HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Andhra Pradesh
  • >Tdp Workers Decided To Show Solidarity With Chandrababu By Traveling In Black Dresses In Metro

I Am With CBN : మియాపూర్ టూ ఎల్బీన‌గ‌ర్‌.. నేడు చంద్ర‌బాబుకు మ‌ద్ద‌తుగా మెట్రో  రైలులో బ్లాక్ డ్రెస్‌ల‌తో ప్ర‌యాణం

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. హైద‌రాబాద్‌లో టీడీపీ

  • Author : Prasad Date : 14-10-2023 - 8:33 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
CBN
CBN

టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అక్ర‌మ అరెస్ట్‌పై టీడీపీ శ్రేణులు ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తున్నారు. హైద‌రాబాద్‌లో టీడీపీ శ్రేణులు, ఆయ‌న అభిమానులు వివిధ రూపాల్లో ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిర‌స‌న‌లు వ్య‌క్తం చేస్తున్నారు. బ్లాక్ డే ప్రైడే పేరుతో నిన్న ఐటీ ఉద్యోగులు బ్లాక్ డ్రెస్‌ల‌తో ఆఫీసుల‌కు వెళ్లారు. తాజాగా టీడీపీ కార్య‌క‌ర్త‌లు, ఐటీ ఉద్యోగులు మెట్రోలో బ్లాక్ డ్రెస్‌ల‌తో ప్ర‌యాణించి చంద్ర‌బాబుకు సంఘీభావం తెల‌పాల‌ని నిర్ణ‌యించారు. ఈ రోజు(శ‌నివారం) ఉద‌యం 10.30 గంట‌ల నుంచి 11.30 గంట‌ల మ‌ధ్య మియాపూర్ టూ ఎల్బీన‌గ‌ర్ వ‌ర‌కు మెట్రోలో ప్ర‌యాణించాల‌ని పిలుపునిచ్చారు. ఐ యామ్ విత్ సీబీఎన్ ప్ల‌కార్డులు, బ్లాక్ టీ ష‌ర్ట్‌, ఎల్లో క‌ల‌ర్ క్యాప్ ధ‌రించి చంద్ర‌బాబుకు మ‌ద్దతు తెల‌పాల‌ని పిలుపునిచ్చారు. మిగ‌తా ప్ర‌యాణికుల‌కు ఇబ్బంది క‌ల‌గ‌కుండా ఈ కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించాల‌ని చంద్ర‌బాబు అభిమానులు కోరారు. చంద్ర‌బాబుపై స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాంలో అక్ర‌మంగా అరెస్ట్ చేశార‌న్న విష‌యాన్ని అంద‌రికి తెలియ‌జేసేలా కార్య‌క్ర‌మం నిర్వ‌హిస్తున్నారు. స్కిల్ డెవ‌ల‌ప్‌మెంట్ స్కాం కేసులో టీడీపీ అధినేత చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ అయ్యారు. అప్ప‌టి నుంచి రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాక‌.. ఇత‌ర దేశాల్లో ఉన్న టీడీపీ అభిమానులు, చంద్ర‌బాబు అభిమానులు ఆయ‌న‌కు మ‌ద్ద‌తుగా ఆందోళ‌న‌లు చేస్తున్నారు. ఐటీ ఉద్యోగులు వినూత్నంగా నిర‌స‌న‌లు చేప‌ట్టి చంద్ర‌బాబుకు మ‌ద్దతుగా నిలుస్తున్నారు.

Also Read:  TDP : తెలంగాణలో టీడీపీ రాజకీయ వ్యూహం అదేనా?

 

 


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • andhra pradesh
  • cbn
  • I am with CBN
  • Nara Chandra babu Naidu
  • tdp

Related News

Village development in AP: Centre allocates Rs 16,627 crore.

ఏపీకి కేంద్రం పెద్దపీట.. గ్రామాల అభివృద్ధి.. రూ.16,627 కోట్లు మంజూరు

Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం తీపికబురు చెప్పింది. రాష్ట్రంలో గ్రామ పంచాయతీలు, జిల్లా, మండల పరిషత్తులకు భారీగా నిధులు కేటాయించింది. 16వఆర్థిక సంఘం నిధులు ఏకంగా రూ.16,627 కోట్లు కేటాయించారు. ఈ నిధుల్లో బేసిక్ గ్రాంట్ రూ.13,302 కోట్లు కాగా.. పెర్‌ఫార్మెన్స్‌ గ్రాంట్‌ రూ.3,225 కోట్లు ఉన్నాయి. 2026-27 నుంచి 2030-31 వరకు ఐదేళ్లపాటు రాష్ట్రానికి ఈ నిధులు విడుదల చేయనుంది. గత ఐదేళ్లలో కేంద్రం రాష్ట్

  • Massive public meeting on the alliance's two-year rule

    Chandrababu Naidu: కూటమి రెండేళ్ళ పాలనపై భారీ బహిరంగ సభ

  • Zomato gets Rs 9.6 crore GST demand from Andhra Pradesh

    Zomato: జొమాటో కు షాక్.. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రూ. 9.6 కోట్ల జీఎస్‌టీ నోటీసు

  • That is the very day the 'Thalliki Vandanam' money gets credited!

    Thalliki Vandanam: తల్లికి వందనం డబ్బులు పడేది ఆరోజే!

  • Centre sanctions massive funds for AP: Union Minister Pemmasani Chandra Sekhar

    Pemmasani Chandra Sekhar: ఏపీకి కేంద్రం భారీగా నిధులు మంజూరు: కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్

Latest News

  • Single: అబ్బాయిలు.. సోలోగా ఉండాలనుకుంటున్నారా? మీ ఆయుష్షు తగ్గినట్లే!

  • అస్సాంలో కూలిన IAF AN-32 విమానం.. రంగంలోకి రెస్క్యూ టీమ్స్!

  • Amaravati Capital: జగన్‌పై మంత్రి నారాయణ ఫైర్

  • Nayeem Hasan: చటోగ్రామ్‌లో బంగ్లాదేశ్ క్రికెటర్ నయీం హసన్‌పై పోలీసులు దాడి.. రచ్చ రచ్చ

  • Vitamin D: విటమిన్ డి ఎక్కువగా తీసుకుంటే ప్రమాదం

Trending News

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd