State Government: కీలక ఫైళ్లు మిస్సింగ్ ఘటనపై రాష్ట్ర ప్రభుత్వం సీరియస్!
ఎన్నికల తర్వాత పలు మంత్రిత్వ శాఖల్లో కీలక ఫైళ్లు మాయం కావడం పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం సీరియస్ అయ్యింది.
- By Balu J Published Date - 11:41 AM, Sat - 16 December 23

State Government: అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత వివిద శాఖల ఫైళ్లు అదృశ్యం కావడం రాష్ట్ర ప్రభుత్వం సీరియస్‌గా దృష్టి సారించింది. ఇలాంటి ఘటనలు జరగకుండా అధికారులకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎ.శాంతికుమారి కఠిన ఆదేశాలు జారీ చేశారు. ఫైళ్లు తారుమారు అయినట్లు గుర్తించబడితే, సంబంధిత వ్యక్తులపై అవసరమైన డిపార్ట్ మెంట్, క్రిమినల్ ప్రొసీడింగ్స్ తీసుకోబడుతాయి” అని CS హెచ్చరించారు.
ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండేందుకు విజిలెన్స్ ను పెంచాలని, కార్యాలయాల ఆర్డర్‌లు, వ్యవస్థలను పటిష్టం చేయాలని ప్రభుత్వం అన్ని శాఖల కార్యదర్శులు, అధిపతులను ఆదేశించింది. సెక్షన్ల వారీగా ప్రస్తుత ఫైళ్ల జాబితాను కంపైల్ చేయాలని అందరు కార్యదర్శులకు సూచించారు. అలాగే 2014 నుండి డిజిటల్ చేయబడిన పైళ్లు కూడా మాయమైనట్టు ప్రస్తావనకు తెచ్చారు.
సెక్రటరీలు తమ తమ డిపార్ట్‌మెంట్లలో ఫైల్‌లు ప్రాసెస్ చేయబడే కంప్యూటర్లు, ఫైల్‌లు భద్రంగా ఉంచుకోవాలని హెచ్చరించారు. కార్యదర్శులందరూ ఈ నిబంధనలను పాటించాలని, డిసెంబర్ 18లోగా నివేదికను ప్రధాన కార్యదర్శికి అందజేయాలని ఆదేశించారు.
Also Read: Hyderabad: పోలీసులకు చుక్కలు చూపించిన దొంగ, షాకైన జనాలు