HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Govt Signs Key Deal With Singapore Ite

CM Revanth : సింగపూర్ ITEతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం

CM Revanth : ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ITE పాఠ్యాంశాలను రాష్ట్రంలోని స్కిల్ వర్సిటీ ఉపయోగించి, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక శక్తివంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం

  • Author : Sudheer Date : 17-01-2025 - 3:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Mou With Singapore Ite For
Mou With Singapore Ite For

సింగపూర్ ITE కాలేజ్ సెంట్రల్తో రాష్ట్ర ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. ప్రస్తుతం సీఎం రేవంత్‌రెడ్డి విదేశీ పర్యటనకు వెళ్లిన సంగతి తెలిసిందే. గురువారం రాత్రి సింగపూర్‌కు చేరుకున్న ఆయన, శుక్రవారం నుంచి ఆదివారం వరకు అక్కడ పర్యటించనున్నారు. రాష్ట్రంలో పెట్టుబడులకు సంబంధించి వివిధ కంపెనీల ప్రతినిధులతో భేటీ కానున్నారు.

CM Chandrababu Davos Tour: దావోస్ పర్యటనకు ముందు తమిళనాడుకు షాకిచ్చిన చంద్రబాబు? ఏంటంటే?

ముందుగా ఈరోజు సింగపూర్ ITE (Institute of Technical Education) కాలేజ్ సెంట్రల్‌తో కీలక ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రధాన లక్ష్యం ITE పాఠ్యాంశాలను రాష్ట్రంలోని స్కిల్ వర్సిటీ ఉపయోగించి, నైపుణ్యాల అభివృద్ధి కోసం ఒక శక్తివంతమైన భాగస్వామ్యాన్ని ఏర్పరచుకోవడం. ఈ ఒప్పందంపై తెలంగాణ స్కిల్ వర్సిటీ యొక్క వైస్ చాన్సలర్ (వీసీ) మరియు ITE డిప్యూటీ డైరెక్టర్ సంతకాలు చేశారు. ఈ ఒప్పందానికి కీలక భాగస్వామిగా సీఎం రేవంత్ ఉన్నారు. ఈ ఒప్పందం రాష్ట్రంలో ఉన్న విద్యార్ధులకి నైపుణ్యాల విషయంలో పెద్ద అవకాశాలను కల్పించనుంది. రాష్ట్రంలో వివిధ సాంకేతికతలలో విద్యావంతులైన నైపుణ్యాలను అభివృద్ధి చేసేందుకు ITE సిలబస్ తో సహకారం అవసరం కాబోతుంది. మంత్రి శ్రీధర్ బాబు మరియు ఇతర ఉన్నతాధికారుల సమక్షంలో ఈ ఒప్పందం జరగడం, రాష్ట్రంలో నైపుణ్యాల అభివృద్ధి ప్రయోజనాలను అందించడానికి ఒక కీలక దశగా మారింది. ITE ప్రతినిధులు త్వరలో హైదరాబాద్ లో పర్యటించనున్నారు.

అలాగే సింగపూర్‌‌లో రివర్ ఫ్రంట్‌ను సీఎం రేవంత్‌రెడ్డి సందర్శించనున్నారు. మూసీ పునరుజ్జీవనం చేపట్టేందుకు రేవంత్ సర్కార్ అధిక ప్రాధాన్యం ఇస్తుండడంతో అక్కడ జరిగిన అభివృద్ధి గురించి తెలుసుకోనున్నారు. 18న సింగపూర్ తెలంగాణ కల్చరల్ సొసైటీ ఏర్పాటు చేసిన ‘మీట్ అండ్ గ్రీట్’ కార్యక్రమంలో స్థానిక తెలుగు వారిని ముఖ్యమంత్రి బృందం కలవనుంది. సింగపూర్ పర్యటన అనంతరం రేవంత్ టీమ్ 20న దావోస్‌కు చేరుకుంటుంది. 20 నుంచి 22 తేదీ వరకు ‘వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ వార్షిక సదస్సు 2025’లో పాల్గొంటుంది. పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను ప్రపంచానికి పరిచయం చేసేందుకు దావోస్ పర్యటనను రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యంగా భావిస్తోంది. గతేడాది దావోస్ పర్యటన సందర్భంగా రాష్ట్రానికి రూ.40 వేల కోట్ల పెట్టుబడులను ప్రభుత్వం సమీకరించింది. ఈ సారి అంతకు మించిన పెట్టుబడుల లక్ష్యంగా తమ పర్యటన కొనసాగుతుందని సీఎం రేవంత్‌రెడ్డి ఇటీవల అధికారులతో సమీక్షలో వెల్లడించారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • Institute of Technical Education
  • Minister Sridhar Babu
  • Skill Varsity
  • telangana

Related News

Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

కృత్రిమ మేధస్సు (ఏఐ) రంగంలో తెలంగాణ ప్రపంచ దేశాలకు కొత్త దిశానిర్దేశం చేస్తోందని ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క మంగళవారం అన్నారు. పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబుతో కలిసి హెచ్‌ఐసిసిలో “గ్రీన్ గ్రోత్ ఎకనామిక్ సమ్మిట్ – ది హైదరాబాద్ కలెక్టివ్”ను ప్రారంభిస్తూ, “రాష్ట్రం పెట్టుబడులను ఆకర్షించడమే కాకుండా, పర్యావరణ పరిరక్షణ, సామాజిక బాధ్యతలను కూడ

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Chandrababu Naidu: గోదావరి పుష్కరాలకు చంద్రబాబు కీలక ప్రకటన..

  • Jr NTR: జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీపై క్లారిటీ ఇచ్చిన ఫ్యాన్స్

  • Weather Update: తెలుగు రాష్ట్రాల్లో నిప్పుల కొలిమి

  • Banakacherla Project: బనకచర్ల పిటిషన్‌పై తెలంగాణ అభ్యర్థనకు నిరాకరించిన సుప్రీంకోర్టు

  • CSK: 18 సంవత్సరాల ప్రస్థానానికి ముగింపు.. చెన్నై సూపర్ కింగ్స్ కు ఫ్లెమింగ్ గుడ్​బై..

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd