Teenmaar Mallanna Vs Kavitha : ‘కంచం పొత్తు – మంచం పొత్తు’ అంటే అర్ధం ఇదే అంటున్న మల్లన్న
Teenmaar Mallanna Vs Kavitha : అధికారం పోయినా కవిత అహంకారం తగ్గలేదని విమర్శిస్తూ, ఇప్పటికైనా ఆమె తపన వదిలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాలని సూచించారు
- Author : Sudheer
Date : 14-07-2025 - 3:37 IST
Published By : Hashtagu Telugu Desk
బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితపై ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న (Teenmaar Mallanna) తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 2017లో జరిగిన తెలుగు మహాసభల సందర్భంగా అప్పటి సీఎం కేసీఆర్ ప్రభుత్వం ప్రచురించిన ఓ పుస్తకంలో “మంచం పొత్తు – కంచం పొత్తు” అనే పదాలుఉన్నాయని గుర్తు చేశారు. ఆ పుస్తకానికి ముందుమాట రాసింది కూడా కేసీఆర్‌నే అని చెప్పారు. ఈ పదాలకు అర్థం తెలియకుండా బీసీల భాషను తప్పుగా వివరించడం ద్వారా కవిత (Kavitha) బీసీ వర్గాలపై అవమానకరంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. తాను తెలుగు వ్యాకరణంపై మంచి పట్టు కలిగి ఉన్నానని, ఏ పదాన్ని ఎలా వాడాలో తానుకే తెలుసని తీన్మార్ మల్లన్న వ్యాఖ్యానించారు.
బీసీ వర్గాల భాషలో “కంచం పొత్తు” అనేది ‘వియ్యం పొత్తు’ అనే అర్థంలో వాడతారని, అలాంటి పదాన్ని తప్పుగా ప్రస్తావించి బీసీల పరువు తీసే ప్రయత్నం కవిత చేస్తున్నారని విమర్శించారు. “మంచం పొత్తు” అంటే ఏంటో తనకే అర్థం కావడంలేదని మల్లన్న ఎద్దేవా చేశారు. ఈ వ్యాఖ్యల నేపథ్యంలో శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డిని ఆయన కలిసి ఫిర్యాదు చేశారు. కవిత చేసిన వ్యాఖ్యలపై విచారణ జరిపించాలని కోరారు. కవిత వ్యవహార శైలి శాసనమండలి సభ్యురాలికి తగినట్లు లేదని ఆరోపిస్తూ ఆమె సభ్యత్వాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు.
అనంతరం తీన్మార్ మల్లన్న మీడియాతో మాట్లాడుతూ.. బీసీల ఉద్యమాన్ని అడ్డుకునేందుకు కవిత కుట్రలు పన్నుతోందని ధ్వజమెత్తారు. కవిత బీసీలను అణిచివేయాలనే ఉద్దేశంతో వ్యవహరిస్తోందని, ఇదంతా ఆమె అధికార మదంతో కూడిన చర్యలుగా అభివర్ణించారు. అధికారం పోయినా కవిత అహంకారం తగ్గలేదని విమర్శిస్తూ, ఇప్పటికైనా ఆమె తపన వదిలి ప్రజాస్వామ్య పద్ధతుల్లో నడవాలని సూచించారు. బీసీల వాదనను దిగజార్చే విధంగా వ్యవహరించడాన్ని తాము సహించబోమని హెచ్చరించారు.
కేసీఆర్ హయాంలోనే బీసీల రిజర్వేషన్లు తగ్గించారని, ఇప్పుడు మళ్లీ అదే వర్గంపై దాడికి దిగడం అన్యాయమని తీన్మార్ మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీల హక్కులు, భాషను కాపాడే క్రమంలో తన వంతు పోరాటాన్ని కొనసాగిస్తానని స్పష్టం చేశారు. కవిత ప్రేరేపితులు తనపై పలు అరాచకాలు చేస్తుంటే కూడా తానొక న్యాయబద్ధమైన పద్ధతిలో పోరాడతానని తెలిపారు. కవితపై చర్యలు తీసుకోవాలని శాసనమండలి చైర్మన్ హామీ ఇవ్వడంతో, దీనిపై మరో మలుపు తక్కువ సమయంలోనే తిరుగుతుందా అన్న ఆసక్తి నెలకొంది.