Talluri Jeevan Kumar : బీఆర్ఎస్‌లోకి తాళ్లూరి జీవన్ కుమార్..
ఖమ్మం టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు
- Author : Sudheer
Date : 22-10-2023 - 8:58 IST
Published By : Hashtagu Telugu Desk
ఎన్నికల సమయం దగ్గర పడుతుండడం తో వలసల పర్వం మరింత జోరు అందుకుంది. ముఖ్యంగా బిఆర్ఎస్ (BRS) , కాంగ్రెస్ (Congress) పార్టీల మధ్య నేతల వలసలు భారీగా నడుస్తున్నాయి. ఇటు పార్టీ నేతలు అటు పార్టీ లోకి అటు పార్టీ నేతలు ఇటు పార్టీ లోకి జంప్ చేస్తున్నారు. ఇదే క్రమంలో టీడీపీ (TDP) శ్రేణులు సైతం ఆ పార్టీ కి రాజీనామా చేసి అధికార పార్టీ బిఆర్ఎస్ లోకి చేరుతున్నారు. తాజాగా ఖమ్మం టీడీపీ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఖమ్మం కమ్మ మహాజన సంఘం జిల్లా కార్యదర్శి తాళ్లూరి జీవన్ కుమార్ (Talluri Jeevan Kumar) శనివారం రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, ఎమ్మెల్సీ తాతా మధుసూధన్, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య సమక్షంలో బీఆర్ఎస్ (BRS) పార్టీలో చేరారు.
We’re now on WhatsApp. Click to Join.
ఖమ్మం మత్స్యకార సహకార సంఘం సభ్యుడు సింగు శ్రీనివాస్‌తో పాటు 100 కుటుంబాలు జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. అదేవిధంగా కేసీఆర్ టవర్స్ ప్రాంతానికి చెందిన 30 కుటుంబాలు నేలమర్రి రామారావు ఆధ్వర్యంలో కాంగ్రెస్ నుంచి బీఆర్‌ఎస్‌లో చేరారు. వీరందరికి పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. కాంగ్రెస్ నేతలు తనను బలవంతంగా పార్టీ కండువా కప్పి, ఫొటోలు తీసి సోషల్ మీడియాలో ప్రచారం చేశారని బీఆర్‌ఎస్ 31వ మున్సిపల్ డివిజన్ ప్రధాన కార్యదర్శి వెలంపల్లి వెంకట సుబ్బారావు చెప్పుకొచ్చారు. తాను ఎప్పుడూ బీఆర్‌ఎస్‌తోనే ఉంటానని, వేరే పార్టీలోకి వెళ్లాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ నేత తుమ్మల నాగేశ్వరరావుకు సంఘీభావం తెలిపినట్లు కాంగ్రెస్ నేత చేసిన వ్యాఖ్యలను బీఆర్‌ఎస్ సానుభూతిపరుడు, ప్రముఖ కాంట్రాక్టర్ గరికపాటి వెంకటేశ్వరరావు అలియాస్ ఆర్టీసీ వెంకటేశ్వరరావు ఖండించారు.
ఇదిలా ఉంటె ఈసారి ఎన్నికలు కాంగ్రెస్ vs బిఆర్ఎస్ మధ్యనే జరగబోతున్నట్లు స్పష్టంగా తెలుస్తుంది. ముఖ్యంగా ఖమ్మం జిల్లాపై అందరి చూపు నెలకొని ఉంది. కాంగ్రెస్ పార్టీ కి కంచుకోట ఖమ్మం అని చెపుతుంటారు. గతంలో కాంగ్రెస్ పార్టీ ద్వారా గెలిచినా నేతలే బిఆర్ఎస్ లో చేరడం జరిగింది. ఈసారి బిఆర్ఎస్ నుండి కీలక నేతలు తుమ్మల , పొంగులేటి వాటి సీనియర్ నేతలు కాంగ్రెస్ లో చేరడం తో ఈసారి ఖమ్మం ఎన్నికలు మరింత వేడి మీద ఉన్నాయి. ఖమ్మం నుండి తుమ్మల కాంగ్రెస్ బరిలో నిలుస్తుండగా.అటు బిఆర్ఎస్ నుండి పువ్వాడ బరిలో ఉన్నాడు.
Read Also : Game Changer : దసరా కు మెగా సర్ప్రైజ్ లేనట్లేనా..?