Telangana Cabinet Expansion: తెలంగాణ కొత్త మంత్రులు వీరే.. నేడే ప్రమాణ స్వీకారం!
తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు ఎమ్మెల్యే), వాకిటి శ్రీహరి (మక్తల్ ఎమ్మెల్యే), అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి ఎమ్మెల్యే) కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.
- By Gopichand Published Date - 09:49 AM, Sun - 8 June 25

Telangana Cabinet Expansion: తెలంగాణ మంత్రివర్గ విస్తరణలో (Telangana Cabinet Expansion) గడ్డం వివేక్ వెంకటస్వామి (చెన్నూరు ఎమ్మెల్యే), వాకిటి శ్రీహరి (మక్తల్ ఎమ్మెల్యే), అడ్లూరి లక్ష్మణ్ (ధర్మపురి ఎమ్మెల్యే) కొత్త మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మధ్యాహ్నం 12:19 గంటలకు రాజ్ భవన్‌లో ఈ కార్యక్రమం జరగనున్నట్లు కాంగ్రెస్ వర్గాలు వివరించాయి. వివేక్ మాల సామాజిక వర్గం నుంచి, అడ్లూరి లక్ష్మణ్ మాదిగ వర్గం నుంచి, వాకిటి శ్రీహరి బీసీ (ముదిరాజ్) సామాజిక వర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఈ విస్తరణ సామాజిక న్యాయానికి ప్రాధాన్యతనిస్తూ జరిగిందని కాంగ్రెస్ వర్గాలు పేర్కొన్నాయి.
నేడు ప్రమాణ స్వీకారం చేయబోతున్న ముగ్గురు మంత్రులు
*వివేక్ వెంకటస్వామి
*వాకిటి శ్రీహరి
* అడ్లూరి లక్ష్మణ్
11:00 గంటలకు రాజభవన్ లో అందుబాటులో ఉండాలన్న జీ ఏ డి.
12:19 కి కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం.ఇది కదా సామాజిక న్యాయమంటే…😊
— Sama Ram Mohan Reddy (@RamMohanINC) June 8, 2025
గడ్డం వివేక్ వెంకటస్వామి
- నియోజకవర్గం: చెన్నూరు (MLA)
- సామాజిక వర్గం: మాల
- విద్యార్హతలు: ఎంబీబీఎస్ (ఉస్మానియా మెడికల్ కాలేజ్, హైదరాబాద్)
- రాజకీయ నేపథ్యం
- గడ్డం వివేక్ వెంకటస్వామి భారత జాతీయ కాంగ్రెస్ (INC) సభ్యుడు, మాజీ పార్లమెంటు సభ్యుడు (15వ లోక్‌సభ, పెద్దపల్లి నియోజకవర్గం).
- 2019లో భారతీయ జనతా పార్టీ (BJP)లో చేరారు. కానీ 2023 నవంబరులో రాహుల్ గాంధీ సమక్షంలో తన కుమారుడు వంశీతో కలిసి తిరిగి కాంగ్రెస్‌లో చేరారు.
Also Read: Maganti Gopinath: ఎవరీ మాగంటి గోపినాథ్.. ఆయన రాజకీయ ప్రయాణం ఇదే!
వాకిటి శ్రీహరి
- నియోజకవర్గం: మక్తల్ (MLA)
- సామాజిక వర్గం: బీసీ (ముదిరాజ్)
- రాజకీయ నేపథ్యం
- వాకిటి శ్రీహరి కాంగ్రెస్ పార్టీ నుంచి మక్తల్ నియోజకవర్గం నుంచి ఎన్నికయ్యారు.
- స్థానిక రాజకీయాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ, సామాజిక న్యాయం, బీసీ సామాజిక వర్గాల హక్కుల కోసం పనిచేస్తున్నారు.
- ఈ విస్తరణలో బీసీ సామాజిక వర్గానికి ప్రాతినిధ్యం వహిస్తూ మంత్రి పదవిని పొందారు.
అడ్లూరి లక్ష్మణ్
- నియోజకవర్గం: ధర్మపురి (MLA)
- సామాజిక వర్గం: మాదిగ
- రాజకీయ నేపథ్యం
- అడ్లూరి లక్ష్మణ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ధర్మపురి నియోజకవర్గం నుంచి ఎన్నికైన MLA.
- మాదిగ సామాజిక వర్గానికి చెందిన లక్ష్మణ్, ఎస్సీ సామాజిక వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నారు.
- స్థానిక సమస్యలపై దృష్టి సారించి, రాష్ట్ర అభివృద్ధిలో పాత్ర పోషిస్తున్నారు.