Police Dog Squads : పోలీసు డాగ్ స్క్వాడ్ కోసం స్విమ్మింగ్ పూల్
Police Dog Squads : నేరపూరిత ఘటనల్లో కీలక పాత్ర పోషించే పోలీసు డాగ్ స్క్వాడ్ శునకాల (Police Dog Squads) ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ఈత కొలను(Swimming Pool)ను నిర్మించారు
- Author : Sudheer
Date : 19-06-2025 - 11:50 IST
Published By : Hashtagu Telugu Desk
ఆదిలాబాద్ జిల్లా పోలీసు శాఖ (Police Department) కొత్తగా చేసిన ఒక వినూత్న ప్రయత్నం రాష్ట్రవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. నేరపూరిత ఘటనల్లో కీలక పాత్ర పోషించే పోలీసు డాగ్ స్క్వాడ్ శునకాల (Police Dog Squads) ఆరోగ్యాన్ని కాపాడేందుకు ప్రత్యేకంగా ఈత కొలను(Swimming Pool)ను నిర్మించారు. ఇది తెలంగాణలో పోలీసు జాగిలాల కోసం ఏర్పాటు చేసిన తొలి స్విమ్మింగ్ పూల్ కావడం విశేషం. జిల్లా ఎస్పీ అఖిల్ మహజన్ స్వయంగా ఈ పూల్‌ను ప్రారంభించారు.
Illegal Affair: అక్రమ సంబంధం.. అడ్డంగా దొరికిన భార్య.. కోపంతో భార్య ముక్కు కొరికేసిన భర్త
ఆదిలాబాద్ పోలీసు డాగ్ స్క్వాడ్‌లో ఎనిమిది శునకాలు సేవలందిస్తున్నాయి. వీటిలో ఐదు జాగిలాలు బాంబు మరియు పేలుడు పదార్థాలను గుర్తించడంలో నిపుణత కలవి కాగా, రెండు నేరస్థుల పట్టుకోవడంలో శిక్షణ పొందినవిగా ఉన్నాయ్. మరొక జాగిలం మాదకద్రవ్యాల గుర్తింపు కోసం వినియోగించబడుతోంది. ముఖ్యంగా ప్రముఖుల పర్యటనలు, గుంపుల వసతి, భద్రతా పరిశీలనల్లో వీటి సేవలు ఎంతో విలువైనవిగా మారాయి.
శునకాల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని వారి శ్రమను గుర్తించిన జిల్లా పోలీసు శాఖ, వారి మానసిక ఉల్లాసం, శారీరక ఉత్సాహం కోసం ఈ ఈత కొలనును ఏర్పాటుచేయడం అభినందనీయమైన చర్య. ఈ పూల్ ద్వారా వేసవిలో గ్రీష్మ ప్రభావాన్ని తగ్గించడమే కాకుండా శునకాలకు ఆరోగ్యకరమైన వ్యాయామం కూడా లభిస్తుంది. తక్కువ వ్యవధిలో, తక్కువ ఖర్చుతో, ఈ సదుపాయాన్ని కల్పించిన ఎస్పీ అఖిల్ మహజన్‌కు డాగ్ స్క్వాడ్ సిబ్బంది ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఇది ఇతర జిల్లాలకు ఆదర్శంగా నిలవనుంది.