HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Summit Show Utter Flop Show Harish Rao

Telangana Rising Global Summit: సమ్మిట్ షో.. అట్టర్ ఫ్లాప్ షో! – హరీష్ రావు తీవ్ర విమర్శలు

Telangana Rising Global Summit: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన 'తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025' పై మాజీ మంత్రి మరియు బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు

  • Author : Sudheer Date : 10-12-2025 - 12:45 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Harishrao Global
Harishrao Global

తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో హైదరాబాద్ వేదికగా జరిగిన ‘తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025’ పై మాజీ మంత్రి మరియు బీఆర్‌ఎస్ సీనియర్ నేత హరీష్ రావు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ సమ్మిట్‌ను పెట్టుబడులను ఆకర్షించే గ్లోబల్ ఈవెంట్‌గా కాకుండా, భూములను అమ్ముకునేందుకు ఏర్పాటు చేసిన రియల్ ఎస్టేట్ ఎక్స్‌పో లాగా ఉందని ఆయన ఆరోపించారు. ‘ఫ్యూచర్ సిటీ’ వేదికగా నిర్వహించిన ఈ కార్యక్రమం, గతంలో జరిగిన అందాల పోటీలు లేదా ఏఐ సమ్మిట్‌ల మాదిరిగానే అట్టర్ ఫ్లాప్ షోగా మిగిలిందని ఆయన ఎద్దేవా చేశారు. విడుదల చేసిన విజన్ డాక్యుమెంట్‌పై కూడా హరీష్ రావు ప్రశ్నలు సంధించారు. అందులో ‘విజన్ లేదు, దాన్ని చేరుకునే మిషన్ లేదు’ అని, అది అక్షరాలు, అంకెలు, రంగురంగుల పేజీలతో కూడిన అర్థం లేని అబద్ధాల డాక్యుమెంట్ అని కొట్టిపారేశారు. ఈ సమ్మిట్ కేవలం రెండేళ్ల పాలన వైఫల్యాల నుంచి ప్రజల దృష్టిని మరల్చడానికి సీఎం రేవంత్ రెడ్డి చేసిన పీఆర్ స్టంట్ మాత్రమేనని ఆయన ఆరోపించారు.

Fire Accident : ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదం

ఫార్మా సిటీ భూముల్లో ఫ్యూచర్ సిటీ అని, ఆ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడుల కోసమే గ్లోబల్ సమ్మిట్ అంటూ రేవంత్ రెడ్డి ఒక ‘బయో స్కోప్ సినిమా’ చూపించారని ఆరోపించారు. ఇప్పటికే రాష్ట్రంలో భూముల స్కాం, పవర్ స్కాం, లిక్కర్ స్కాం అయ్యిందని, ఇప్పుడు రియల్ ఎస్టేట్ స్కాంకు తెరతీశారని అన్నారు. ఫ్యూచర్ సిటీ వైపు రియల్ ఎస్టేట్ డెవలప్‌మెంట్ కోసమే ఈ సమ్మిట్ పెట్టారని, ఫార్మా సిటీ పక్కన ఉన్న భూములను ముందే బినామీలతో కొనిపించి, ఇప్పుడు గ్లోబల్ సమ్మిట్ పేరుతో ఆ భూములను తెగ నమ్మడానికి ప్లాన్ వేశారని ఆయన విమర్శించారు. అంతేకాక 18 రాష్ట్రాల ముఖ్యమంత్రులు, 5 వేల మంది విదేశీ ప్రతినిధులు వస్తారని ప్రభుత్వం ప్రచారం చేసినప్పటికీ, ఒక్క ముఖ్యమంత్రి కూడా రాలేదని, ఎంబీఏ విద్యార్థులను, కాంగ్రెస్ నాయకులను కోట్ వేసి తీసుకొచ్చి కూర్చోబెట్టారని హరీష్ రావు విమర్శిస్తూ, ఇది గ్లోబల్ సమ్మిట్ కాదని, లోకల్ సమ్మిట్.. అట్టర్ ఫ్లాప్ పొలిటికల్ షో అని ఎద్దేవా చేశారు.

‎Kids Health: చిన్నపిల్లలకు దగ్గు జలుబు ఉన్నప్పుడు అరటిపండు పెట్టకూడదా? వైద్యులు ఏం చెబుతున్నారంటే?

చివరగా హరీష్ రావు గత పెట్టుబడుల హామీలు మరియు అభివృద్ధి వికేంద్రీకరణ అంశాలపై కేంద్రీకరించారు. గతంలో దావోస్, ఏఐ సమ్మిట్, వరల్డ్ ఎకనామిక్ ఫోరం పర్యటనల ద్వారా ప్రకటించిన రూ. 1.78 లక్షల కోట్ల పెట్టుబడులు, వేల సంఖ్యలో ఉద్యోగాలు ఏమయ్యాయని ఆయన సీఎంను నిలదీశారు. నిన్నటి సమ్మిట్‌లో 5 లక్షల కోట్ల పైచిలుకు పెట్టుబడులు వచ్చాయని చెబుతున్న ప్రభుత్వం, రెండేళ్ల కాలంలో తెచ్చిన మొత్తం పెట్టుబడులు, గ్రౌండ్ అయిన కంపెనీలు, మరియు వచ్చిన ఉద్యోగాలపై శ్వేతపత్రం (White Paper) విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తామని చెప్పి, ఇప్పుడు మళ్లీ ఫ్యూచర్ సిటీ పేరుతో ఒకే ప్రాంతంలో పరిశ్రమలను కేంద్రీకరిస్తున్నారని ఆయన విమర్శించారు. చివరగా, సమ్మిట్‌లో టోనీ బ్లెయిర్, దువ్వూరి సుబ్బారావు లాంటి ప్రముఖులు సైతం పదేళ్ల బీఆర్‌ఎస్ పాలనలో తెలంగాణ సాధించిన అభివృద్ధిని కొనియాడారని గుర్తు చేస్తూ, తన చెత్త విధానాలతో కేసీఆర్ చేసిన అభివృద్ధిని నాశనం చేయవద్దని, చేతనైతే ఆ అభివృద్ధిని కొనసాగించి చూపాలని రేవంత్ రెడ్డికి హితవు పలికారు.


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Global Summit 2025
  • harish rao
  • Telangana Rising Global Summit

Related News

Madhavaram Krishna Rao, Kav

Kavitha : కేటీఆర్ ను అరెస్ట్ చేసేందుకు కవిత కుట్ర – BRS ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు

Kavitha : కేటీఆర్ ను అరెస్టు చేయించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కలిసి కవిత కుట్ర పన్నుతున్నారని ఆయన ఆరోపించారు

  • Galla Jayadev Global Summit

    Investment in Hyderabad : పెట్టుబడులకు హైదరాబాద్ బెస్ట్ డెస్టినేషన్ – గల్లా జయదేవ్

  • Global Summit 2025 Day 1

    Global Summit 2025 : తొలి రోజు సమ్మిట్ గ్రాండ్ సక్సెస్.. రూ.2.43 లక్షల కోట్ల పెట్టుబడులు

  • Special Features At The Glo

    Telangana Rising Global Summit 2025: గ్లోబల్ సమ్మిట్‌లో ప్రత్యేకతలు ఇవే !!

  • Mallikharjun

    Telangana Rising Global Summit 2025 : సమ్మిట్ కు రాలేకపోతున్న ఖర్గే

Latest News

  • Gannavaram : యార్లగడ్డ మార్క్ పాలన.. బాలికల హాస్టళ్లలో ఆరోగ్య భద్రతకు అత్యంత ప్రాధాన్యం

  • Telangana Rising Global Summit: సమ్మిట్ షో.. అట్టర్ ఫ్లాప్ షో! – హరీష్ రావు తీవ్ర విమర్శలు

  • Gannavaram : బాలికల వసతి గృహాలను ఆకస్మికంగా తనిఖీ చేసిన ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు

  • Adarsha Kutumbam : ‘ఆదర్శ కుటుంబం’తో వస్తున్న వెంకటేష్

  • Fire Accident : ఆర్‌కే బీచ్ పరిసర ప్రాంతాల్లో భారీ అగ్నిప్రమాదం

Trending News

    • Zelensky: భార‌త్‌కు జెలెన్‌స్కీ.. జ‌న‌వ‌రిలో వ‌చ్చే అవ‌కాశం?!

    • T20 World Cup 2026: టీ20 వ‌ర‌ల్డ్ క‌ప్‌ను ప్రసారం చేయడానికి జియోస్టార్ ఎందుకు నిరాకరించింది?

    • Expensive Car: భారతదేశంలో అత్యంత ఖరీదైన కారు ఏది? దాని ధర ఎంత?

    • IPL 2026 Mini Auction: ఐపీఎల్ 2026.. అబుదాబిలో డిసెంబర్ 16న వేలం, తుది జాబితాలో 350 మంది ఆటగాళ్లు!

    • Aadhaar Card: ఆధార్ కార్డుపై కీలక అప్‌డేట్.. ఇక‌పై అలా చేస్తే!!

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd