేసుకోకుండా చర్యలు తీసుకుంటున్నారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ ఆలస్యమవుతున్నట్లు తెలుస్తోంది.
మార్చి 20వ తేదీ వరకు జవాబు పత్రాల మూల్యాంకనం ప్రక్రియ పూర్తవుతుందని సమాచారం. దీంతో ఇంటర్మీడియట్ పరీక్షల ఫలితాలు ఈనెల 25వ తేదీ లేదంటే 27వ తేదీన విడుదల చేసేందుకు ఇంటర్మీడియట్ బోర్డు సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది.