HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Expresses Interest In Hydel Power Projects In Himachal Pradesh

Telangana Govt : హిమాచల్ ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల అమలుకు ఆసక్తి

Telangana Govt : తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు

  • By Sudheer Published Date - 01:45 PM, Thu - 30 January 25
  • daily-hunt
Hydel Power Project Himacha
Hydel Power Project Himacha

తెలంగాణ ప్రభుత్వం హిమాచల్ ప్రదేశ్‌లో జలవిద్యుత్ ప్రాజెక్టుల అమలుకు ఆసక్తి చూపుతోంది. హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వం BOOT విధానంలో 22 హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టులను అభివృద్ధి చేయడానికి ఆహ్వానం పంపింది. ఈ క్రమంలో తెలంగాణ రాష్ట్ర విద్యుత్ శాఖకు చెందిన సీనియర్ అధికారులు హిమాచల్ ప్రదేశ్‌ను సందర్శించారు. అక్కడి SELI (400 MW) మరియు MIYAR (120 MW) జలవిద్యుత్ ప్రాజెక్ట్ ప్రాంతాలను పరిశీలించి, 100 మెగావాట్లకు పైబడిన ప్రాజెక్టులపై ఆసక్తి చూపాలని సిఫారసు చేశారు.

Tour Tips : ఏపీలోని ఈ హిల్ స్టేషన్ విశ్రాంతి కోసం ఉత్తమమైనది.. విశాఖపట్నం నుండి 111 కిమీ దూరంలోనే..!

ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క విద్యుత్ శాఖ ప్రధాన కార్యదర్శితో కలిసి, హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి సుఖవిందర్ సింగ్ సుఖు తో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో తెలంగాణ ప్రభుత్వం SELI (400 MW) మరియు MIYAR (120 MW) ప్రాజెక్టులపై అధికారికంగా లేఖను అందజేశారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉపముఖ్యమంత్రి, హిమాచల్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని ఒక ప్రాథమిక ఒప్పందం (MoU) ముసాయిదా పంపాలని అభ్యర్థించారు. దీనిపై తెలంగాణ ప్రభుత్వం పూర్తి పరిశీలన చేసి, వీలైనంత త్వరగా ఒప్పందం చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ జలవిద్యుత్ ప్రాజెక్టుల ద్వారా ఉత్పత్తి అయ్యే విద్యుత్ తెలంగాణ రాష్ట్రానికి అందుబాటులోకి రానుంది. దీని ద్వారా రాష్ట్రంలో ప్రస్తుత విద్యుత్ అవసరాలు తీర్చుకోవడంతో పాటు భవిష్యత్తులో పెరుగుతున్న డిమాండ్‌ను సమర్ధంగా తీర్చేందుకు మార్గం సుగమం కానుంది.

ఈ ప్రాజెక్టుల ద్వారా తెలంగాణ పవర్ ఉత్పత్తిని మెరుగుపరుచుకోవడంతో పాటు, నూతన జలవిద్యుత్ ప్రాజెక్టుల విస్తరణకు మార్గదర్శకంగా నిలుస్తుంది. విద్యుత్ రంగంలో తెలంగాణ ప్రభుత్వం తీసుకుంటున్న ఈ నిర్ణయం, రాష్ట్రంలో స్థిర విద్యుత్ సరఫరా లక్ష్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లనుంది.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bhatti vikramarka
  • Himachal Pradesh
  • Shri Sukhvinder Singh Sukhu
  • Telangana . Hydel Power Projects

Related News

    Latest News

    • Rayalaseema : రాయలసీమలో ఉపాధి అవకాశాలు పెరిగాయి – మోదీ

    • Silver Price : దీపావళి తర్వాత సిల్వర్ రేట్ తగ్గుతుందా?

    • AI Vizag : AIకు ఏపీ తొలి గమ్యస్థానంగా మారనుంది – మోదీ

    • Fake Votes : కేటీఆర్ చెప్పింది అంత అబద్దమే..దొంగ ఓట్లు సృష్టిచిందే బిఆర్ఎస్ పార్టీ

    • Telangana Cabinet Meeting : క్యాబినెట్ సమావేశానికి కొండా సురేఖ గైర్హాజరు

    Trending News

      • Chandrababu : కర్నూలు : ”సూపర్ జీఎస్టీ- సూపర్ సేవింగ్స్” బహిరంగ సభలో సీఎం చంద్రబాబు ప్రసంగం

      • Infosys : ఉద్యోగులకు ఇన్ఫోసిస్ అదిరిపోయే శుభవార్త..!

      • PM Modi AP Tour LIVE: ప్రధాని మోదీ లైవ్ అప్డేట్స్

      • Sai Dharam Tej : మేన‌ల్లుడు సాయి దుర్గా తేజ్ బర్త్‌డే.. మామ ప‌వ‌న్ క‌ల్యాణ్ విషెస్

      • Nobel Peace Prize 2025 : డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ షాక్ ?

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2025 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd