Telangana Assembly Session : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం..
ప్రస్తుతం సభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు
- Author : Sudheer
Date : 09-12-2023 - 11:28 IST
Published By : Hashtagu Telugu Desk
తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు (Telangana Assembly Session) ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30కి సమావేశాలు ప్రారంభం కాగానే.. గవర్నర్ తమిళిసై సౌందర రాజన్.. ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్ ఒవైసీ (Akbaruddin Owaisi)తో ప్రమాణ స్వీకారం చేయించారు. అనంతరం సీఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. ఈ సందర్బంగా ప్రొటెం స్పీకర్ గా ఎన్నికైన అక్బరుద్దీన్‌కి శుభాకాంక్షలు తెలిపారు.
We’re now on WhatsApp. Click to Join.
ప్రస్తుతం సభలో ఎమ్మెల్యేలతో ప్రొటెం స్పీకర్ అక్బరుద్దీన్ ఒవైసీ ప్రమాణ చేయిస్తున్నారు. సభ ప్రారంభం కాగానే మొటగా సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఎమ్మెల్యేగా ప్రమాణం చేశారు. ఆ తర్వాత మిగతా ఎమ్మెల్యేలంతా ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. కాగా రెండు సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత తొలిరోజు సమావేశాలు ముగుస్తాయి. తెలంగాణ అసెంబ్లీ సమావేశాలను బీజేపీ బహిష్కరించింది. ప్రొటెం స్పీకర్ నియామాకం విషయంలో అభ్యంతరాలను వ్యక్తం చేసింది. అలాగే బీఆర్ఎస్‌ఎల్పీ నేతగా కేసీఆర్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఆ పార్టీ ఎమ్మెల్యేలు. శాసనసభా పక్ష సమావేశంలో కేసీఆర్ పేరును పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రతిపాదించగా.. తలసాని శ్రీనివాస్ యాదవ్, కడియం శ్రీహరి బలపరిచారు. కేసీఆర్ ఎన్నిక అంశాన్ని అసెంబ్లీ స్పీకర్, కార్యదర్శికి లేఖగా ఇవ్వనున్నారు.
Read Also : CM Revanth: సోనియా గాంధీ జన్మదినం తెలంగాణ ప్రజలకు ఒక పండుగ : సీఎం రేవంత్ రెడ్డి