Telangana DSC : నేడో, రేపో డీఎస్సీ నోటిఫికేషన్.. జిల్లాలవారీగా పోస్టుల వివరాలివీ
Telangana DSC : డీఎస్సీ ద్వారా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులలో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి.
- By Pasha Published Date - 08:09 AM, Sat - 26 August 23

Telangana DSC : డీఎస్సీ ద్వారా 5,089 టీచర్ పోస్టుల భర్తీకి తెలంగాణ విద్యాశాఖ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ పోస్టులలో 2,575 ఎస్‌జీటీ, 1,739 స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఉన్నాయి. వీటితోపాటు 611 భాషా పండితులు, 164 పీఈటీ పోస్టులనూ భర్తీ చేయనున్నారు. జిల్లాల వారీగా భర్తీ చేయనున్న ఖాళీల వివరాలపైనా క్లారిటీ వచ్చింది. తెలంగాణ డీఎస్సీ నోటిఫికేషన్ ఇవాళో, రేపో రిలీజ్ కానుంది. ఈసారి జిల్లా ఎంపిక కమిటీలు(డీఎస్సీ) నియామకాలు చేపడతామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి వెల్లడించారు.
Also read : Today Horoscope : ఆగస్టు 26 శనివారం రాశి ఫలితాలు.. వారికి మనశ్శాంతి లోపించే అవకాశముంది
జిల్లాలవారీగా ఖాళీలు ఇలా..
- ప్రభుత్వం ప్రకటించిన 5,089 ఉపాధ్యాయ ఖాళీల్లో అత్యధికంగా 358 పోస్టులు (Telangana DSC) హైదరాబాద్ జిల్లా పరిధిలో ఉన్నాయి.
- అత్యల్పంగా పెద్దపల్లి జిల్లాలో 43 ఖాళీలు ఉన్నాయి.
- ఆదిలాబాద్-275, ఆసిఫాబాద్-289, భద్రాద్రి 185, హనుమకొండ-54, జగిత్యాల-148, జనగామ-76, జయశంకర్ భూపాలపల్లి-74, జోగులాంబ-146, కామారెడ్డి-200, కరీంనగర్-99, ఖమ్మం-195, మహబూబాబాద్-125, మహబూబ్‌నగర్-96, మంచిర్యాల-113, మెదక్-147, మేడ్చల్-78, ములుగు-65, నాగర్‌కర్నూలు-114, నల్గొండ-219, నారాయణపేట-154, నిర్మల్-115, నిజామాబాద్-309, పెద్దపల్లి-43, రాజన్నసిరిసిల్ల-103, రంగారెడ్డి-196, సంగారెడ్డి-283, సిద్ధిపేట-141, సూర్యాపేట-185, వికారాబాద్-191, వనపర్తి-76, వరంగల్-138, యాదాద్రి-99 పోస్టులు ఉన్నాయి.