Telangana Cabinet: 31న తెలంగాణ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ
భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇందులో సమీక్షిస్తారు.
- By Balu J Published Date - 03:02 PM, Fri - 28 July 23

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశాన్ని జూలై 31న మధ్యాహ్నం 2 గంటల నుంచి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో నిర్వహించాలని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు నిర్ణయించారు. రాష్ట్ర శాసనసభ, శాసనమండలి సమావేశాలను ఆగస్టు 3 నుంచి నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
దాదాపు 40 నుంచి 50 అంశాలపై కేబినెట్ చర్చించనుంది. వరదలు, భారీ వర్షాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను ఇందులో సమీక్షిస్తారు. ప్రస్తుత సీజన్‌లో రైతాంగం వ్యవసాయ పనుల్లో బిజీబిజీగా మారుతున్న నేపథ్యంలో, అకాల వర్షాల కారణంగా ప్రస్తుత పరిస్థితులను, రైతులను ఆదుకునేందుకు అవసరమైన ప్రత్యామ్నాయ వ్యవసాయ విధానాలను కూడా మంత్రివర్గం అంచనా వేయనుంది.
కాల్వలు, వాగులు పొంగిపొర్లడం వల్ల రోడ్ల నష్టం, రోడ్డు రవాణాపై ఎలాంటి ప్రభావం పడుతుందో కూడా మంత్రివర్గం అంచనా వేయనుంది. దెబ్బతిన్న రోడ్ నెట్‌వర్క్‌ను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరించేందుకు కేబినెట్ నిర్ణయాలు తీసుకుంటుంది. టీఎస్‌ఆర్‌టీసీ, ఆర్టీసీ ఉద్యోగుల జీతాల పెంపు తదితర అంశాలపై మంత్రివర్గం చర్చించనుంది. ఎన్నికలు సమీపిస్తుండటంతో వివిధ సంక్షేమ పథకాల అమలుపై వివరంగా చర్చించే అవకాశం ఉంది.
Also Read: PM Modi: జీవవైవిధ్యం పరిరక్షించడంలో భారత్ కృషి మరువలేనిది: పీఎం మోడీ