Summer Holidays : తెలంగాణ విద్యార్థులకు వేసవి సెలవులు ప్రకటించిన ప్రభుత్వం
- By Latha Suma Published Date - 01:45 PM, Tue - 23 April 24

Summer Holidays: తెలంగాణ(Telangana)లో ఎండలు భగ్గుమంటున్నాయి. దీంతో ఉక్కపోత కూడా ఎక్కువైంది. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం(Telangana Govt) విద్యార్థులకు వేసవి సెలవుల(Summer Holidays)ను ప్రకటించింది. రేపటి నుంచి అంటే ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. దీంతో.. వేసవి సెలవులను హాయిగా ఎంజాయ్ చేసేందుకు విద్యార్థులు సిద్ధమవుతున్నారు. పెరుగుతున్న ఉష్ణోగ్రతల నేపథ్యంలో తెలుగు రాష్ట్రాల్లో హాఫ్ డే స్కూల్స్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే… తెలంగాణలో మార్చి 15 నుంచి హాఫ్ డే స్కూల్స్ ప్రారంభంకాగా నేటితో ముగియనున్నాయి.
We’re now on WhatsApp. Click to Join.
దీంతో రాష్ట్రంలోని అన్ని పాఠశాలలు రేపటి నుంచి (ఏప్రిల్ 24 నుంచి) జూన్ 11 వరకు వేసవి సెలవులను ప్రభుత్వం ప్రకటించింది. సమ్మేటివ్ అసెస్‌మెంట్-2 పరీక్షలు నిన్న అంటే సోమవారం జరగింది. పేరెంట్స్ మీటింగ్ నిర్వహించి ఆన్ లైన్ ప్రోగ్రెస్ కార్డులు ఇచ్చారు. రేపటి నుంచి (ఏప్రిల్ 24 నుండి) జూన్ 11 వరకు విద్యార్థులకు దాదాపు 50 రోజుల పాటు వేసవి సెలవులు ఉండనున్నాయి. ఆ తర్వాత జూన్ 12 నుంచి ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు పునఃప్రారంభమవుతాయి. ఈ మేరకు అధికారులు ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశారు.
Read Also: Rajasekhar : ఫాదర్ రోల్ లో రాజశేఖర్.. ఈసారైనా లక్ కలిసి వచ్చేనా..?
మరోవైపు ఇంటర్ పరీక్షలు పూర్తయిన నేపథ్యంలో తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు మార్చి 30 నుంచి కాలేజీలకు సెలవులు ప్రకటించింది. ఈ సెలవులు మార్చి 30 నుండి మే 31 వరకు ఉంటాయి. అంటే వారు సుమారు రెండు నెలల పాటు సెలవులను ఆనందిస్తారు. జూన్ 1న కాలేజీలు పునఃప్రారంభమవుతాయి.
Read Also: Mahesh Babu : మహేష్ న్యూ లుక్.. పిచ్చెక్కిస్తున్నాడుగా..?
కాగా, ఏపీలో కూడా ఏప్రిల్ 24 నుంచి వేసవి సెలవులు ప్రారంభం కానున్నాయి. జూన్ 12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్నాయి. ఇంటర్ కాలేజీ విద్యార్థులకు ఇప్పటికే సెలవులు ప్రారంభమయ్యాయి. మే 31 వరకు ఇవి కొనసాగనున్నాయి.జూన్ 1 నుంచి కాలేజీలు పున:ప్రారంభం కానున్నాయి.ఇప్పటికే రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. మే నెలకు ముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. జూన్ మూడో వారం వరకు ఇదే పరిస్థితి కొనసాగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారు. అదే జరిగితే.. పాఠశాలలకు వేసవి సెలవులు పొడిగించే అవకాశం ఉంది. అప్పటి పరిస్థితిని బట్టి అధికారులు నిర్ణయం తీసుకుంటారు.