MLC Elections: మరో ఐదు ఎమ్మెల్సీ స్థానాలకు పోల్స్.. కాంగ్రెస్‌లో భారీ పోటీ
ఒకవేళ తమకు కూడా ఎమ్మెల్సీ (MLC Elections) ఇవ్వాలని ఎంఐఎం అడిగితే కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి.
- By Pasha Published Date - 08:38 AM, Wed - 19 February 25

MLC Elections : తెలంగాణలో మరో ఎన్నికకు రంగం సిద్ధమవుతోంది. మార్చి 29వ తేదీ నాటికి ఐదు ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవుతాయి. రాజకీయ పార్టీలకు ప్రస్తుతమున్న ఎమ్మెల్యేల బలాన్ని బట్టి ఈ ఎమ్మెల్సీ స్థానాలు దక్కుతాయి. వివరాలివీ..
Also Read :AP Budget : రూ.3 లక్షల కోట్లు దాటనున్న ఏపీ బడ్జెట్?
40 మంది పోటీ
ఈ ఐదు ఎమ్మెల్సీ స్థానాల్లో నాలుగు కాంగ్రెస్, దాని మిత్రపక్షాలకు దక్కే అవకాశం ఉంది. ఒకవేళ తమకు కూడా ఎమ్మెల్సీ (MLC Elections) ఇవ్వాలని ఎంఐఎం అడిగితే కాంగ్రెస్‌కు మూడు మాత్రమే దక్కుతాయి. బీఆర్‌ఎస్ పార్టీకి ఒక ఎమ్మెల్సీ స్థానం దక్కే ఛాన్స్ ఉంది. తమ కోటాలోని నాలుగు ఎమ్మెల్సీ స్థానాలను ఎస్సీ, బీసీ, మైనార్టీ, ఓసీ వర్గాలకు కేటాయించాలని కాంగ్రెస్ భావిస్తోంది. బీసీ నేతలు తమ వర్గానికి రెండు సీట్లు ఇస్తారనే ఆశలు పెట్టుకున్నారు. నాలుగు సీట్ల కోసం కాంగ్రెస్ నుంచి ఏకంగా 40 మంది పోటీ పడుతున్నట్లు తెలుస్తోంది. వీరిలో పలువురు తెలంగాణ కాంగ్రెస్ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. మరికొందరు నేరుగా ఢిల్లీకి వెళ్లి కాంగ్రెస్ హైకమాండ్ పెద్దలతో సమావేశం కావాలని అనుకుంటున్నారు.
Also Read :Bathukamma Kunta : మళ్లీ జీవం పోసుకున్న “బతుకమ్మ కుంట”
ఏ వర్గం నుంచి ఎవరెవరు .. ?
- కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్సీ స్థానాన్ని ఆశిస్తున్న ఓసీ నేతల లిస్టు పెద్దగానే ఉంది. ఇందులో వేం నరేందర్‌రెడ్డి, టి. జగ్గారెడ్డి, టి. జీవన్‌రెడ్డి, సామ రామ్మోహన్‌రెడ్డి, పారిజాతా నర్సింహారెడ్డి, హరివర్ధన్‌రెడ్డి, జగదీశ్వర్‌రావు, అల్గుబెల్లి ప్రవీణ్‌రెడ్డి, నర్సారెడ్డి భూపతిరెడ్డి ఉన్నారు.
- ఎస్సీ కోటాలో మాజీ ఎమ్మెల్యే సంపత్‌కుమార్, అద్దంకి దయాకర్, సింగాపురం ఇందిర, కొండ్రు పుష్పలీల, పిడమర్తి రవి, దొమ్మాట సాంబయ్య, రాచమళ్ల సిద్ధేశ్వర్, దర్శన్, జ్ఞానసుందర్, భీంభరత్ పేర్లు ఉన్నాయి.
- మైనార్టీల నుంచి షబ్బీర్ అలీ, ఫిరోజ్ ఖాన్, మహ్మద్ అజారుద్దీన్, అజ్మతుల్లా హుస్సేనీ పేర్లు ఉన్నాయి.
- బీసీల నుంచి మధుయాష్కీగౌడ్, ఎగ్గె మల్లేశం, ఈరావత్రి అనిల్, చరణ్‌కౌశిక్ యాదవ్, సునీతా ముదిరాజ్, నీలం మధు, వజ్రేశ్‌యాదవ్, చెవిటి వెంకన్న, సంగిశెట్టి జగదీశ్వర్‌రావు, పున్నా కైలాశ్‌నేత, నవీన్ యాదవ్ పేర్లు ఉన్నాయి.