TS Real Estate: రిజిస్ట్రేషన్ లో తెలంగాణ పురోగతి
తెలంగాణలో రియల్ బూమ్ తగ్గలేదు. ఎందుకంటే 2021-22లో రికార్డు స్థాయిలో లక్షల కోట్ల రూపాయిలకు
- By Balu J Updated On - 03:53 PM, Mon - 25 July 22

తెలంగాణలో రియల్ బూమ్ తగ్గలేదు. ఎందుకంటే 2021-22లో రికార్డు స్థాయిలో లక్షల కోట్ల రూపాయిలకు పైగా విలువైన అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. గత ఆరేళ్లలోనే ఈస్థాయిలో క్రయవిక్రయాలు పెరిగాయి. దీనివల్ల ప్రభుత్వ రాబడి మూడింతలు పెరిగింది. ఇంకా చెప్పాలంటే రిజిస్ట్రేషన్ల ఆదాయం గత ఆరేళ్లలోనే సుమారు 150 వరకు పెరగడంతో సర్కారు ఫుల్ ఖుషీలో ఉంది. అయితే ఇందులో ఎక్కువగా హైదరాబాద్ చుట్టుపక్కలే జరుగుతుండడం గమనించాల్సిన విషయం. తెలంగాణ మొత్తం మీద రియల్ ఎస్టేట్ బిజినెస్ ను చూసుకున్నా.. అందులో 80 శాతం భాగ్యనగరం చుట్టపక్కలే ఉంది. వ్యవసాయేతర రిజిస్ట్రేషన్ల లెక్కలు చూస్తే.. అందులో వచ్చిన రాబడిలో.. దాదాపు మూడో వంతు గ్రేటర్ హైదరాబాద్ చుట్టుపక్కలే వస్తోంది.
అంటే ఇళ్లు, కార్యాలయాల కొనుగోళ్లు పెరిగాయని అర్థమవుతోంది. కిందటి ఆర్థిక సంవత్సరంలో రూ.1.05 లక్షల కోట్ల విలువైన 7.46 లక్షల ఫ్లాట్లు, ఇళ్లు, ప్లాట్లు అమ్మకాలు, కొనుగోళ్లు జరిగాయి. దీంతో సర్కారుకు రూ.7560 కోట్ల ఆదాయం వచ్చింది. దీంతోపాటు బహుమతులు, జీపీఏ, సెటిల్ మెంట్ తో పాటు మరికొన్నింటి ద్వారా మొత్తంగా ప్రభుత్వానికి వచ్చిన ఆదాయం రూ.9237 కోట్లు. నిజానికి రిజిస్ట్రేషన్ చేసుకున్న మొత్తానికి, మార్కెట్ విలువకు చాలా తేడా ఉంటుంది. అంటే ప్రభుత్వం చెప్పిన లెక్కలకన్నా ఎక్కువ మొత్తంలోనే లావాదేవీల విలువ ఉంటుందని తెలుస్తోంది. హైదరాబాద్, మహబూబ్ నగర్, రంగారెడ్డి, యాదాద్రి-భువనగిరి, మేడ్చల్-మల్కాజిగిరి, జిల్లాల పరిధిలోకి వచ్చే హెచ్ఎండీఏ ప్రాంతాల్లో రియల్ ఎస్టేట్ బూమ్ కనిపిస్తోంది.
Related News

Traffic Diverted : శనివారం ట్యాంక్ బండ్ పై ట్రాఫిక్ ఆంక్షలు…వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకోవాలన్న ట్రాఫిక్ పోలీసులు..!!
హైదరాబాద్ లోని ట్యాంక్ బండ్ పై శనివారం ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. శనివారం ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 వరకు ట్యాంక్ బండ్ పై వాహనాల రాకపోకలను నిషేధిస్తున్నట్లు నగర ట్రాఫిక్ పోలీసు విభాగం శుక్రవారం ఓ ప్రకటన రిలీజ్ చేసింది.