Telangana TDP: తెలంగాణ టీడీపీ అభ్యర్థుల జాబితా రెడీ
వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ముందు పార్టీ అధిష్టానం
- Author : Praveen Aluthuru
Date : 19-10-2023 - 10:28 IST
Published By : Hashtagu Telugu Desk
Telangana TDP: వచ్చే నెలలో జరగనున్న తెలంగాణ రాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ దాదాపు 65 స్థానాల్లో పోటీ చేయాలని యోచిస్తోంది. నియోజకవర్గాల అభ్యర్థులను అధికారికంగా ప్రకటించే ముందు పార్టీ అధిష్టానం తుది నిర్ణయం కోసం వేచి ఉంది. ఈసారి టీడీపీ ఒంటరిగా వెళ్లాలని నిర్ణయించుకుంది. 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, వామపక్షాలతో పొత్తు పెట్టుకుని టీడీపీ పోటీ చేసింది. అయితే కేవలం రెండు సీట్లు మాత్రమే గెలిచింది. ఆ తర్వాత ఇద్దరు ఎమ్మెల్యేలు అధికార బీఆర్ఎస్ కి ఫిరాయించారు.
తెలంగాణ టీడీపీ అధినేత కాసాని జ్ఞానేశ్వర్ వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థులను ఖరారు చేసినట్లు ఇటీవల ప్రకటించారు. ఎన్నికల్లో మా అవకాశాలపై పార్టీ నాయకత్వం ఆశాజనకంగా ఉందని తెలిపారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో జైలులో ఉన్నందున పార్టీ అభ్యర్థులను ప్రకటించడంలో జాప్యం జరుగుతోంది. ఒకట్రెండు రోజుల్లో అభ్యర్థుల ప్రకటనపై ఓ కొలిక్కి వస్తుందని తెలంగాణ టీడీపీ నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాల నుంచి టీడీపీ తమ అభ్యర్థులను ఎక్కువగా బరిలోకి దించనుంది.
Also Read: PM Modi: పాలస్తీనా విషయంలో భారత్ వైఖరిలో మార్పు ఉండదు