Sonia Gandhi : దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందాం : సోనియాగాంధీ
Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందామని రాష్ట్ర ఓటర్లకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు.
- By Pasha Published Date - 04:38 PM, Tue - 28 November 23

Sonia Gandhi : కాంగ్రెస్ పార్టీని గెలిపించి.. దొరల తెలంగాణను ప్రజల తెలంగాణగా మార్చుకుందామని రాష్ట్ర ఓటర్లకు కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియాగాంధీ పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజల స్వప్నాలు సాకారం కావాలని.. మార్పు కోసం హస్తం గుర్తుకే ఓటు వేయాలని కోరారు. ‘మార్పు కావాలి.. కాంగ్రెస్ రావాలి’ అంటూ ఎన్నికల ప్రచారంలో కాంగ్రెస్ పార్టీ వినిపించిన నినాదాన్ని ఈసందర్భంగా సోనియా గుర్తు చేశారు. ఈమేరకు ఒక వీడియో సందేశాన్ని సోనియాగాంధీ ట్విట్టర్ వేదికగా విడుదల చేశారు.
తెలంగాణ కుటుంబ సభ్యులకు తల్లి సోనియమ్మ సందేశం😍#MaarpuKavaliCongressRavali pic.twitter.com/ctfLef7mJT
— Telangana Congress (@INCTelangana) November 28, 2023
We’re now on WhatsApp. Click to Join.
‘‘నేను అనారోగ్య పరిస్థితుల వల్ల తెలంగాణలో ఎన్నికల ప్రచారానికి రాలేకపోయాను. కానీ తెలంగాణవాసులు నా హృదయానికి చాలా దగ్గరకు ఉన్నారు’’ అని తన సందేశంలో సోనియాగాంధీ తెలిపారు. సోనియమ్మ అంటూ తనపై తెలంగాణ ప్రజలు ఎంతో ప్రేమ చూపారని ఆమె పేర్కొన్నారు. తెలంగాణ ప్రజల ప్రేమ, అభిమానాలకు జీవితాంతం రుణపడి ఉంటానని సోనియాగాంధీ చెప్పారు. తెలంగాణ అమరవీరుల స్వప్నాలు నెరవేరడాన్ని కళ్లారా చూడాలని అనుకుంటున్నాను అని ఆమె పేర్కొన్నారు. ‘‘మార్పు కావాలంటే కాంగ్రెస్ రావాలి. మార్పు కోసం కాంగ్రెస్‌కే ఓటు వేయండి. తెలంగాణ సోదరులు, అమ్మలు, బిడ్డలకు ఇదే నా వినతి’’ అని సోనియా (Sonia Gandhi) చెప్పారు.