HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy

  • Telugu News
  • >Telangana
  • >Statue Of Equality Will Send A Message Of Peace Kcr

KCR: భక్తి ఉద్యమంలో రామానుజచార్యులు గొప్ప విప్లవం సృష్టించారు!

కూడిన శ్రీరామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె.

  • By Hashtag U Published Date - 10:29 PM, Thu - 3 February 22
  • daily-hunt
D24ff27b A64e 4691 934b 3b6d4a4cbc51 Imresizer
D24ff27b A64e 4691 934b 3b6d4a4cbc51 Imresizer

రామానుజాచార్యుల బోధనలకు వెయ్యేండ్ల తరువాత తెలంగాణ రాష్ట్రం కేంద్రం కావడం ఎంతో గొప్ప విషయమని ముఖ్యమంత్రి కె. చంద్ర శేఖర్ రావు అన్నారు. ప్రపంచానికి సమతా దార్శనికుడైన శ్రీ రామానుజాచార్య విరాట్ విగ్రహాన్ని హైదరాబాదులో స్థాపించడం అద్భుతమని ఆన్నారు. శ్రీచినజీయర్ స్వామి, వారి అశేష అనుచరులు, అభిమానులు ఇందుకు సంబంధించి మహా అద్భుతమైన కృషి చేసారని సీఎం కొనియాడారు. మచ్చింతల్ లో చినజీయర్ స్వామి ఆధ్వర్యం లో నిర్వహిస్తున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది సమరోహ కార్యక్రమాల సందర్భంగా సీఎం కేసిఆర్ కార్యస్థలిని గురువారం సతీ సమేతంగా సందర్శించారు. ఈ సందర్భంగా చిన జీయర్ స్వామి తన కుటీరం లోకి సీఎం కెసీఆర్ దంపతులను సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమాల ఏర్పాట్ల గురించి జీయర్ స్వామి నీ సీఎం అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా…సీఎం మాట్లాడుతూ.. శ్రీ రామానుజాచార్యుల వారు భక్తి ఉద్యమంలో గొప్ప విప్లవాన్ని తీసుకొచ్చారని, మానవులు అందరూ సమానమని, సమానత్వం కోసం వెయ్యేండ్ల క్రితమే ఎంతో కృషి చేసారని సీఎం అన్నారు. ఈ ప్రతిష్టాత్మకమైన దేవాలయాలకు వచ్చే భక్తులకు ఆధ్యాత్మిక సాంత్వన మానసిక ప్రశాంతత చేకూరుస్తుందన్నారు. పర్యాటకులకే కాకుండా మానసిక ప్రశాంతత కోరుకునే ప్రతీ ఒక్కరికీ ఇది ప్రశాంత నిలయంగా మారుతుందనీ సీఎం అన్నారు. సమతా మూర్తి విగ్రహ స్థాపన దేశం గర్వించదగిన గొప్ప నిర్మాణానమనీ ఆన్నారు. సమానత్వం కోసం శ్రీరామానుజాచార్యులు తెలిపిన ప్రవచనాలను ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఎంతో నిబద్ధతతో అనుసరించడం గొప్ప విషయమని సీఎం అన్నారు.
తెలంగాణ వేదికగా తిరిగి వెయ్యేండ్ల తర్వాత ఆ మహామూర్తి బోధనలు మళ్లీ మరింత ప్రాచుర్యంలోకి రావడం అవి మరో వెయ్యేండ్లపాటు ప్రపంచవ్యాప్తం కానుండటం మనందరికీ ఎంతో గర్వకారణమని సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు.

హిందూ ధర్మాన్ని అనుసరించే ఆధ్యాత్మిక భక్తులకు, ధార్మికులకు ముచ్చింతల్ లో సకల వసతులను సమకూర్చడం సంతోషకరమని, ఈ పుణ్యక్షేత్రం భవిష్యత్తులో మరింత సుందర మనోహర భక్తిపారవశ్యం నింపే దివ్యక్షేత్రంగా అలరారనున్నదని సీఎం కేసీఆర్ అన్నారు. అనతికాలంలోనే ఈ సమతామూర్తి వేదిక ప్రపంచ ధార్మిక, ఆధ్యాత్మిక, పర్యాటక కేంద్రంగా విశేష ప్రాచుర్యం పొందనున్నదని సీఎం తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా శ్రీరామానుజాచార్యులవారికి ఉన్న కోట్లాది మంది భక్తులకు భారతదేశంలో మరో అద్భుతమైన ఆధ్యాత్మిక కేంద్రంగా ఈ ప్రాంతం వర్థిల్లనున్నదని సీఎం అన్నారు. స్ఫూర్తిస్థలి అయిన తెలంగాణ గడ్డ మీద ఆరంభమవుతున్న శ్రీరామానుజుల వారి సమతా స్ఫూర్తిని అందుకొని తెలంగాణ ముందుకు సాగుతుందని సీఎం కేసీఆర్ అన్నారు. కులాలకు, మతాలకు అతీతంగా విభిన్న సాంస్కృతిక, సాంప్రదాయాలను ఏకతాటిపైన నడిపించే సామాజిక సమతను తాము కొనసాగిస్తామని అన్నారు.

రామానుజ విగ్రహ ప్రతిష్ఠాపనకైన మొత్తం ఆర్థిక వనరులను సమకూర్చు కోవడం, అన్ని రకాల ఏర్పాట్లను స్వయంగా జీయర్ స్వామివారే దగ్గరుండి చూసుకోవడం గొప్ప విషయమని సీఎం అన్నారు. ఈ మహాకార్యంలో తమ శక్తివంచన లేకుండా పనిచేస్తున్న శ్రీచినజీయర్ స్వామి వారి మిషన్ కు శతసహస్ర వందనాలు తెలుపుతున్నానని సీఎం కేసీఆర్ అన్నారు. సమారోహ కార్యక్రమ సందర్భంగా అన్ని ఏర్పాట్లను ప్రభుత్వ యంత్రాంగం దగ్గరుండి చూసుకుంటున్నదని శ్రీచినజీయర్ స్వామి కి మరోమారు సీఎం తెలిపారు. మరోహనికి హాజరైతున్న ముఖ్య అతిథులకు కావాల్సిన ఏర్పాట్ల కోసం రాష్ట్ర ప్రభుత్వం అన్ని చర్యలను తీసుకుందని సీఎం అన్నారు. తమ కుటుంబం తరపున ఈ మహా ఉత్సవానికి వచ్చే పండితులు భక్తుల కోసం ఫలాలు ప్రసాదాన్ని పండ్లను అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. శ్రీరామానుజ సహస్రాబ్ధి సమారోహాల నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం జాగ్రత్త గా సమకూరుస్తునడడం పట్ల చినజీయర్ స్వామి సంతోషం వ్యక్తం చేశారు. సందర్శనకు వచ్చిన సీఎం కేసీఆర్ దంపతుల ను తన కుటీరానికి సాదరంగా ఆహ్వానించిన శ్రీచినజీయర్ స్వామి సహస్రాబ్ధి ఉత్సవాల కార్యక్రమాలను సీఎం కు వివరించారు.

యాగాలు నిర్వహించడానికి తమిళనాడు, కర్నాటక, తిరుపతి నుంచే కాకుండా నేపాల్ తదితర దేశాల నుండి, దేశవ్యాప్తంగా ఉన్న వైష్ణవ క్షేత్రాల నుంచి కూడా వేద పండితులు తరలివస్తున్నారని తెలిపారు. వివిధ ప్రాంతాల నుంచి తరలివస్తున్న భక్తులకు ప్రభుత్వం రవాణా లోటు లేకుండా చేయడం సంతోషకరమన్నారు. సమారోహానికి తరలివస్తున్న భక్తుల కోసం స్వచ్ఛమైన మిషన్ భగీరథ నీళ్లు అందుతున్నాయన్నాయని శ్రీచినజీయర్ స్వామి ఆనందం వ్యక్తం చేసారు.. అన్నీ పద్ధతి ప్రకారం సాగుతున్నాయని రెవెన్యూ, పోలీసు, విద్యుత్, నీరు, సానిటైజేషన్ తదితర అన్ని శాఖలు సహకరిస్తున్నారని తెలిపారు. ఇప్పటికే కార్యక్రమాలు పురోగతిలో ఉన్నాయని, ఎటువంటి ఇబ్బందులు లేవని అన్నారు. ఈ పదిరోజుల పాటు నిర్వహించునున్న కార్యక్రమాలను సీఎంకు శ్రీచినజీయర్ స్వామి స్వయంగా వివరించారు. చిన్నప్పటి నుంచే ఆధ్యాత్మిక, ధార్మిక విషయాల పట్ల ఇష్టాన్ని పెంచుకోవడం మంచి అలవాటని కల్వకుంట్ల హిమాన్షు రావును శ్రీచినజీయర్ స్వామి ఈ సందర్భంగా ఆశీర్వదించారు. ‘‘తాత కేసీఆర్ నుంచి ఆధ్యాత్మికత, భక్తిప్రపత్తుల విషయాల్లో వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్నావని’’ అభినందించారు.

ముచ్చింతల్‌లోని శ్రీశ్రీశ్రీ త్రిదండి చిన్న జీయర్‌ స్వామి ఆశ్రమంలో జరుగుతున్న శ్రీ రామానుజ సహస్రాబ్ది వేడుకలలో పాల్గొన్న సీఎం శ్రీ కేసీఆర్ https://t.co/n4lKbEcxjw

— Telangana CMO (@TelanganaCMO) February 3, 2022


Follow us
HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • 216-foot statue of Ramanujacharya
  • Chinna Jeeyar SWamy
  • kcr
  • telanagan Chief minister

Related News

Bandla Krishna Mohan Reddy

Bandla Krishna Mohan Reddy : నేను బిఆర్ఎస్ ను వీడలేదు – బండ్ల క్లారిటీ

Bandla Krishna Mohan Reddy : తాను BRS పార్టీలోనే కొనసాగుతున్నానని, వేరే ఏ పార్టీలో చేరలేదని ఆయన స్పష్టం చేశారు. ఇటీవల కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఆయన వ్యవహరిస్తున్నారంటూ వార్తలు వచ్చిన నేపథ్యంలో, పార్టీ మార్పుపై వస్తున్న పుకార్లకు ఈ ప్రకటనతో ముగింపు పలికారు

  • Key discussions in Erravalli.. KCR, Harish Rao discuss future strategy

    BRS : ఎర్రవల్లిలో కీలక చర్చలు..భవిష్యత్ వ్యూహంపై కేసీఆర్, హరీష్ రావు మంతనాలు

  • Cbi Director

    CBI : హైదరాబాద్ కు సీబీఐ డైరెక్టర్.. కారణం అదేనా..?

  • Harish Rao Kcr

    Harish Rao : రేపు KCRతో హరీశ్ భేటీ..ఏంచెప్పబోతున్నాడో..!!

  • Revanth Brs

    Revanth Counter : మీ పంపకాల పంచాయతీలో మమ్మల్ని లాగకండి – కవిత కు రేవంత్ కౌంటర్

Latest News

  • Congress : ప్రభుత్వం మారితేనే న్యాయం జరుగుతుందేమో..? – రాజగోపాల్ కీలక వ్యాఖ్యలు

  • Kutami Super 6 : అనంతపురంలో ఈ నెల 10న సూపర్ సిక్స్-సూపర్ హిట్ సభ

  • Nara Lokesh : శ్రీ ఆదిచుంచనగిరి మఠాన్ని సందర్శించిన మంత్రి నారా లోకేశ్

  • TTD: రేపు ఎన్నిగంట్లకు టీటీడీలో దర్శనమంటే.?

  • Venezuela : కరేబియన్‌లో ఉద్రిక్త వాతావరణం: వెనుజువెలా ఆక్రమణకు అమెరికా సిద్ధం..!

Trending News

    • GST Rates: జీఎస్టీ మార్పులు.. భారీగా త‌గ్గ‌నున్న ధ‌ర‌లు!

    • GST Reforms Impact: హోట‌ల్స్ రూమ్స్‌లో ఉండేవారికి గుడ్ న్యూస్‌!

    • Lunar Eclipse: రేపే చంద్ర‌గ్ర‌హ‌ణం.. ఏ దేశాల‌పై ప్ర‌భావం అంటే?

    • Chandra Grahan 2025 : 7న సంపూర్ణ చంద్రగ్రహణం..జ్యోతిష్య ప్రభావంతో ఏ రాశులకు శుభం? ఏ రాశులకు అశుభం?..!

    • Yograj Singh: ధోనితో సహా చాలా మంది ఆటగాళ్లు వెన్నుపోటు పొడిచారు: యువ‌రాజ్ తండ్రి

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2025 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd