Telangana Congress : టీ కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ పదవుల రేసులో ఉన్నది వీరే..
ముగ్గురు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పెద్దలు(Telangana Congress) సూచించినట్లు సమాచారం.
- By Pasha Published Date - 10:42 AM, Sat - 14 September 24

Telangana Congress : తెలంగాణకు కొత్త వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంపై కాంగ్రెస్ హైకమాండ్ ఫోకస్ పెట్టింది. రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ కంటే ముందే ఈ నియామక ప్రక్రియ పూర్తయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. ముగ్గురు నూతన వర్కింగ్ ప్రెసిడెంట్ల ఎంపికలో సామాజిక సమతుల్యత పాటించాలని కాంగ్రెస్ పెద్దలు(Telangana Congress) సూచించినట్లు సమాచారం.
Also Read :Sunita Williams : స్పేస్‌లో ఏడాది ఉండాల్సి వస్తుందనుకోలేదు.. ఫ్యామిలీని మిస్ అవుతున్నా : సునితా విలియమ్స్
వంశీచంద్‌రెడ్డి వైపే మొగ్గు..
ఈ పోటీలో ఎస్టీ వర్గం నుంచి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్, ఓసీ వర్గం నుంచి మాజీ ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి, భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్‌రెడ్డి పేర్లు ఉన్నాయని అంటున్నారు. అయితే కాంగ్రెస్ పెద్దలు వంశీచంద్‌రెడ్డి వైపే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది. మాజీ ఎమ్మెల్యే సంపత్ కుమార్ ప్రస్తుతం ఏఐసీసీ సెక్రెటరీగా ఉన్నారు. ఆయన పేరును కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పరిశీలించే ఛాన్స్ ఉందని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఎస్సీ వర్గం ఎమ్మెల్యేలు లక్ష్మణ్, వంశీకృష్ణ, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌తో పాటు మరో ఐదారుగురు లీడర్ల పేర్లను కూడా వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి కోసం పరిశీలించే ఛాన్స్ ఉందట.
Also Read :Pope Francis : ట్రంప్, కమల ‘‘మానవ జీవిత’’ వ్యతిరేకులు : పోప్ ఫ్రాన్సిస్
జగ్గారెడ్డికి ఆ పదవి..
ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ ఛైర్మన్‌గా మాజీ ఎంపీ మధుయాష్కిగౌడ్ ఉన్నారు. ఆయనకు ఏఐసీసీ అధికార ప్రతినిధిగా బాధ్యతలు అప్పగించనున్నారట. దీంతో ఖాళీ అవుతున్న కాంగ్రెస్ పార్టీ ప్రచార కమిటీ పదవిని మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కేటాయించనున్నారని తెలిసింది. ఇందుకు సీఎం రేవంత్ సానుకూలంగా ఉన్నట్లు సమాచారం. ఈ పదవులకు నేతలను ఎంపిక చేసే విషయంలో త్వరలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీతో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. మొత్తం మీద ఈ పదవులకు ఎవరెవరు ఎంపికవుతారు అనే దానిపై కాంగ్రెస్ పార్టీ వర్గాల్లో ఉత్కంఠ నెలకొంది.