HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Successfully 100 Days Completed Kanti Velugu 2 0 Program

Kanti Velugu : వంద రోజులు పూర్తి చేసుకున్న కంటి వెలుగు 2.0

వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 24 జిల్లాల్లో కంటివెలుగు 2.0 కార్య‌క్ర‌మం 100

  • Author : Prasad Date : 18-06-2023 - 7:41 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Kanti Velugu
Kanti Velugu

వైద్యఆరోగ్య శాఖ మంత్రి హరీశ్‌రావు ఆదేశాల మేరకు రాష్ట్రంలోని 33 జిల్లాల్లో 24 జిల్లాల్లో కంటివెలుగు 2.0 కార్య‌క్ర‌మం 100 రోజులు పూర్తి చేసుకుంది. కంటివెలుగు కార్యక్రమం విజయవంతంగా 100 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా సచివాలయంలో ఘనంగా వేడుకలు జరిగాయి. 24 జిల్లాల్లో 100 శాతం స్క్రీనింగ్‌లు సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేసిన వైద్య ఆరోగ్య శాఖ మంత్రి హ‌రీష్ రావు.. అంకితభావంతో పనిచేస్తున్న ఆశా, ఏఎన్‌ఎం కార్యకర్తలను అభినందించారు. కంటివెలుగు కార్యక్రమం తెలంగాణలో నివారణ చర్యలను అందించడం, అంధత్వాన్ని నిర్మూలించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ మహత్తర కార్యక్రమ నిర్వహణలో పాల్గొన్న ఆరోగ్య శాఖ, ఇతర శాఖలు, ప్రజాప్రతినిధుల కృషిని హరీశ్‌రావు కొనియాడారు. తెలంగాణ ప్రజలకు ఉచిత కంటి పరీక్షలు, కళ్లద్దాలు అందించే ఈ ప్రతిష్టాత్మక పథకాన్ని అమలు చేయడంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాత్ర కీల‌క‌మ‌న్నారు. కంటివెలుగు కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా 161 మిలియన్ల మందిని విజయవంతంగా పరీక్షించిందని తెలిపారు. కార్యక్రమంలో భాగంగా 22.51 లక్షల మందికి ఉచితంగా రీడింగ్ గ్లాసెస్ అందజేయగా, 18.08 లక్షల మందికి ప్రిస్క్రిప్షన్ గ్లాసెస్ ఉచితంగా అందించారు. తెలంగాణ వ్యాప్తంగా కంటి పరీక్షలు పూర్తి చేసేందుకు మిగిలిన తొమ్మిది జిల్లాల్లో కూడా ఇదే విధమైన అంకితభావం, స్ఫూర్తిని కొనసాగించాలని హరీశ్‌రావు అధికారులను కోరారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • Health Minister Harish Rao
  • Kanti Velugu
  • Kanti Velugu scheme
  • Minister Harish Rao
  • telangana

Related News

    Latest News

    • Ashok Gajapathi Raju: నా స్థలాన్ని ప్రభుత్వ భూమిగా మార్చారు: అశోక్ గజపతిరాజు

    • Hero MotoCorp : హీరో మోటోకార్ప్ సరికొత్త ప్రయోగం.. మార్కెట్లోకి ‘ప్యాషన్+ డిస్క్’ లాంచ్!

    • IMT : హైదరాబాద్‌లో ‘అభ్యుదయ 2026’ ముగింపు

    • MK Stalin: విజయ్ ప్రభుత్వం త్వరలోనే కూలిపోతుంది.. ఎన్నికలకు సిద్ధంగా ఉండండి: స్టాలిన్

    • Amazon: అమెజాన్ ప్రైమ్ డే జులై 4 నుంచి ఆఫర్ల సునామీ

    Trending News

    HashtagU Telugu
    • Contact Us
    • About Us
    • Privacy & Cookies Notice
    Network
    • English News
    • Telugu News
    • Hindi News
    Category
    • Telangana News
    • Andhra Pradesh News
    • National News
    • South
    • Entertainment News
    • Trending News
    • Special News
    • Off Beat
    • Business News
    Trending News
    • Health Tips
    • Movie Reviews
    • 2024 Olympics
    • Life Style
    • Nara Lokesh
    • Nara Chandrababu Naidu
    • Revanth Reddy
    • kcr

    follow us

    • Copyright © 2026 Hashtag U. All rights reserved.
    • Powered by Veegam Software Pvt Ltd