Revanth Arrest: టీకాంగ్రెస్ చీఫ్ రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్!
తెలంగాణ కాంగ్రెస్ (TCongress) అధ్యక్షుడు రేవంత్ రెడ్డి హౌస్ అరెస్ట్ అయ్యారు.
- Author : Balu J
Date : 02-01-2023 - 11:21 IST
Published By : Hashtagu Telugu Desk
సర్పంచుల నిధుల సమస్యలపై తెలంగాణ కాంగ్రెస్ (T Congress) ఆందోళనకు పిలుపునిచ్చింది. సోమవారం ధర్నా చౌక్ వద్ద సర్పంచుల నిధుల సమస్యలపై ధర్నా (Protest) చేపట్టేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ నేతలను ధర్నాలో పాల్గనకుండా పోలీసులు అడ్డుకున్నారు. ధర్నా చౌక్ వద్ద సర్పంచుల ధర్నా అనుమతి కోసం టీపీసీసీ (TCongress) దరఖాస్తును పోలీసులు అంగీకరించేదు. దీంతో అనుమతి నిరాకరించినా ధర్నా చేస్తామని లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన చేస్తామని హెచ్చరించారు. పోలీసులు ముందస్తు చర్యల్లో భాగంగా టీపీసీసీ (T Congress) అధ్యక్షులు రేవంత్ రెడ్డి ఇంటి చుట్టూ మోహరించారు. ధర్నాలో పాల్గనకుండా హౌస్ అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ తనను అడ్డుకున్న ధర్నాలో పాల్గొని తీరుతానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నేతలను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు.
సర్పంచ్ సమస్యలపై ధర్నా
సర్పంచుల సమస్యలను పరిష్కరించాలన్న డిమాండ్‌తో సోమవారం టీపీసీసీ ఆధ్వర్యంలో ఇందిరాపార్కు (Indira Park) ధర్నా చౌక్‌లో ధర్నా జరగనుంది. టీపీసీసీ పెట్టుకున్న దరఖాస్తుకు ఆదివారం పొద్దు పోయే వరకూ అనుమతి లభించలేదు. పోలీసులు అనుమతి ఇచ్చినా, ఇవ్వకున్నా ధర్నా నిర్వహిస్తామని టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు మల్లు రవి (Mallu ravi) స్పష్టం చేశారు. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ధర్నా కార్యక్రమం ఉంటుందని ఓ ప్రకటనలో ఆయన వెల్లడించారు.
Also Read : NTR 30: శరవేగంగా ‘ఎన్టీఆర్-కొరటాల శివ’ మూవీ షూటింగ్.. రిలీజ్ డేట్ లాక్!