Rohini Karte : ‘‘రోహిణి కార్తెలో జోరు వర్షాలు’’.. కూల్‌గా మారిన మే
ఈసారి 8 రోజులు ముందే నైరుతి రుతుపవనాలు(Rohini Karte) మన దేశంలోకి ప్రవేశించాయి.
- By Pasha Published Date - 07:33 PM, Sun - 25 May 25

Rohini Karte : ‘‘రోహిణి కార్తెలో రోళ్లు పగిలే ఎండలు ఉంటాయి’’ అనే నానుడి మన మైండ్‌లో నాటుకుపోయింది. ఈసారి నెలకొన్న విభిన్న వాతావరణ పరిస్థితులను చూస్తుంటే.. ఈ నానుడికి కాలం చెల్లింది అనిపిస్తోంది. ఈరోజు(మే 25న) రోహిణి కార్తె ప్రారంభమైంది. అయితే రోళ్లు పగిలే రేంజులో భగ్గుమనే ఎండలేం లేవు. అంతటా కూల్‌గా ఉంది. జనం రిలాక్స్‌డ్‌గా ఫీలవుతున్నారు. ఈ సారి వేసవికాలం కూడా వర్షాకాలాన్ని తలపిస్తోంది. మే నెల మొదలైనప్పటి నుంచి అడపాదడపా వానలు పడుతూనే ఉన్నాయి. దీంతో ఈదఫా మే నెలలో జనం ఎండల జంకు లేకుండా గడిపారు.
Also Read :Kavithas New Party: కవిత కొత్త పార్టీ పేరుపైనా తీరొక్క ఊహాగానాలు ?!
8 రోజుల ముందే వచ్చేసిన ‘నైరుతి’
ఈసారి 8 రోజులు ముందే నైరుతి రుతుపవనాలు(Rohini Karte) మన దేశంలోకి ప్రవేశించాయి. ఆ వెంటనే వాతావరణ విభాగం ఓ చల్లటి ప్రకటన విడుదల చేసింది. రాబోయే నాలుగు రోజుల పాటు తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లోని పలు జిల్లాలకు వర్షసూచన ఉందని వెల్లడించింది. దీంతో మే నెల గడవకముందే వర్షాకాలం సీజన్‌కు సైరన్ మోగింది. మొత్తం మీద ఈ ఏడాది వర్షాలు అధికంగా కురుస్తాయని వాతావరణ శాఖ అంటోంది. అంటే.. రోళ్లు పగిలే ఎండలకు బదులుగా, నదులన్నీ నిండే వానలు కురవబోతున్నాయి. ఇప్పటికే అకాల వర్షాలు మొదలయ్యాయి. బంగాళాఖాతం, అరేబియా మహా సముద్రాల్లో ఏర్పడుతున్న అల్పపీడనాల కారణంగా వర్షాలు కురిసే సూచనలు బలపడుతున్నాయి. అయితే అకాల వర్షాల వల్ల భూమి సారంలో తేడా వచ్చే ముప్పు ఉంటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు అడ్వాన్సుగా వర్షాలు పడి, సాగు కాలం నాటికి వర్షాలు పడకపోతే పరిస్థితి ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు.
రోహిణి కార్తె గురించి..
జ్యోతిష్యశాస్త్రం ప్రకారం.. గ్రహాలకు రాజు సూర్యుడు. ఈసారి మే 25న సూర్యుడు రోహిణి నక్షత్రంలోకి ప్రవేశించాడు. నక్షత్రాలు, గ్రహాల గమనాన్ని బట్టి పంచాంగాన్ని రూపొందిస్తారు. జాతకాలను తయారు చేస్తారు. సూర్యోదయం కాలానికి ఏ నక్షత్రం దగ్గరగా ఉంటే ఆరోజు ఆ నక్షత్రం పేరు పెడతారు. పౌర్ణమి వేళ చంద్రుడికి దగ్గరగా ఏ నక్షత్రం ఉంటే ఆ నెలకు ఆ పేరును నిర్ణయిస్తారు. తెలుగు వారు మాత్రం ఇవే నక్షత్రాలతో వ్యవసాయ పంచాంగాన్ని రూపొందించుకున్నారు. ఈ నక్షత్రాలను కార్తెలు అని పిలుస్తారు. ఈ లెక్కన సూర్యుడు ఏ నక్షత్రానికి దగ్గరా ఉంటే ఆ కాలానికి కార్తె అని పేరు పెట్టారు. అంటే ఏడాదికి 27 కార్తెలు. అందులో ఒకటే రోహిణి కార్తె. రోహిణి కార్తెతో వేసవి కాలం పూర్తయిపోతుంది. ఆ తర్వాత వర్షాకాలం ప్రారంభమవుతుంది.