TS High Court: బీఆర్ఎస్ కు మరో షాక్.. హైకోర్టు అనర్హత వేటు, గద్వాల ఎమ్మెల్యే గా డీకే అరుణ
ఎన్నికల ముందు బీఆర్ఎస్ పార్టీకి మరో షాక్ తగిలింది. గద్వాల్ ఎమ్మెల్యే పై అనర్హత వేటు పడింది.
- By Balu J Published Date - 04:00 PM, Thu - 24 August 23

TS High Court: గద్వాల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కృష్ణమోహన్ రెడ్డికి షాక్ తగిలింది. ఆయనను ఎమ్మెల్యేగా అనర్హుడని తెలంగాణ హైకోర్టు గురువారం ప్రకటించింది. తప్పుడు అఫిడవిట్ సమర్పించారని ఆరోపించారు. ఆయన ఎన్నిక చెల్లదని సంచలన తీర్పు ఇచ్చింది. అదే సమయంలో ఎన్నికల్లో తదుపరి మెజారిటీ ఉన్న డీకే అరుణను ఎమ్మెల్యేగా ప్రకటించారు. కృష్ణమోహన్ రెడ్డికి 3 లక్షల జరిమానా విధించింది.
అందులో డీకే అరుణకు రూ.50 వేలు ఇచ్చారు. కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన డీకే అరుణ దాదాపుగా 28వేల ఓట్ల తేడాతో ఓడిపోయారు. అయితే తప్పుడు అఫిడవిట్ దాఖలు చేశారని అనర్హతా వేటు వేయాలని డీకే అరుణ తర్వాత హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరుగుతూండగానే ఆమె పార్టీ మరిపోయారు. పార్లమెంట్ ఎన్నికల నాటికి బీజేపీలో చేరిపోయి.. ఆ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా మహబూబ్ నగర్ నుంచి పోటీ చేశారు. ఓడిపోయారు.
ప్రస్తుతం బీజేపీ నేతగా కొనసాగుతున్నారు. హైకోర్టు తీర్పును అమలు చేస్తే ఆమె ఇప్పుడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అవుతారు. అయితే ఎమ్మెల్యే పదవి కాలం దాదాపుగా ముగిసిపోయే దశకు వచ్చింది. ఇటీవల కొత్తగూడెం బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే వనమా వెంకటేశ్వర్‌రావుపై అనర్హత వేటు వేయడంతో ఆయన స్థానంలో జలగం వెంకటరావును ఎమ్మెల్యేగా కోర్టు ప్రకటించింది.
Also Read: Relationship: ప్రేమించుకుందాం రా.. టీనేజ్ లోనే ప్రేమపాఠాలు, బ్రేకప్ తో చిత్తవుతున్న ఈతరం యూత్!