Telangana BJP Election Committees : తెలంగాణ ఎన్నికల కమిటీలను ప్రకటించిన బీజేపీ
మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటిస్తూ.. ఛైర్మన్లు, కన్వీనర్లను నియమించింది తెలంగాణ బీజేపీ. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది
- Author : Sudheer
Date : 05-10-2023 - 12:16 IST
Published By : Hashtagu Telugu Desk
2023 ఎన్నికల్లో తెలంగాణ లో కాషాయం జెండా ఎగురవేయాలని బిజెపి (BJP) పక్క ప్లాన్ తో ముందుకు వెళ్తుంది..అందులో భాగంగా నేడు ఎన్నికల కమిటీలను ప్రకటించింది (BJP Election Committees). మొత్తం 14 ఎన్నికల కమిటీలను ప్రకటిస్తూ.. ఛైర్మన్లు, కన్వీనర్లను నియమించింది తెలంగాణ బీజేపీ. రాజగోపాల్‌రెడ్డికి కీలక బాధ్యతలు అప్పజెప్పింది. పబ్లిక్ మీటింగ్ కమిటీ ఇంఛార్జ్‌గా బండి సంజయ్, మ్యానిఫెస్టో, పబ్లిసిటీ కమిటీలకు చైర్మన్ గా గడ్డం వివేక్ వెంకటస్వామి, ఛార్జ్‌షీట్ కమిటీ చైర్మన్‌గా మురళీధర్‌రావు ఎంపిక చేసింది.
అలాగే అజిటేషన్ కమిటీ(నిరసనలు, ఆందోళన నిర్వహణల బాధ్యతలు) చైర్మన్ గా విజయశాంతి, ప్రభావిత వ్యక్తులను కలిసే కమిటీ చైర్మన్ గా బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ, ఎన్నికల కమిటీ చైర్మన్గా మర్రి శశిధర్ రెడ్డి, సోషల్ మీడియా కమిటీ చైర్మన్ గా ధర్మపురి అర్వింద్‌లకు బాధ్యతలు అప్పజెప్పింది.
We’re now on WhatsApp. Click to Join.
ఇక పొంగులేటి సుధాకర్, ఎమ్మెల్యే రఘునందన్‌రావు, మాజీ ఎమ్మెల్సీలు రామచందర్‌రావు, పొంగులేటి సుధాకర్‌రెడ్డిలు, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డిలకు సైతం కమిటీలలో చోటు కల్పించారు. ఇదిలా ఉండగా..ఈరోజు హైదరాబాద్ కు బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా రానున్నారు. రాత్రి 10 గంటల సమయంలో నడ్డా రానున్నారు. ఇక రేపు జరిగే బీజేపీ తెలంగాణ రాష్ట్ర కౌన్సిల్ సమావేశానికి జేపీ నడ్డా హాజరు కానున్నారు .

Bjp
Read Also : Congress Joinings: అచ్చంపేట బీఆర్ఎస్ కు షాక్.. కాంగ్రెస్ లో కీలక నేతలు!