HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Take All Steps During Ramzan Month Without Any Hassle Minister

Ramzan Month: రంజాన్ మాసంలో ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని చర్యలు చేపట్టండి: మంత్రి

మసీదు ,ఈద్గా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు ,తాత్కాలిక లైట్ ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు.

  • By Gopichand Published Date - 03:51 PM, Tue - 18 February 25
  • daily-hunt
Ramzan Month
Ramzan Month

Ramzan Month: మార్చి రెండవ తేదీ నుండి ప్రారంభమయ్యే రంజాన్ మాసంలో (Ramzan Month) చేయాల్సిన ఏర్పాట్లపై డా. బి.ఆర్ అంబేద్కర్ సచివాలయంలో ఆరవ ఫ్లోర్ కాన్ఫరెన్స్ హాల్లో మైనారిటీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సమీక్షా సమావేశంలో హైదరాబాద్ ఇన్చార్జి మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. సమావేశంలో రంజాన్ మాసంలో తీసుకోవాల్సిన చర్యలపై దిశా నిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ రంజాన్ నెల లో నగరంలో పరిశుభ్రత విషయంలో ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జీహెచ్ఎంసీ కమిషనర్ ఇలంబర్తి తెలిపారు.

మసీదు ,ఈద్గా ల వద్ద ప్రత్యేక శానిటేషన్ బృందాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. వీధి దీపాలు మరమత్తులు ,తాత్కాలిక లైట్ ల ఏర్పాటు చేస్తామని జీహెచ్ ఎంసీ కమిషనర్ తెలిపారు. రోడ్ల మరమత్తులు పూర్తి చేస్తామని వెల్లడించారు. మక్కా మసీద్ , రాయల్ మాస్క్ , మిరాలం ఈద్గా వద్ద ప్రత్యేక చర్యలు చేపడుతున్నామన్నారు. యుద్ధ ప్రాతిపదికన పనులు చేస్తున్నామని పేర్కొన్నారు. రాత్రి సమయంలో దోమల నివారణకు జిహెచ్ఎంసి ఎంటమాలజీ టీం ద్వారా ఫాగింగ్ చేస్తున్నట్లు పేర్కొన్నారు. మసీదు ల వద్ద ప్లాస్టిక్ కవర్ ల పంపిణీ చేస్తున్నామన్నారు. అన్ని డిపార్ట్మెంట్స్ కలిపి ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ప్రత్యేక అధికారులను నియమించి సమన్వయం చేస్తున్నామని తెలిపారు.

వాటర్ వర్క్ మసీదులు , ఈద్గాల వద్ద వాటర్ ప్యాకెట్స్ లో ఏర్పాటు , తాగునీటి అవసరాల దృశ్య ప్రత్యేక ట్యాంకర్లు ఏర్పాటు. మసీద్ లకు వెళ్లే దారిలో డ్రైనేజీల రిపేర్ పూర్తి చేస్తున్నామని వాటర్ వర్క్స్ ఎండి అశోక్ రెడ్డి తెలిపారు. వేసవికాలం దృశ్య విద్యుత్ డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో రంజాన్ నెలలో మొబైల్ ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. డిమాండ్ తగ్గ సప్లై ఉండేలా ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నామని వెల్లడించారు. మసీదుల వద్ద ఈద్గల వద్ద విద్యుత్ ఎమర్జెన్సీ సిబ్బంది 24 గంటలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మసీదుల వద్ద టెంట్లు ఏర్పాటు చేయడంతో పాటు క్యూలైన్ ల కోసం బారికేట్లు ఏర్పాటు చేయడానికి ఆర్ అండ్ బి విభాగం సిద్ధంగా ఉందని అధికారులు వెల్లడించారు. రంజాన్ నెల నేపథ్యంలో ప్రజలకు పాల ఇబ్బందులు లేకుండా ఉండడానికి అవసరాలకు తగిన పాలను సరఫరా చేస్తామని డైరీ అధికారులు తెలిపారు. ముస్లిం ఉద్యోగులకు సాయంత్రం నాలుగు గంటలకే విధులు ముగించేలా ఇప్పటికే ఉత్తర్వులు జారీ చేశామని జెఏడి అధికారులు తెలిపారు.

Also Read: Bowling Coach Morne Morkel: ఛాంపియ‌న్స్ ట్రోఫీకి దూర‌మైన టీమిండియా బౌలింగ్ కోచ్‌.. కార‌ణ‌మిదేనా?

రంజాన్ పండగ ప్రజలకు ఇబ్బందులు కలగకుండా షాపింగ్ చేసుకోవడానికి ట్రాఫిక్ ను నియంత్రిస్తూ అర్ధరాత్రి వరకు వీధి వ్యాపారాలు కొనసాగించడానికి అనుమతించాలని పోలీస్ అధికారులను ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు విజ్ఞప్తి చేశారు. రంజాన్ పండుగ దృశ్యం ట్రాఫిక్ పేరుతో ఇబ్బందులు కలిగించకూడదని కోరారు. పండగ రోజు ట్రాఫిక్ మళ్లింపుల పై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు. పండగ దృశ్య ప్రజలకు ఇబ్బందులు కలవకుండా వైద్య అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఈద్గాలు మసీదుల వద్ద హెల్త్ క్యాంపులు ఏర్పాటు చేయాలని నిరంతరం వైద్య సిబ్బంది అందుబాటులో ఉండాలని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదేశించారు. రంజాన్ నెలలో ముస్లిం సోదరులకు పండగ నిర్వహించుకోవడానికి సమయానికి రేషన్ అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సివిల్ సప్లై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

సమావేశంలో ప్రభుత్వ సలహాదారు షబ్బీర్ అలీ జిహెచ్ఎంసి మేయర్ గద్వాల్ విజయలక్ష్మి, తెలంగాణ మైనారిటీ వెల్ఫేర్ స్పెషల్ సెక్రటరీ తౌసిఫ్ ఇక్బాల్ , ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు, ఫహీం ఖురేషి మైనార్టీ రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ వైస్ చైర్మన్ ,తెలంగాణ వక్ఫ్ చైర్మన్ సయ్యద్ అజ్మతుల్లా హుస్సేనీ , హజ్ కమిటీ చైర్మన్ సయ్యద్ గులాం అఫ్జల్ బియబని ,మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబెతుల్లా కొత్వాల్ ,మైనార్టీ కమిషన్ చైర్మన్ తారిఖ్ అన్సారీ , ఉర్దూ అకాడమీ చైర్మన్ తహర్బిన్ హందాన్ , బీసీ కార్పొరేషన్ చైర్మన్ నూతి శ్రీకాంత్ గౌడ్, జీహెచ్ ఎంసీ కమిషనర్ ఇలంబర్తి , హైదరాబాద్ కలెక్టర్ అనుదీప్ దురషెట్టి, వాటర్ వర్క్స్ ఎండీ అశోక్ రెడ్డి వివిధ అధికారులు


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • cm revanth
  • hyderabad
  • Minister Ponnam
  • Muslims Festival
  • ramzan
  • Ramzan Month
  • Ramzan News
  • telangana

Related News

Bandh Effect

BC Bandh in Telangana : దీపావళి వ్యాపారంపై బంద్ ప్రభావం?

BC Bandh in Telangana : పోలీసులు బంద్ నేపథ్యంలో భద్రతా చర్యలు చేపట్టగా, వ్యాపార వర్గాలు మాత్రం పండుగ సమయానికి ఇలాంటి రాజకీయ ఆందోళనలు ప్రజల ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తాయని అంటున్నారు

  • Gold Price Aug20

    Gold & Silver Rate Today : ఒకేసారి భారీగా తగ్గిన వెండి ధరలు

  • Kavitha Bc Bandh

    BC Bandh: బీసీ బంద్.. కవిత ఆటో ర్యాలీ

  • Jubilee Hills

    Jubilee Hills: జూబ్లీహిల్స్‌ ఉప ఎన్నికలో కాంగ్రెస్‌ అభ్యర్థికి సీపీఐ సంపూర్ణ మద్దతు!

  • Liquor Shops

    Liquor Shops: మద్యం దుకాణాలకు భారీగా దరఖాస్తులు!

Latest News

  • Chinese Physicist Chen-Ning Yang: నోబెల్ అవార్డు గ్రహీత కన్నుమూత!

  • Air India: ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం.. ఇట‌లీలో చిక్కుకున్న ప్ర‌యాణీకులు!

  • No Kings Protests: ట్రంప్‌కు బిగ్ షాక్‌.. రోడ్డెక్కిన వేలాది మంది ప్ర‌జ‌లు!

  • ‎Money Plant: ఏంటీ.. మనీ ప్లాంట్ ఇంట్లో పెంచడం వల్ల ఏకంగా అన్ని లాభాలా?

  • ‎Hair Growth: ఈ ఒక్క పువ్వుతో మీ జుట్టు గడ్డిలా ఏపుగా పెరగడం ఖాయం.. ఇంతకీ ఆ పువ్వు ఏదో తెలుసా?

Trending News

    • Diwali: దీపావ‌ళి ఏ రోజు జ‌రుపుకోవాలి? లక్ష్మీ పూజ ఎలా చేయాలంటే?

    • Layoffs: ఉద్యోగాలు కోల్పోవ‌డానికి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కార‌ణ‌మా?!

    • RCB For Sale: ఆర్సీబీని కొనుగోలు చేయ‌నున్న అదానీ గ్రూప్‌?!

    • Diwali: దీపావ‌ళి రోజు ప‌టాకులు కాల్చుతున్నారా? అయితే ఈ వార్త మీకోస‌మే!

    • Gold Prices: 10 గ్రాముల బంగారం ధ‌ర రూ. 1.35 ల‌క్ష‌లు?!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd