HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Telangana Assembly Cm Revanth Reddy Bc Reservations

CM Revanth Reddy : ఆరునూరైనా 42 శాతం బీసీ రిజర్వేషన్లు అమలు చేయాలని నిర్ణయించాం

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు.

  • By Kavya Krishna Published Date - 11:03 AM, Sun - 31 August 25
  • daily-hunt
Cm Revanth Reddy
Cm Revanth Reddy

CM Revanth Reddy : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై మాట్లాడారు. భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటున్నామని, ఇతర రాష్ట్రాల్లో ఎదురైన అడ్డంకులు తెలంగాణలో రాకుండా చూస్తామని ఆయన చెప్పారు. ఆరునూరైనా బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. గతంలో స్థానిక సంస్థల ఎన్నికల కోసం 42 శాతం రిజర్వేషన్ల బిల్లును గవర్నర్, రాష్ట్రపతికి పంపితే అది పెండింగ్‌లో పడిందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. గత ప్రభుత్వం 50 శాతం రిజర్వేషన్లు మించకూడదనే చట్టం తీసుకొచ్చిందని, ప్రస్తుతం బీఆర్‌ఎస్ సభ్యులు తెలంగాణ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆయన విమర్శించారు.

11 Sixes Off 12 Balls: క్రికెట్ ప్రపంచంలో సంచలనం.. 12 బంతుల్లో 11 సిక్సులు, వీడియో వైర‌ల్‌!

పంచాయతీరాజ్, మున్సిపల్ చట్టాలు అడ్డంకిగా మారాయని, ఈ సమస్యను తొలగించడానికి ఆర్డినెన్స్ తీసుకొచ్చి గవర్నర్‌కు పంపామని ముఖ్యమంత్రి చెప్పారు. అయితే, తెరవెనుక లాబీయింగ్ చేసి బిల్లును రాష్ట్రపతికి పంపించేలా చేశారని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్లపై గంగుల కమలాకర్ ఒక్కరే సంతోషంగా ఉన్నారని, కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు మాత్రం దుఃఖంతో ఉన్నారని ఆయన అన్నారు. కేంద్రంపై ఒత్తిడి తీసుకురావడానికి తాము జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తే బీఆర్‌ఎస్ మద్దతు తెలపలేదని, బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలన్న చిత్తశుద్ధి బీఆర్‌ఎస్‌కు లేదని రేవంత్ రెడ్డి విమర్శించారు.

‘మేము సహకరించం, మా బుద్ధి మారదు’ అంటే ప్రజలే సమాధానం చెబుతారని సీఎం హెచ్చరించారు. బీఆర్‌ఎస్ తమకు సూక్తులు చెప్పాల్సిన అవసరం లేదని, ముందు వారి నాయకుడు కేసీఆర్‌ను సభకు రమ్మనమని ఆయన అన్నారు. కేసీఆర్ సభకు రాడు, వచ్చినవారు ఇలా ఉన్నారని, ‘కల్వకుంట్ల’ కాదు ‘కలవకుండా చేసే కుటుంబం’ అని రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించారు. ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుని చులకన కావద్దని, పొన్నం ప్రభాకర్‌ను అవమానిస్తే ఏమీ రాదని, అలా మాట్లాడితే మీరే చులకన అవుతారని ఆయన బీఆర్‌ఎస్ సభ్యులకు సూచించారు.

Sudarshan Chakra : ‘సుదర్శన చక్ర’ గేమ్ ఛేంజర్ అవుతుంది – రాజ్‌నాథ్ సింగ్


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • bc reservations
  • brs
  • congress
  • revanth reddy
  • Telangana Assembly

Related News

Brs

BRS : బిఆర్ఎస్ పార్టీకి భారీగా నిధుల కొరత

BRS : తెలంగాణ లో బీఆర్‌ఎస్ (BRS) పార్టీ గత కొద్ది నెలలుగా తీవ్రమైన రాజకీయ మరియు ఆర్థిక సవాళ్లను ఎదుర్కొంటోంది. ముఖ్యంగా గత అసెంబ్లీ ఎన్నికల్లో అధికారాన్ని కోల్పోవడం,

  • Revanth Speech

    Panchayat Polls: తెలంగాణలో పంచాయతీ ఎన్నికల దుమారం: షెడ్యూల్ రిలీజ్‌కు కౌంట్‌డౌన్

  • CM Revanth Reddy doesn't have that courage: KTR

    సీఎం రేవంత్‌ రెడ్డికి ఆ ధైర్యం లేదు : కేటీఆర్‌

  • Siddaramaiah Vs Dk Shivakum

    Siddaramaiah vs DK Shivakumar : సీఎం పదవి పై డీకేకు అధిష్టానం క్లారిటీ!

  • BRS gains momentum in the wake of local body elections.. KTR is preparing for state tours

    KTR : కేటీఆర్ కు బిగ్ షాక్..కార్యకర్తల్లో టెన్షన్

Latest News

  • Nara Lokesh: విద్యాశాఖ మంత్రి సమక్షంలో పసిమొగ్గల ఆనందం!

  • Nepal Currency: ఇకపై చైనాలో నేపాల్ కరెన్సీ ముద్రణ.. భారతదేశం ఎందుకు వైదొలిగింది?

  • Ayodhya Ram Temple : ప్రధాని చేతుల మీదుగా వైభవంగా ధ్వజారోహణం!

  • Parimal Nathwani : వైసీపీ ఎంపీ కొడుకు పెళ్లికి హాజరైన అతిరధ మహారథులు ..ముకేశ్ అంబానీ దంపతులు!

  • Grama Panchayat Elections : ఎమ్మెల్యే కడియం శ్రీహరి రూ.25 లక్షల బంపర్ ఆఫర్

Trending News

    • Miss Universe-2025 : ర్యాంప్ వాక్ చేస్తూ కిందపడ్డ మిస్ యూనివర్స్ బ్యూటీ

    • Private Travels Ticket Rates : సంక్రాంతికి ఊరు వెళ్దామనుకుంటున్నారా.. మీకో బ్యాడ్‌న్యూస్!

    • Andhra Pradesh Government : వారంతా రూ.10 వేలు చెల్లించాల్సిన అవసరం లేదు.. పూర్తిగా ఉచితం.!

    • Bank: రేపు ఈ రాష్ట్రాల్లో బ్యాంకులు మూసి ఉంటాయా?

    • Punjabi Cremation: ధర్మేంద్రకు తుది వీడ్కోలు.. సిక్కు సంప్రదాయంలో అంత్యక్రియలు ఎలా నిర్వహిస్తారంటే?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd