HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Govts Prestigious Buddhist Heritage Park To Open On Saturday

Buddhist heritage park: కృష్ణా తీరంలో బుద్ధ వనం.. మే 14న ప్రారంభోత్సవం.. ఆసియాలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం విశేషాలివీ

బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టే శిల్పాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం..

  • Author : Hashtag U Date : 13-05-2022 - 3:42 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Buddhist
Buddhist

బుద్ధుడి జననం నుంచి నిర్యాణం వరకు ప్రతి అంశాన్నీ కళ్లకు కట్టే శిల్పాలతో ఆసియా ఖండంలోనే అతిపెద్ద బౌద్ధ స్థూపం..
శ్రీలంక వాసులు అందజేసిన 27 అడుగుల బుద్ధుడి ప్రతిమ..
లుంబిని, సారనాథ్‌, బుద్ధగయ, కృషి నగర్‌ బౌద్ధ క్షేత్రాలను మరిపించేలా బుద్ధవనం.. ఇవన్నీ తెలంగాణ లోని నాగార్జున సాగర్‌లో ఉన్న హిల్‌ కాలనీలో 274 ఎకరాల్లో ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘బుద్ధవనం’ ప్రాజెక్ట్‌ విశేషాలు. గౌతమ బుద్ధుడి శిష్యుడు ఆచార్య నాగార్జునుడు నడయాడిన నేలలో ఈ బుద్ధవనాన్ని ఆవిష్కరించారు. దీన్ని తెలంగాణ మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ మే 14న (శనివారం) ప్రారంభించనున్నారు. అంతర్జాతీయంగా బౌద్ధ పర్యాటకులకు ఆకర్షించాలనే లక్ష్యం తో దీన్ని అభివృద్ధి చేశారు.
బుద్ధుడి అష్టాంగ మార్గానికి గుర్తుగా ఈ బుద్ధవనంలో 8 పార్కులు ఏర్పాటు చేశారు. నలువైపులా పచ్చదనంతో ఈ ప్రాంతం ఆహ్లాదంగా ఉంటుంది.

8 పార్కుల్లో ఏముంది?

బుద్ధుడి జీవిత దశలను తెలిపే నమూనాలను మొదటి పార్కులో
ఏర్పాటు చేశారు. రెండో పార్కులో 547 జాతక కథలతో 42 రకాల వేదికలు నిర్మించారు. ఇక మూడోది ఆంధ్రా బుద్ధిజం పార్కు. నాలుగోది ప్రపంచ స్థూపాల పార్క్ . శ్రీలంక వాసుల సహకారంతో 27 అడుగుల ఎత్తైన బుద్ధుడి ప్రతిమను ఐదో పార్కులో ఏర్పాటు చేశారు. ఆరో పార్కును ధ్యాన వనంగా తీర్చిదిద్దారు. ఏడో పార్కులో మహా స్థూపం నిర్మించారు. ఎనిమిదో పార్కును స్థూప వనంగా తీర్చిదిద్దారు.

మహా స్థూపంలో ఏమున్నాయంటే..

మహా స్థూపాన్ని 21 మీటర్ల ఎత్తు, 42 మీటర్ల వ్యాసంతో నిర్మించారు. కాంక్రీట్‌తో నిర్మించిన స్థూపాల్లో ఆసియా ఖండంలోనే ఇది అతి పెద్దదని చెబుతున్నారు. స్థూపం కింది భాగంలో లైబ్రరీ, ఆడిటోరియం, మ్యూజియం ఉన్నాయి.విశాలమైన ధ్యాన మందిరాన్ని కూడా ఏర్పాటు చేశారు. సిద్ధార్థుడు ఆహారం, నీళ్లు తీసుకోకుండా 48 రోజుల పాటు కఠోర తపస్సు చేశాడు. హృదేలా గ్రామంలో సుజాతా దేవి ఇచ్చిన పాయసం స్వీకరించిన తర్వాత ఆయనకు జ్ఞానోదయం అవుతుంది. ఈ ఇతివృత్తాంతాన్ని ప్రతిబింబిచేలా మహా స్థూపం కింది భాగంలో మోకాళ్ల మీద కూర్చుని పాయసం తీసుకున్నట్లు ప్రతిమను చెక్కారు.

2005లో శంకుస్థాపన..

బుద్ధవనం ప్రాజెక్టు నిర్మాణానికి
2005లో నాటి పర్యాటక శాఖ అధికారులు శంకుస్థాపన చేశారు. బౌద్ధ మత గురువు దలైలామా 2006లో అమరావతిలో కాలచక్ర యాగానికి వెళుతూ ఇక్కడ బోధి వృక్షాన్ని నాటారు. 2014లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన జరిగేంత వరకూ బుద్ధవనం నిర్మాణ పనులకు కేంద్రమే నిధులు ఇచ్చింది. రాష్ట్ర విభజన అనంతరం ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు ఆగిపోయాయి. 2015 మే మొదటి వారంలో టీఆర్‌ఎస్‌ పార్టీ నాగార్జున సాగర్‌లో ప్లీనరీ నిర్వహించింది. ఈ సమావేశం నిమిత్తం సాగర్‌కు వచ్చిన సీఎం కె చంద్రశేఖర్ రావు బుద్ధవనాన్ని సందర్శించారు. దాని అభివృద్ధికి రూ.25 కోట్లు కేటాయించారు. మల్లేపల్లి లక్ష్మయ్యను ప్రత్యేక అధికారిగా నియమించారు. నాటి నుంచి పనులు కొనసాగి ప్రాజెక్టు పూర్తయింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 274 acres
  • Buddhavanam
  • Buddhist heritage theme park
  • Nagarjunasagar
  • telangana government

Related News

Telangana Inter Admissions

TG Inter: నేటి నుంచే తెలంగాణ ఇంటర్ షెడ్యూల్‌ విడుదల

తెలంగాణలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సర ప్రవేశాలు నేటి (మే 12) నుంచి ప్రారంభం కానున్నాయి. ఇంటర్‌ను పాఠశాల విద్యలో విలీనం చేసే ప్రక్రియలో సాంకేతిక ఇబ్బందులు తలెత్తడంతో.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తుతానికి పాత విధానాన్నే కొనసాగించాలని ఆదేశించారు. జూన్ 1 నుండి తరగతులు ప్రారంభం కానున్నాయి. ప్రవేశాల సమయంలో విద్యార్థులు ఆధార్ కార్డుతో పా

  • Changing the Names of Several Castes: Telangana Government Takes Key Decision

    Telangana Castes: పలు కులాల పేర్లను మారుస్తూ.. తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం

  • New Policy on Fee Reimbursement in Telangana

    Telangana Fee Reimbursement: తెలంగాణ ఫీజు రీయింబర్స్‌మెంట్‌లో కొత్త పాలసీ!

  • Another Metro Phase 3 in Hyderabad

    హైదరాబాద్ లో మరో మెట్రో ఫేజ్-3.. కేంద్రానికి సీఎం రేవంత్ విజ్ఞప్తి

Latest News

  • Vaastu Tips: పిచ్చుకలు ఇంట్లో గూడు కట్టాయా? అయితే వాస్తు శాస్త్రం ఏం చెబుతుందో తెలుసుకోండి..!!

  • YSRCP: దస్తగిరి హత్య కేసులో వైసీపీ నేతకు బిగుస్తున్న ఉచ్చు…..!!

  • Ghar Soap Ad Controversy: అలీ ఘర్ సబ్బు యాడ్‌ వివాదం

  • Petrol price: పెట్రోల్‌, డీజిల్‌ ధరలపై ఆర్‌బీఐ గవర్నర్‌ షాకింగ్ కామెంట్స్

  • Nara Lokesh: ‘మేడ్ ఇన్ ఆంధ్ర ప్రదేశ్’.. మంత్రి నారా లోకేష్ ట్వీట్

Trending News

    • TVK విజయ్‌ అను నేను..

    • CM VIJAY: టీవీకేకు వీసీకే మద్దతు: ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • CM Vijay Thalapathy: ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్..!

    • Tamil Nadu Politics: విజయ్ను ముప్పుతిప్పలు పెడుతున్న VCK.. డిప్యూటీ సీఎం పదవి ఇస్తేనే

    • Cm Thalapathy Vijay: విజయ్‌కి లైన్ క్లియర్!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd