CM Revanth Warning : రైతులను మోసం చేస్తే కఠిన చర్యలు
CM Revanth Warning : వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు (farmers) అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని
- By Sudheer Published Date - 09:33 AM, Sat - 17 May 25

తెలంగాణలో వానాకాలం పంటల సాగు ప్రారంభానికి ముందు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) కీలక ఆదేశాలు జారీ చేశారు. వ్యవసాయ శాఖ అధికారులు అన్ని జిల్లాల్లో పంటల సాగు విస్తీర్ణానికి అవసరమైన విత్తనాలు, ఎరువులు సకాలంలో రైతులకు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొనకుండా ముందుగానే సన్నాహాలు పూర్తి చేయాలని స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.
Harihara Veeramallu : ‘హరిహర వీరమల్లు’ నుంచి మూడో పాట వచ్చేస్తుందోచ్ !!
వానాకాలంలో నకిలీ విత్తనాల సమస్య ఎక్కువగా వస్తుందన్న అంశాన్ని దృష్టిలో ఉంచుకుని, రైతులను మోసం చేసే నకిలీ విత్తన వ్యాపారులు, కంపెనీలపై కఠినంగా వ్యవహరించాలని సీఎం ఆదేశించారు. ఇటువంటి దుశ్చర్యలను నిరోధించేందుకు వ్యవసాయ శాఖతో పాటు పోలీస్ శాఖ కూడా సంయుక్తంగా తనిఖీలు, దాడులు నిర్వహించాలన్నారు. రైతులకు నష్టాన్ని కలిగించే ఎటువంటి కుయుక్తులను సహించబోమని సీఎం తేల్చి చెప్పారు.
రైతుల సంక్షేమం, పంటల దిగుబడి పెంపు లక్ష్యంగా ప్రభుత్వము కట్టుబడి ఉందని సీఎం రేవంత్ తెలిపారు. అందుకే నకిలీ విత్తనాల విక్రయాన్ని అరికట్టేందుకు ఊహించని సమయంలో తనిఖీలు, కేసుల నమోదు, అరెస్టులు వంటి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. వ్యవసాయ శాఖ అధికారులు రైతులతో సమీక్షలు నిర్వహిస్తూ, పంటల ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని సూచించారు.