HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Cm Kcr To Meet Uddhav Thackeray In Mumbai On February 20

KCR To Meet Uddhav: కేసీఆర్ కు ‘థాక్రే’ ఫోన్.. ముంబైలో భేటీ!

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోతున్నారా..? బీజేపీపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా..?

  • Author : Balu J Date : 16-02-2022 - 12:59 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kcr
Kcr

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ బీజేపీ వ్యతిరేక శక్తులను కలుపుకొనిపోతున్నారా..? బీజేపీపై పరోక్షంగా యుద్ధం ప్రకటించిన కేసీఆర్ ఇతర పార్టీల నుంచి మద్దతు లభిస్తుందా..? దేశవ్యాప్తంగా మోడీ వ్యతిరేకశక్తులు ఏకమవుతున్నారా..? అంటే అవుననే సమాధానమిస్తున్నాయి ప్రస్తుత రాజకీయాలు. ఢిల్లీ కోటలను బద్ధలుకొడుతాం అని తేల్చి చెప్పిన కేసీఆర్ కు మాజీ ప్రధాని దేవేగౌడ్, పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బేనర్జీ సీఎం కేసీఆర్ ఫోన్ చేసి మద్దతు తెలిసిన విషయం తెలిసిందే. ఇక దేవేగౌడ అయితే ‘రావుగారూ.. మీ యుద్ధం గొప్పది. మేం మీకు మద్దతు ఇస్తున్నాం’ అని కేసీఆర్ భరోసా ఇచ్చారు. తాజాగా కేసీఆర్ కు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాక్రే నుంచి ఆహ్వానం అందింది.

ఈ నెల 20 తేదీ న మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్ధవ్ తో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖరరావు భేటీ కానున్నారు. మహారాష్ట్ర సీఎం ఆహ్వానం మేరకు ఈ నెల 20వ తేదీన సీఎం కేసీఆర్ ముంబైకి బయలుదేరి వెళ్లనున్నారు. ముంబై కి రావాలని, తన ఆతిథ్యం అందుకోవాలని ఉద్ధవ్ ఆహ్వానించారు. బుధవారం సీఎం కేసిఆర్ కు ఫోన్ చేసిన ఉద్ధవ్ కేసీఆర్ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలిపారు. బీజేపీ అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ, ఫెడరల్ న్యాయం కోసం, సీఎం కేసిఆర్ చేస్తున్న పోరాటానికి తన సంపూర్ణ మద్దతును పలికారు. కేసీఆర్ జీ మీరు చాలా గొప్పగా పోరాడుతున్నారు. మీది న్యాయమైన పోరాటం.

ఈ దేశాన్ని విభజన శక్తుల నుంచి కాపాడుకోవడానికి సరైన సమయం లో మీరు గళం విప్పారు. రాష్ట్రాల హక్కుల కోసం, దేశ సమగ్రతను కాపాడేందుకు మీరు పోరాటం కొనసాగించండి. ఇదే స్ఫూర్తి తో ముందుకు సాగండి. మా మద్దతు మీకు సంపూర్ణంగా వుంటుంది. ఈ దిశగా దేశ ప్రజలందరినీ కూడగట్టేందుకు మా వంతు సహకారాన్ని అందిస్తాం”  అని సంపూర్ణ మద్దతు ప్రకటించారు. ‘‘మిమ్మల్ని ముంబై కి ఆహ్వానిస్తున్నాను. మీరు మా ఆతిథ్యం అందుకోండి. అదే సందర్భం లో ఈ దిశగా భవిష్యత్ కార్యాచరణ పై చర్చించుకుందాం..”


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm kcr
  • mumbai
  • telangana
  • Uddav

Related News

'Meta Business Agent' AI tool released for business!

WhatsApp Business Summit : వ్యాపారం కోసం ‘మెటా బిజినెస్ ఏజెంట్’ ఏఐ టూల్ విడుదల!

WhatsApp Business Summit : ముంబై వేదికగా జరిగిన మూడవ వార్షిక బిజినెస్ సమ్మిట్‌లో వాట్సాప్ సంస్థ సరికొత్త విప్లవాత్మక కృత్రిమ మేధస్సు (AI) సాంకేతికతను పరిచయం చేసింది. వ్యాపార సంస్థలు తమ కస్టమర్లతో నిరంతరం సంప్రదింపులు జరుపుతూ, 24/7 కార్యకలాపాలను సాగించేందుకు వీలుగా ‘మెటా బిజినెస్ ఏజెంట్’ (Meta Business Agent) అనే సరికొత్త ఏఐ ఏజెంట్‌ను అధికారికంగా ప్రకటించింది. ఈ ఏఐ టూల్ ద్వారా ప్రతి చిన్న, పెద్ద వ్

  • Telangana is emerging as a global leader in the field of AI: Bhatti Vikramarka

    ఏఐ రంగంలో తెలంగాణ ప్రపంచానికి మార్గదర్శిగా నిలుస్తోంది: భట్టి విక్రమార్క

  • Telangana government takes a serious view of irregularities in the Dharani portal.

    Dharani: ధరణి పోర్టల్ అక్రమాల పై తెలంగాణ సర్కార్ సీరియస్

  • Good news for Singareni workers: Union Minister Kishan Reddy

    Singareni: సింగరేణి కార్మికులకు గుడ్ న్యూస్.. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

  • National Status... Palampet Shiva Temple, Mulugu District

    Palampet Shivalaya Temple: జాతీయ హోదా.. ములుగు జిల్లా పాలంపేట శివాలయం

Latest News

  • Vastu Tips: ఇంట్లో అరటి చెట్టు నాటితే అశుభమా..? శాస్త్రం ఏం చెబుతోంది..!!

  • Cigarette Alert: ఇప్పుడు బాక్స్‌పై కాదు, ప్రతి సిగరెట్‌పై హెచ్చరిక.. ఎక్కడంటే?

  • Harish Rao: బీజేపీతో టచ్‍లో హరీశ్ రావు : రేవంత్ రెడ్డి

  • True Love: ఒక వ్యక్తికి మీ మీద నిజంగా ప్రేమ ఉందో లేదో ఇలా తెలుసుకోవచ్చు!

  • Donald Trump: ముంచుకొస్తున్న డెడ్‌లైన్.. ఇరాన్‎కు ట్రంప్ మాస్ వార్నింగ్

Trending News

    • Kissing Day: ఆవేశపూరితమైన ముద్దు నిమిషానికి 6.4 కేలరీల ఖర్చు చేస్తుంది

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd