Telangana: సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్
ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పిడిసిఎల్ మరియు ఎన్‌పిడిసిఎల్‌తో సహా అనేక రాష్ట్ర యుటిలిటీలకు చెందిన ఉద్యోగులు రెండేళ్లుగా తమ ప్రమోషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలోనే సెప్టెంబరులో విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు ప్లాన్ చేస్తున్నారు.
- By Praveen Aluthuru Published Date - 03:09 PM, Wed - 14 August 24
Telangana: సెప్టెంబరులో విద్యుత్ కష్టాలు పెరగబోతున్నాయి. విద్యుత్ ఉద్యోగులు భారీ నిరసనకు దిగుతుండటంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పదోన్నతుల్లో సుదీర్ఘ జాప్యంపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ తెలంగాణ విద్యుత్ బీసీ, ఓసీ ఉద్యోగుల జాయింట్ యాక్షన్ కమిటీ సెప్టెంబర్‌లో పెద్ద ఎత్తున నిరసనలు చేపట్టనుంది.
ట్రాన్స్‌కో, జెన్‌కో, ఎస్‌పిడిసిఎల్ మరియు ఎన్‌పిడిసిఎల్‌తో సహా అనేక రాష్ట్ర యుటిలిటీలకు చెందిన ఉద్యోగులు రెండేళ్లుగా తమ ప్రమోషన్‌ల కోసం ఎదురుచూస్తున్నారు. ఎన్నిసార్లు విన్నవించినా యాజమాన్యం వారి సమస్యల పరిష్కారానికి ఎలాంటి పటిష్టమైన చర్యలు తీసుకోలేదు. అయితే అన్యాయానికి దారితీసిందని భావిస్తున్న రెండు కీలక అంశాలపై స్పష్టత ఇవ్వాలని ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నారు. 2014లో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులకు మంజూరైన త్వరితగతిన పదోన్నతులు కల్పించిన మొదటి అంశం.. బీసీ, ఓసీ ఉద్యోగుల సీనియారిటీకి భంగం వాటిల్లిందని ఫీడర్ కేడర్‌లో సరైన ప్రాతినిథ్యం లేకుండానే ఈ పదోన్నతులు కల్పించారని వారు వాదిస్తున్నారు.
దీనికి స్పందించి ఈ పదోన్నతులను సమీక్షించాలని ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నిర్ణయాల వల్ల నష్టపోయిన బీసీ, ఓసీ ఉద్యోగులకు న్యాయంగా అందాల్సిన పదోన్నతులు అందేలా దిద్దుబాటు చర్యలు చేపట్టాలని డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో వచ్చే నెలలో పెద్ద ఎత్తున నిరసనకు దిగబోతున్నారు. మరి ఈ లోపు ప్రభుత్వం స్పందించి వారి సమస్యలపై పునరాలోచించాల్సి ఉంది.
Also Read: ICC ODI Rankings: వన్డే ర్యాంకింగ్స్ లో అదరగొట్టిన రోహిత్, కుల్దీప్
Related News
Harish rao : సీఎం యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం: హరీష్ రావు
Harish rao warns cm revanth over you tube channels: రేవంత్ రెడ్డి యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటాన్ని ఖండిస్తున్నానని మాజీ మంత్రి హరీష్ రావు తెలిపారు. యూట్యూబ్ ఛానెళ్లను తక్కువ చేసి మాట్లాడటం విడ్డూరం అంటూ చురకలు అంటించారు.