TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్ష మరోసారి రద్దు.. హైకోర్టు సంచలన తీర్పు
TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మరోసారి రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
- Author : Pasha
Date : 23-09-2023 - 11:27 IST
Published By : Hashtagu Telugu Desk
TSPSC Group 1 : గ్రూప్ 1 ప్రిలిమ్స్ పరీక్షను మరోసారి రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు తీర్పు ఇచ్చింది. ఈ ఎగ్జామ్ ను ఇంకోసారి నిర్వహించాలని సూచించింది. జూన్ 11న గ్రూప్ వన్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రెండోసారి నిర్వహించారు. అందులో కూడా అక్రమాలు జరిగాయని కొందరు అభ్యర్థులు కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈమేరకు ఆదేశాలతో కోర్టు తీర్పును వెలువరించింది. 503 పోస్టులతో గ్రూప్ 1 నోటిఫికేషన్‌ను విడుదల చేయగా.. ఇప్పటికే ప్రిలిమ్స్ ఎగ్జామ్ ను రెండుసార్లు అభ్యర్థులతో రాయించారు.
Also read : Nara Lokesh : జగన్‌కు బెయిల్ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలిపిన లోకేష్
రెండోసారి జరిగిన గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఎగ్జామ్ లో కూడా లోపాలు తలెత్తాయనే పలువురు అభ్యర్థుల ఆరోపణలతో హైకోర్టు బెంచ్ ఏకీభవించింది. ఎగ్జామ్ జరిగే క్రమంలో అభ్యర్థుల బయోమెట్రిక్ వివరాలను తీసుకోలేదని, హాల్ టికెట్ నంబర్ లేకుండానే ఓఎంఆర్ షీట్లను ఇచ్చారని పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ సమాచారంపై విచారించిన న్యాయస్థానం తమకు అందిన వివరాల ఆధారంగా ఎగ్జామ్ ను క్యాన్సల్ ను చేస్తూ తీర్పును (TSPSC Group 1) వెలువరించింది. వీలైనంత త్వరగా ఇంకోసారి గ్రూప్ 1 ప్రిిలిమ్స్ ఎగ్జామ్ ను నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసింది.