Sports : పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడలకు పీరియడ్ – భట్టి
ప్రస్తుతం చాల స్కూల్స్ లలో క్రీడలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎంతసేపు విద్యార్థులతో బుక్స్ పట్టిస్తున్నారు తప్ప..వారితో గేమ్స్ అనేవి ఆడించడం లేదు
- By Sudheer Published Date - 10:15 AM, Sat - 3 August 24

పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు (Sports Period for one hour every Day) క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ CM భట్టి విక్రమార్క (Bhatti Vikramarka) తెలిపారు. ప్రస్తుతం చాల స్కూల్స్ లలో క్రీడలకు పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదు. ఎంతసేపు విద్యార్థులతో బుక్స్ పట్టిస్తున్నారు తప్ప..వారితో గేమ్స్ అనేవి ఆడించడం లేదు. దీంతో విద్యార్థులు పూర్తిగా క్రీడలకు దూరం అవుతున్నారు. స్కూల్స్ నుండి వెళ్తే పిల్లలంతా ఫోన్లలో నిమగ్నం అవుతూ..అసలు ఆటలనే మరచిపోతున్నారు. ఈ క్రమంలో తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకున్నారు.
We’re now on WhatsApp. Click to Join.
పాఠశాలల్లో ప్రతిరోజూ గంటపాటు క్రీడల పీరియడ్ ఉండేలా విద్యాశాఖకు ఆదేశాలిస్తామని శాసనమండలిలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. గ్రామాల్లోని క్రీడాప్రాంగణాలను వినియోగంలోకి తెచ్చి, ఆగస్ట్ 15, జనవరి 26న అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఆటలపోటీలు నిర్వహిస్తామని ఆయన వెల్లడించారు. క్రీడలకు ప్రభుత్వం ప్రాధాన్యం ఇవ్వాలని, నిత్యం గంట స్పోర్ట్స్ పీరియడ్ పెట్టాలని ఎమ్మెల్సీలు ఆయన దృష్టికి తేవడంతో ఈ ప్రకటన చేశారు.
ఇదిలా ఉంటె ఈరోజు శనివారం మంత్రి భట్టి విక్రమార్క ఖమ్మం జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం 7 గంటలకు హైదరాబాద్ నుంచి బయలుదేరి 10-30 గంటలకు చింతక్ చేరుకుని రైతువేదికలో జిల్లా అధికారులతో దళిత బంధు కార్యక్రమం అమలు తీరును సమీక్షిస్తారు. అనంతరం మధ్యాహ్నం 2-30 గంటలకు ముదిగొండ మండలం కమలాపురం నుంచి పమ్మి, జిల్లెలగూడ, అయ్యగారిపల్లి, అమ్మపేట, అయ్యగారిపల్లి నుంచి బాణాపురం తండా, ఎస్సీ కాలనీ నుంచి వెంకటాద్రి చెరువు వరకు రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేస్తారు. అనంతరం సాయంత్రం 4-30 గంటలకు పమ్మిలో విద్యుత్ ఉపకేంద్రాన్ని భట్టి ప్రారంభిస్తారు.
Read Also : CM Revanth : అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్