HashtagU Telugu
Telugu
  • English
  • हिंदी
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • స్పెషల్
  • ఆఫ్ బీట్
Telugu
  • English
  • हिंदी
Hashtagu Logo
  • వార్తలు
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్
  • జాతీయం
  • సౌత్
  • సినిమా
  • ట్రెండింగ్
  • ఫోటో గ్యాలరీ
  • స్పీడ్ న్యూస్
  • హెల్త్
  • లైఫ్ స్టైల్
  • ఆధ్యాత్మికం
  • ఆఫ్ బీట్
  • Trending
  • # IPL 2025
  • # Revanth Reddy
  • # KTR
  • # PM Modi
  • # ChandrababuNaidu
  • # JaganMohanReddy
  • Telugu News
  • > Telangana
  • >Social Activist Medha Patkar In Hyderabad Police Stopped Her Why Did She Come

Medha Patkar : ‘మూసీ’ అలర్ట్.. హైదరాబాద్‌లో మేధాపాట్కర్.. అడ్డుకున్న పోలీసులు

వాస్తవానికి 2022 సంవత్సరం ఏప్రిల్‌లో కూడా మలక్‌పేట పరిధి మూసారాంబాగ్‌లోని తీగలగూడలో మేధాపాట్కర్‌‌(Medha Patkar)  పర్యటించారు.

  • Author : Pasha Date : 03-03-2025 - 12:25 IST

    Published By : Hashtagu Telugu Desk

  • daily-hunt
Social Activist Medha Patkar In Hyderabad Police Musi River

Medha Patkar : ప్రముఖ సామాజికవేత్త మేధాపాట్కర్‌‌ను హైదరాబాద్‌లోని చాదర్ ఘాట్‌లో పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మూసీ సుందరీకరణ పనులను ఆమె అడ్డుకోబోతున్నారనే పక్కా సమాచారంతోనే తాము అలర్ట్ అయినట్లు పోలీసులు తెలిపారు. అయితే తాను స్నేహితుల ఇంటికి వచ్చానని మేధాపాట్కర్ చెప్పారు. అయినా ఆమె మాటలను పోలీసులు అస్సలు పట్టించుకోలేదు. వెంటనే ఈ ప్రాంతాన్ని వదిలి వెళ్లాలని మేధా పాట్కర్‌కు సూచించారు. నర్మదా బచావో పేరుతో మేధాపాట్కర్ ఓ పర్యావరణ ఉద్యమాన్ని నడిపి ఫేమస్ అయ్యారు. దీంతో ఆమె మూసీ సుందరీకరణ పనుల వ్యవహారంపైనా గళం విప్పొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. వాస్తవానికి 2022 సంవత్సరం ఏప్రిల్‌లో కూడా మలక్‌పేట పరిధి మూసారాంబాగ్‌లోని తీగలగూడలో మేధాపాట్కర్‌‌(Medha Patkar)  పర్యటించారు. మూసీ పరివాహక ప్రాంతంలో గుడిసెలు కోల్పోయిన బాధితులతో ఆమె అప్పట్లో మాట్లాడారు. అనంతరం నేషనల్‌ అలియన్స్‌ ఆఫ్‌ పీపుల్‌ మూవ్‌మెంట్స్‌ (ఎన్‌ఏపీఎం), హ్యుమన్‌ రైట్స్‌ ఫోరం క్యాంపెయిన్‌ ఫర్‌ హౌసింగ్‌ రైట్స్‌, క్యాంపెయిన్‌ ఫర్‌ హౌజింగ్‌ అండ్‌ టెన్యూరల్‌ రైట్స్‌ (ఛత్రి),  రైతు స్వరాజ్‌ వేదిక సంస్థల సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో మేధాపాట్కర్‌ మాట్లాడారు.

Also Read :Milk Mafia : మిల్క్ మాఫియా.. మాల్టోడెక్స్‌ట్రిన్‌ కలిపిన పాలతో గండం

మేధా పాట్కర్‌ నడిపే ట్రస్టుపై ఈ కేసు

ఆదివాసీ పిల్లల చదువుల పేరుతో వసూలు చేసిన డబ్బును దుర్వినియోగం చేశారనే ఆరోపణలతో 2022 సంవత్సరం జులైలో మేధా పాట్కర్‌పై మధ్యప్రదేశ్‌లో కేసు నమోదైంది. ఆమె నడుపుతున్న నర్మదా నవనిర్మాణ అభియాన్ ట్రస్ట్ 14 ఏళ్లలో(2022 నాటికి) రూ.13 కోట్లు వసూలు చేసింది. ఈ  నిధుల వినియోగానికి సంబంధించిన లెక్కలు సరిగ్గా లేవంటూ పోలీసులకు అప్పట్లో ఫిర్యాదు అందింది. దీని ప్రకారం రూ. 1.5 కోట్ల కంటే ఎక్కువ విలువైన నగదుకు సంబంధించిన ఆడిట్ అస్పష్టంగా ఉంది. మేధా పాట్కర్ తన వార్షిక ఆదాయాన్ని రూ. 6,000గా చూపి కోర్టును తపపుదోవ పట్టించారని ఫిర్యాదుదారుడు ఆరోపించారు. ఆమె సేవింగ్స్ ఖాతా నుంచి రూ.19 లక్షల మొత్తాన్ని రికవరీ చేశారని పోలీసుల ఎఫ్‌ఐఆర్‌లో ప్రస్తావించారు.  తనపై వచ్చిన ఆరోపణలను మేధాపాట్కర్ అప్పట్లో ఖండించారు. ప్రతి ఆరోపణకు తన వద్ద సమాధానం ఉందన్నారు. తనపై ఫిర్యాదు చేసిన వారికి ఏబీవీపీ, ఆర్ఎస్ఎస్‌లతో సంబంధాలు ఉన్నాయన్నారు.


Follow us

HashtagU Telugu Google News HashtagU Telugu Facebook twitter-icon instagram whatsapp telugu-hashtagu

Tags

  • hyderabad
  • hyderabad police
  • Medha Patkar
  • Musi river
  • Social Activist
  • Social Activist Medha Patkar

Related News

Hyderabad Minor Girl instagram Trap Case

డబ్బున్న మైనర్ అమ్మాయిలు వారి టార్గెట్..

Hyderabad Minor Girl  ప్రేమ పేరుతో 20 మంది మైనర్ బాలికలను మోసగించి లక్షలాది రూపాయలు వసూలు చేసిన ఓ కేటుగాడిని జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ధనవంతుడిగా నటిస్తూ అమ్మాయిల వ్యక్తిగత ఫోటోలతో బ్లాక్‌మెయిల్ చేయడం ఇతని శైలి అని పోలీసులు తెలిపారు. జూబ్లీహిల్స్‌కు చెందిన డబ్బున్న బాలిక నుంచి రూ. 13 లక్షలు కాజేయడంతో పాటు మరో యువతిని శారీరక వేధింపులకు గురిచేసినట్లు తేలిం

  • Hyderabad Woman Disappears After Dispute Over Eating Curd

    పెరుగు తినమని చెప్పినందుకు ఇల్లు వదిలి వెళ్లిపోయిన భార్య

  • Dhoni Srh Match

    2026 IPL SRH – CSK Match : రేపటి మ్యాచ్ లో ధోని ఆడుతున్నాడా..?

  • Sanjana

    Actress Sajini : హైదరాబాద్‌లో మలయాళ నటిపై దాడి !!

  • LPL Financial opens first GCC outside US in Hyderabad

    హైదరాబాద్‌లో ఎల్‌పీఎల్ ఫైనాన్షియల్ భారీ పెట్టుబడి.

Latest News

  • Airlines Plane : 4 గంటలు ప్రయాణికులకు నరకం చూపించిన ఎయిర్లైన్స్ విమానం

  • Mango : మామిడి తోటకు సెక్యూరిటీ గార్డులతో భారీ సెక్యూరిటీ.. ఎందుకో తెలుసా ?

  • HBDOneAndOnlyCBN : చంద్రబాబుకు భువనేశ్వరి ఎమోషనల్ బర్త్ డే విషెస్

  • IPL 2026 : RR ఓటమిని తట్టుకోలేక ఎక్కి ఎక్కి ఏడ్చిన వైభవ్

  • Jr NTR: మామయ్యకు జూనియర్ ఎన్టీఆర్ విషెస్

Trending News

    • సీజ్‌ఫైర్‌పై నీలినీడలు?

    • గల్ఫ్ దేశాల్లో కొనసాగుతున్న ఉత్కంఠ.. హోర్ముజ్ జలసంధికి పొంచి ఉన్న ముప్పు!

    • ఏసీ నడపడానికి ఎంత సోలార్ సామర్థ్యం ఉండాలి?

    • Punarvika: చిన్నారి పునర్వికకు రూ.16 కోట్ల ఇంజెక్షన్‌ తెప్పించిన లోకేశ్‌

    • అక్షయ తృతీయ 2026.. లక్ష్మీ పూజ కోసం ఇంటిని ఎలా సిద్ధం చేయాలి?

HashtagU Telugu
  • Contact Us
  • About Us
  • Privacy & Cookies Notice
Network
  • English News
  • Telugu News
  • Hindi News
Category
  • Telangana News
  • Andhra Pradesh News
  • National News
  • South
  • Entertainment News
  • Trending News
  • Special News
  • Off Beat
  • Business News
Trending News
  • Health Tips
  • Movie Reviews
  • 2024 Olympics
  • Life Style
  • Nara Lokesh
  • Nara Chandrababu Naidu
  • Revanth Reddy
  • kcr

follow us

  • Copyright © 2026 Hashtag U. All rights reserved.
  • Powered by Veegam Software Pvt Ltd