Telangana Junior Doctors Protest : రేవంత్ కు షాక్ ఇచ్చిన జూనియర్ డాక్టర్లు
- Author : Sudheer
Date : 18-12-2023 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కి జూనియర్ డాక్టర్లు (Telangana Junior Doctors) షాక్ ఇచ్చారు. గత 3 నెలలుగా స్టైఫండ్ (stifund) ఇవ్వకపోవడంతో ఈ నెల 19 (మంగళవారం) నుంచి విధులకు హాజరు కాబోమని ప్రకటించారు. ఈ మేరకు నిరవధిక సమ్మెకు ఉపక్రమిస్తున్నట్లు వైద్య విద్య డైరెక్టర్ కు నోటీసులిచ్చారు. కొంతకాలంగా పలు డిమాండ్ల సాధన కోసం సమ్మెకు వెళ్లాలని వైద్యశాఖ చర్చలు జరపుతున్న విషయం తెలిసిందే.
We’re now on WhatsApp. Click to Join.
‘ఎలాంటి పేమెంట్ లేకుండానే ఒక వారంలో దాదాపు 90 గంటలపాటు పనిచేస్తున్నాం. ఈ విషయంపై ఇప్పటికే చాలాసార్లు డీఎంఈ (DME)తోపాటు హెల్త్ సెక్రటరీ, ఫైనాన్స్ సెక్రటరీకి వినతిపత్రాలు అందించాం. అయినా ఇంతవరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక మౌనంగా ఉంటూ పనిచేసుకుంటూ పోతే సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం కనిపించట్లేదు. డిసెంబర్ 19 నుంచి మేము విధుల్లోకి రాలేమని అసోసియేషన్ల బాధ్యులు తెలిపారు. అలాగే ప్రతి నెలా తమకు చెల్లించాల్సిన జీతాలకు ఒక ఫిక్స్ డ్ డేట్ నిర్ణయించాలని, మెడికల్ బిల్లులు, తదితర పనులు చూసుకునేందుకు ఫైనా న్స్ డిపార్ట్ మెంట్ లో ఒక అధికారిని నియమించడం వంటివి తమ ప్రధాన డిమాండ్లుగా తెలంగాణ జూనియర్స్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు కౌశిక్‌కుమార్ వెల్లడించారు.
Read Also : Praja Bhavan : కేసీఆర్ కుర్చీలో సామాన్యులు ..