HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Target On Jupally Krishna Rao

Jupally Krishna Rao : జూపల్లి ని దెబ్బ తీయాలని చేస్తుందేవరు..?

Jupally Krishna Rao : తెలంగాణ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఇటీవల వరుసగా వివాదాల కేంద్రబిందువుగా మారుతున్నారు

  • Author : Sudheer Date : 29-10-2025 - 10:36 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Jupally Target
Jupally Target

తెలంగాణ మంత్రిగా కీలక శాఖలను నిర్వహిస్తున్న జూపల్లి కృష్ణారావు ఇటీవల వరుసగా వివాదాల కేంద్రబిందువుగా మారుతున్నారు. తాజాగా ఆయన ఆర్టీఐ దరఖాస్తులు వేసారనే ఆరోపణలు మీడియా ద్వారా వెలువడటం పెద్ద చర్చకు దారి తీసింది. ప్రభుత్వం తరపున ఉన్న మంత్రికి అవసరమైన సమాచారాన్ని పొందేందుకు శాఖాధికారులను నేరుగా ఆదేశించే అధికారం ఉంది. ఆర్టీఐ ద్వారా సమాచారాన్ని కోరడం అసంభవం. అయినప్పటికీ భూముల కేటాయింపులు, టెండర్లపై ఆరా తీసేందుకు మంత్రే ఆర్టీఐ వేశారంటూ ప్రచురించిన వార్తలు మంత్రి పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించేంతగా ఉద్రిక్తతను పెంచాయి. తనపై కావాలనే కుట్ర జరుగుతోందని జూపల్లి ఘాటుగా స్పందించారు.

Jamaica Floods: జమైకాలో కుంభవృష్టి..ప్రమాదంలో వేలాదిమంది

ఆర్టీఐ వివాదానికి ముందు ఎక్సైజ్ శాఖలో హై-సెక్యూరిటీ హోలోగ్రామ్ టెండర్ల వ్యవహారం కూడా పెద్దఎత్తున రచ్చకు దారి తీసింది. టెండర్ల ప్రక్రియలో ఆలస్యం చేస్తూ పాత వెండర్లకు ప్రయోజనం కల్పించేందుకు ప్రయత్నించారని ఆరోపణలు జూపల్లి ప్రిన్సిపల్ సెక్రటరీ రిజ్వీపై చేశారు. ఈ వివాదం చివరికి రిజ్వీ వీఆర్‌ఎస్ తీసుకునే స్థాయికి చేరుకుంది. దీంతో మంత్రి పాలనాపరమైన జోక్యం పై ప్రభుత్వ వర్గాల్లోనూ, ప్రతిపక్షంలోనూ చర్చ మొదలైంది. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులను వేధిస్తోందని, అవినీతి ప్రయోజనాల వల్లే ఈ గొడవ అంటూ బీఆర్‌ఎస్ తీవ్ర విమర్శలు చేసింది.

ఈ రెండు పరిణామాలు కలిసి మంత్రి జూపల్లిపై దాడులు మరింత పెరగడానికి దారితీశాయి. జూపల్లి నిర్వహిస్తున్న శాఖలు అధిక ఆదాయం వచ్చే రంగాలు కావడంతో రాజకీయంగా ఆయనను బలహీనపర్చాలనే ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఒక వర్గం మంత్రిని టార్గెట్ చేస్తోందని, సోషల్ మీడియాలో దుష్ప్రచారం జరుగుతోందని ఆయన అనుచరులు అంటున్నారు. వరుస వివాదాలు పార్టీకి, ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించే అవకాశముండడంతో, ఈ వ్యవహారంలో జూపల్లి ఎలాంటి లీగల్‌ అడుగులు వేస్తారో, రాజకీయంగా ఎలా ఎదుర్కొంటారో అన్నది ఇప్పుడు ఆసక్తిగా మారింది.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Jupally Krishna Rao
  • jupally krishna rao controversy
  • Target on Jupally Krishna Rao

Related News

    Latest News

    • TGSRTC : ప్రయాణికులకు గుడ్ న్యూస్.. బస్సు ఛార్జీల తగ్గింపు

    • Good News : డ్వాక్రా మహిళలకు సీఎం చంద్రబాబు తీపికబురు.. త్వరలో మరో పథకం అమలు

    • Wife Kills Husband : ప్రియుడి కోసం భర్తను కడతేర్చిన భార్య.. గుండెపోటు డ్రామా వెనుక భయంకరమైన నిజం

    • ఏపీలో తొలి దశలో 135 ఈవీ ఛార్జింగ్ కేంద్రాలు ఏర్పాటు

    • టీమిండియాపై నోట్ల వర్షం.. బీసీసీఐ బంపర్ ఆఫర్

    Trending News

      • టీమిండియా నెక్స్ట్ టార్గెట్ ఇదేనా?!

      • హనుమాన్ జన్మోత్సవం.. పూజా ముహూర్తం, పరిహారాలివే!

      • క‌న్నీళ్లు ఆపుకుని ఫైన‌ల్ మ్యాచ్ ఆడిన ఇషాన్ కిష‌న్‌!

      • Prabhakar Prasad: అమెరికా లో చాయ్ అమ్ముతూ ఇండియన్ ఎంత సంపాదిస్తున్నాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే !!

      • టీ20 వరల్డ్ కప్ ఫైనల్‌లో స‌రికొత్త రికార్డు క్రియేట్ చేసిన భార‌త్‌!

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd