Congress : 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను నియమించిన కాంగ్రెస్
తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది
- Author : Sudheer
Date : 01-04-2024 - 3:45 IST
Published By : Hashtagu Telugu Desk
లోక్ సభ ఎన్నికల్లో 17 కు 17 స్థానాల్లో విజయ కేతనం ఎగురవేయాలని కాంగ్రెస్ పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఎలాగైతే ఇంఛార్జీలను నియమించి ఎప్పటికప్పుడు వ్యూహాలు మారుస్తూ..ప్రత్యర్థి పార్టీలకు చెమటలు పట్టించారో..ఇప్పుడు లోక్ సభ ఎన్నికల్లో ను అదే విధంగా కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తోంది. ఇప్పటికే కాంగ్రెస్ గేట్లు ఓపెన్ చేసి ఇతర పార్టీల నేతలను తమ పార్టీలోకి ఆహ్వానిస్తూ..కీలక పదవులు కట్టబెడుతూ వస్తుంది. తాజాగా 17 లోక్ సభ నియోజకవర్గాలకు ఇంఛార్జీలను అధిష్టానం నియమించింది. ఈ మేరకు ఆ పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షీ ఉత్తర్వులు జారీ చేశారు.
We’re now on WhatsApp. Click to Join.
నియోజకవర్గ ఇంఛార్జీలు లిస్ట్ :
1. పెద్దపల్లి – శ్రీధర్ బాబు
2. మహబూబాబాద్ – తుమ్మల నాగేశ్వరరావు
3. వరంగల్ – ప్రకాష్ రెడ్డి
4. హైదరాబాద్ – ఒబేదుల్లా కొత్వాల్
5. ఖమ్మం ఇంఛార్జీగా పొంగులేటి శ్రీనివాసరెడ్డి
6. నల్గొండ – ఉత్తమ్ కుమార్ రెడ్డి
7. కరీంనగర్ – పొన్నం ప్రభాకర్
8. సికింద్రాబాద్ – కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి
9. భువనగిరి – కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి
10. చేవెళ్ల – నరేందర్ రెడ్డి
11. నాగర్ కర్నూల్ – జూపల్లి కృష్ణారావు
12. మెదక్ – కొండా సురేఖ
13. నిజామాబాద్ – సుదర్శన్ రెడ్డి
14. మల్కాజిగిరి – మైనంపల్లి హన్మంతరావు
15. ఆదిలాబాద్ – సీతక్క
16. జహీరాబాద్ – దామోదర రాజనర్సింహ
17. మహబూబ్ నగర్ – సంపత్ కుమార్
Read Also ; 9 Children Died : ల్యాండ్‌మైన్‌తో ఆడుకున్నారు.. పేలడంతో 9 మంది పిల్లల మృతి